By: ABP Desam | Updated at : 25 Dec 2022 06:18 PM (IST)
Edited By: nagavarapu
సంజూ శాంసన్ దంపతులు (source: instagram)
Sanju Samson Christmas Post: టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ తండ్రి కాబోతున్నాడా! సంజూ సతీమణి చారులత ప్రెగ్నెంట్ అయ్యారా! అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈరోజు క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సంజూ, తన సతీమణి ఇన్ స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలు షేర్ చేసి అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. వాటిని చూసిన నెటిజన్లు త్వరలోనే వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఆ క్యాప్షన్ అర్ధం అదేనా!
క్రిస్మస్ సందర్భంగా సంజూ శాంసన్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తన భార్యతో కలిసి ఇంట్లో అందంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీ దగ్గర దిగిన ఫొటోలను పోస్ట్ చేశాడు. అలాగే దానికి కాప్షన్ ను జత చేశాడు. మేం ఇప్పటికే పొందిన ఆశీర్వాదాలను గుర్తించడమే ఈ క్రిస్మస్ కు మేం అందుకున్న ఉత్తమ బహుమతి. అందరికీ పండుగ శుభాకాంక్షలు అని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. దాన్ని బట్టే సంజూ తండ్రి కాబోతున్నాడని నెటిజన్లు భావిస్తున్నారు. అలాగే సంజూ భార్య చారులత పెట్టిన ఫొటోలో వారు నిలబడిన తీరు కూడా నెటిజన్ల అభిప్రాయానికి కారణమైంది. ఏదేమైనా ఇది నిజమా కాదా అనేది వారే తేల్చాలి.
ఇక క్రికెట్ విషయానికొస్తే సంజూ శాంసన్ కు ఇప్పటికీ జాతీయ జట్టులో సరైన అవకాశాలు దక్కడంలేదు. మరోవైపు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు తమ దేశం తరఫున ఆడాలని సంజూకు ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వాటిని ఈ క్రికెటర్ సున్నితంగా తిరస్కరించాడని తెలుస్తోంది. తాను ఆడితే ఇండియాకు మాత్రమే ఆడతానని సంజూ చెప్పినట్లు సమాచారం. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంజూ కెప్టెన్ గా ఉన్నాడు.
శాంసన్ కు జట్టులో చోటు ఇవ్వకపోవడంపై బీసీసీఐను అతని ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో వరుసగా విఫలమవుతున్న పంత్ కు ఎన్నో అవకాశాలను ఇస్తున్న సెలక్టర్లు.. సంజూకు మాత్రం మొండిచేయి చూపిస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశవాళీల్లోనూ, అవకాశం వచ్చిన మ్యాచుల్లోనూ మంచి ప్రదర్శన చేస్తున్నా సంజూకు అవకాశాలు రావడంలేదు. ఇటీవల జరిగిన ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ టోర్నీలకు సంజూను ఎంపిక చేయలేదు. వాటి తర్వాత జరిగిన న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికైనప్పటికీ ఒక్క మ్యాచులో మాత్రమే తుది జట్టులో చోటు దక్కింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తో వన్డే, టీ20 సిరీస్ కు సంజూను ఎంపిక చేయలేదు.
Virat Anushka: రిషికేశ్ లో కోహ్లీ దంపతులు- బోర్డర్- గావస్కర్ ట్రోపీకి ముందు ప్రత్యేక ప్రార్థనలు
U19 Women's T20 WC: రేపు అండర్- 19 టీ20 ప్రపంచకప్ విజేతలకు సన్మానం- ముఖ్య అతిథి ఎవరంటే!
Lucknow Pitch: లక్నో పిచ్ క్యురేటర్ పై వేటు- ఐపీఎల్ కోసం కొత్త పిచ్ ఏర్పాటు!
Warner as Pathaan: 'పఠాన్' గా అదరగొట్టిన డేవిడ్ వార్నర్- ఆస్కార్ కమింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్
Ricky Ponting: ధోని కూడా కొట్టలేకపోయిన రికీ కెప్టెన్సీ రికార్డు - బద్దలు కొట్టేవారెవరైనా ఉన్నారా?
Etala Vs Kousik Reddy : ఈటలకు ప్రత్యర్థిని మార్చేసిన బీఆర్ఎస్ - పాత శత్రువు కొత్తగా బరిలోకి ! వర్కవుట్ అవుతుందా ?
ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ముందుకు బడ్జెట్ 2023- పూర్తి షెడ్యూల్ ఇదే!
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ