అన్వేషించండి

Sachin Tendulkar: పుల్వామాలో సచిన్‌ కుటుంబం, సెల్ఫీల కోసం అభిమానుల క్యూ

Sachin Tendulkar: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌  జమ్ముకశ్మీర్‌ పుల్వామా జిల్లాలోని MJ స్పోర్ట్స్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. టెండూల్కర్‌తో పాటు ఆయన భార్య అంజలి, కుమార్తె సారా వెళ్లారు.

Sachin Tendulkar Visits Bat Factory In Pulwama: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌(Sachin Tendulkar) జమ్ముకశ్మీర్‌ పుల్వామా జిల్లాలోని MJ స్పోర్ట్స్‌ ఫ్యాక్టరీని సందర్శించారు. టెండూల్కర్‌తో పాటు ఆయన భార్య అంజలి, కుమార్తె సారా వెళ్లారు. MJ స్పోర్ట్స్ బ్యాట్ల తయారీ పరిశ్రమ అవంతిపొరలోని చెర్సూ ప్రాంతంలో ఉంది. ఈ సందర్భంగా అక్కడ టీ తాగిన సచిన్‌ టెండూల్కర్‌ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులతో ముచ్చటించారు. ఫ్యాక్టరీ యజమానులతో కొంత సమయం సచిన్‌ కుటుంబం సరదాగా గడిపింది. అక్కడకు వచ్చిన అభిమానులతో టెండూల్కర్‌ సెల్ఫీలు దిగారు. 

ఇంగ్లీష్ బ్యాట్లకు, కశ్మీర్ బ్యాట్లకు తేడాను గమనించేందుకు వచ్చినట్లు సచిన్ చెప్పారని ఆ పరిశ్రమ యజమాని మహమ్మద్‌ షాహీన్‌ పారే తెలిపారు. కొన్ని బ్యాట్ల నాణ్యతను కూడా పరిశీలించారని చెప్పారు. కశ్మీర్ బ్యాట్లకు ప్రాచుర్యం కల్పించాలని కోరగా..సచిన్‌ అంగీకరించారని వెల్లడించారు. 

అందరికీ ఆరాధ్యుడే
ధోనీ దగ్గర నుంచి కోహ్లీ వరకు అందరూ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ను ఆరాధిస్తూ పెరిగిన వాళ్లే. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నా.. ఎన్నో చారిత్రక ఘటనలకు సాక్ష్యంగా నిలిచినా అది ఒక్క సచిన్‌కే చెల్లింది. ప్రపంచంలో శత శతకాలు సాధించి సచిన్‌ ఔరా అనిపించాడు. సచిన్ భారత్ తరఫున 200 టెస్టు మ్యాచ్‌లు, 463 వన్డేలు, ఒక టీ20 ఆడాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు (100) , పరుగులు 34,357 చేశాడు. ఏప్రిల్ 24,1973లో ముంబైలో జన్మించిన సచిన్, 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. టెస్ట్, వన్డే, టీ20 లో మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. బ్రియాన్‌ లారా కూడా అంతే 90ల్లో క్రికెట్‌ను శాసించిన దిగ్గజ క్రికెటర్లలో లారా ఒకడు. సచిన్‌ భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే.. లారా విండీస్‌ తరఫున రికార్డులు సృష్టించాడు. వీరిద్దరిలో ఎవరు ఉత్తమం అంటే.. అందరూ సచిన్‌ పేరే చెబుతారు. కానీ, ఆసీస్‌ ఆటగాళ్లు, అభిమానులు మాత్రం బ్రియాన్‌ లారా బెస్ట్‌ అని అంటారు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే అంశంపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌, దిగ్గజం అలీ బచర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


వేరే గ్రహం నుంచి వచ్చి ఉంటాడన్నలారా
సచిన్‌ వేరే గ్రహం నుంచి వచ్చి బ్యాటింగ్ చేశాడా అనిపిస్తుందని బచర్‌ అన్నాడు. అతడు ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ప్రత్యక్షంగా చూసిన తర్వాత అతను వేరే ప్లానెట్‌ నుంచి వచ్చి ఉంటాడని అనుకున్నట్లు వ్యాఖ్యానించాడు. వ్యక్తిగతంగానూ సచినే ఉత్తమమని... మైదానంలో ఎప్పుడైనా సచిన్‌ ఎవరితోనైనా గొడవ పడడం చూశారా అని బచర్‌ ప్రశ్నించాడు. ఆస్ట్రేలియా అభిమానులు సచిన్‌ కంటే లారా ఉత్తమమని భావిస్తుంటారు కానీ తన వరకు అవన్నీ చెత్తమాటలని ఏకిపారేశాడు. లారా కేవలం 40 లక్షల మంది ముందు మాత్రమే మ్యాచ్‌లు ఆడాడు. కానీ, సచిన్‌ 140 కోట్ల మంది అభిమానుల కోసం భారత్‌ తరఫున బరిలోకి దిగాడని ప్రశంసల జల్లు కురిపించాడు. ఇలాంటి సమయంలో ఒత్తిడి ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో ఊహించగలరా? అందుకే, సచిన్‌ కంటే లారా ఉత్తమమని తనకు చెప్పొద్దని బచర్‌ తెలిపాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్, అసలు నిజాలు చెప్పిన పోలీసులుగవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ తండ్రి..  ఎమోషనల్ వీడియోసెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
రైతు భరోసా విధి విధానాలపై మంత్రుల కమిటీ కసరత్తు - అన్నదాతల ఖాతాల్లో నిధుల జమ ఎప్పుడంటే?
Ramcharan Cutout: 256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
256 అడుగుల రామ్‌చరణ్ భారీ కటౌట్ - హెలికాఫ్టర్ సాయంతో పూలవర్షం, ప్రపంచ రికార్డుల్లోకి..
Numaish: ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
ప్రతిష్టాత్మక నుమాయిష్‌కు సర్వం సిద్దం - ప్రారంభ తేదీ వాయిదా, ఎప్పటి నుంచంటే?
Fake Calls: ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తున్నాయా? - వెంటనే ఇలా చేయండి!
Boxing Day Test Updates: భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
భారత్ నెగ్గాలంటే ఎంసీజీ రికార్డు బద్దలవ్వాల్సిందే - 96 ఏళ్ల కిందట టార్గెట్ ఛేదన, ఆసీస్ ఇన్నింగ్స్ ఎందుకు డిక్లేర్ చేయలేదు!
New Year Celebrations: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు - ఈ పబ్బులకు నో పర్మిషన్, ఎంజాయ్ చేయండి.. కానీ ఇవి తప్పనిసరి!
Borewell Deaths: పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
పదేళ్ల బాలుడి ఉసురు తీసిన బోరుబావి - 16 గంటలు శ్రమించినా దక్కని ఫలితం, చిన్నారుల పాలిట మృత్యుపాశాలుగా..
Sandhya Theater Stampede: 'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
'ఆ రోజు థియేటర్ నిర్వహణ మైత్రీ మూవీ మేకర్స్ తీసుకుంది' - పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ
Embed widget