Sania Mirza Shoaib Malik: మోసం చేసిన షోయబ్ మాలిక్‌కు విడాకులు ఇస్తున్న సానియా మీర్జా! వేర్వేరుగా ఉంటున్న వైనం!
Sania Mirza Shoaib Malik: పాక్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, టెన్నిస్ క్రీడాకారణి సానియా మీర్జా విడిపోయారా? వారి వివాహ బంధం బీటలు వారిందా? అంటే అవుననే అంటోందీ పాక్ మీడియా!
![Sania Mirza Shoaib Malik: మోసం చేసిన షోయబ్ మాలిక్‌కు విడాకులు ఇస్తున్న సానియా మీర్జా! వేర్వేరుగా ఉంటున్న వైనం! Sania Mirza Shoaib Malik headed for Divorce after Pakistan cricketer cheated on her Sania Mirza Shoaib Malik: మోసం చేసిన షోయబ్ మాలిక్‌కు విడాకులు ఇస్తున్న సానియా మీర్జా! వేర్వేరుగా ఉంటున్న వైనం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/08/80d24b3884ffb08e550134d89da0ff841667897371273251_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sania Mirza Shoaib Malik: పాక్ వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, టెన్నిస్ క్రీడాకారణి సానియా మీర్జా విడిపోయారా? వారి వివాహ బంధం బీటలు వారిందా? కొన్ని నెలలుగా వారు వేర్వేరుగా ఉంటున్నారా? తాను కట్టుకున్న సానియాను మాలిక్ మోసం చేశాడా? అంటే అవుననే అంటున్నాయి పాకిస్థాన్ మీడియా వర్గాలు! వీరిద్దరి సోషల్ మీడియా పోస్టులు, సందేశాలూ విడాకులనే ప్రతిబింబిస్తున్నాయి!
Sania Mirza Instagram story. pic.twitter.com/BBKEztyCa6
— Avinash Aryan (@AvinashArya09) November 6, 2022
దాదాపు 12 ఏళ్ల సానియా మీర్జా, షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్నారు. 2010లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. శత్రుదేశాల వారు కాబట్టి వీరి బంధం విమర్శలు, వివాదాలను సృష్టించింది. ఇద్దరూ ప్రొఫెషనల్ క్రీడాకారులే కావడంతో దుబాయ్‌లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేసి అక్కడే ఉన్నారు. నాలుగేళ్ల క్రితం వీరికి కొడుకు పుట్టాడు. ఇజాన్ అని పేరు పెట్టుకున్నారు. ఈ మధ్యే అతడి పుట్టినరోజు వేడుకను తల్లిదండ్రులు ఘనంగా నిర్వహించారు. ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకొన్నప్పుడు పెట్టిన సందేశాలు ఆశ్చర్యంగా, విచిత్రంగా అనిపించాయి.
View this post on Instagram
'నువ్వు పుట్టగానే మేము మరింత వినయంగా మారిపోయాం. జీవితానికి సరికొత్త అర్థం తెలిసింది. మేం బహుశా కలిసుండకపోవచ్చు. ప్రతి రోజూ కలవకపోవచ్చు. కానీ నాన్న ఎప్పుడూ నీ గురించి, ప్రతి క్షణం నీ నవ్వు గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. దేవుడు నీకు అన్నీ ఇవ్వాలని కోరుకుంటున్నా' అని షోయబ్ మాలిక్ పోస్టు చేశాడు. ఇందులో 'కలిసుండకపోవచ్చు' అనే పదాలు వీరు విడిపోయారేమో అనే సందేహాలు కలిగించాయి.
సానియా సైతం కొన్ని రోజుల క్రితం ఒక ఫొటో షేర్ చేసింది. 'నేను కష్టపడ్డ రోజుల్లోంచి బయటపడేసిన మధుర క్షణాలివి' అని వ్యాఖ్య పెట్టింది. వారం రోజులు క్రితం 'పగిలిన గుండెలు ఎంతదూరం కలిసి ప్రయాణిస్తాయి' అంటూ పోస్టు చేసింది. అటు షోయబ్, ఇటు సానియా దాదాపుగా ఒకే తరహాలో వ్యాఖ్యలు పెడుతుండటం వీరిద్దరూ విడిపోయారన్న వదంతులకు బలం చేకూరుస్తోంది. వీరిద్దరూ విడిపోయేందుకు స్పష్టమైన కారణాలైతే తెలియవు. అధికారికంగానూ వారేం చెప్పలేదు. అయితే కొన్ని రోజులు క్రితం మాలిక్ ఓ మోడల్‌ను కలిశాడని, ఆమెతో డేటింగ్ చేశాడని పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ దంపతులు విడిపోయారనీ ఏకంగా వార్తలే ఇస్తున్నారని తెలిసింది.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)