Rohit Sharma Television Debut: క్రికెట్ పిచ్ నుంచి బుల్లితెరపైకి హిట్ మ్యాన్.. ఫ్యామిలీ ఫుల్ హౌస్ షోతో రోహిత్ సరికొత్త అవతారం
సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా ఆధ్వర్యంలో రాబోయే ఫ్యామిలీ ఫుల్ హౌస్ షో ద్వారా రోహిత్ శర్మ ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది.

Rohit Sharma Announces Family Entertainment Show: భారత క్రికెట్ స్టార్, 2024 టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త అవతారంలో అభిమానులను అలరించడానికి రెడీ అయ్యాడు. సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా రూపొందిస్తున్న 'ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ' అనే రిఫ్రెషింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ షో ద్వారా అతడు బుల్లితెరపై అరంగేట్రం చేయనున్నాడు. ఈ కార్యక్రమం సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే టెస్ట్, టీ20 ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న రోహిత్, ప్రస్తుతం కేవలం వన్డేల్లో మాత్రమే ఇండియా తరఫున కొనసాగుతున్నాడు. ఆటతో పాటు టీవీ స్క్రీన్‌పై కూడా రోహిత్ తన మార్క్ చూపించేందుకు రంగం సిద్ధమైంది.
🚨 ROHIT SHARMA TO MAKE TV DEBUT! 📺🔥
— ViratKoisa Sports (@ViratKoisa18) August 31, 2026
― Rohit Sharma is set to make his television debut with the family entertainment show ‘Family Full House with Rohit Sharma’, premiering on September 19, 2026.
― SHOW NAME: FAMILY FULL HOUSE WITH ROHIT SHARMA pic.twitter.com/7Acfn2cvvn
క్లాసిక్ ఇన్నింగ్స్..
39 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడగలడా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో, అతడు బ్యాట్‌తోనే వాటికి జవాబిచ్చాడు. అద్భుతమైన ఫిట్ నెస్ తో సత్తా చాటి, విమర్శకుల నోళ్లు మూయించాడు. జూలైలో ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో మ్యాచ్ రోహిత్ కెరీర్లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చని ప్రచారం జరిగింది. అయితే 388 పరుగుల భారీ ఛేజింగ్‌లో రోహిత్ కేవలం 110 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సర్లతో 138 రన్స్ బాది క్లాసిక్ సెంచరీతో సత్తా చాటాడు. ఈ సిరీస్‌ను భారత్ 1-2 తో కోల్పోయినప్పటికీ, మూడు మ్యాచ్‌ల్లో 58.33 సగటు, 98.31 స్ట్రైక్ రేట్‌తో రోహిత్ 175 పరుగులు సాధించాడు.
HITMAN IS COMING ON SEPTEMBER 19th in SONY LIV 🔥
— Johns. (@CricCrazyJohns) August 31, 2026
- Family Full House With Rohit Sharma! pic.twitter.com/BDpsXORLJx
జోరుమీదున్న హిట్ మ్యాన్
లార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ తన చిరకాల భాగస్వామి విరాట్ కోహ్లీ (60 బంతుల్లో 74 రన్స్) తో కలిసి నెలకొల్పిన సెంచరీ పార్ట్నర్షిప్ అభిమానులను ఫిదా చేసింది. ఈ ఏడాది ఆడిన తొమ్మిది వన్డేల్లో రోహిత్ 42.11 సగటుతో ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీతో 379 పరుగులు సాధించి తన ఫిట్నెస్, ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు.
మేటీ బ్యాటర్..
ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో ఒకడిగా నిలిచిన రోహిత్, ఇప్పటివరకు 288 మ్యాచ్‌ల్లో 48.95 సగటు, 93.04 స్ట్రైక్ రేట్‌తో 11895 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో 34 సెంచరీలు, 62 హాఫ్ సెంచరీలు, అత్యధిక వ్యక్తిగత స్కోరు 264 కావడం విశేషం. ప్రపంచ ఆల్ టైమ్ వన్డే రన్ స్కోరర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్న రోహిత్, ఇండియా తరఫున సచిన్ టెండూల్కర్ (18426), విరాట్ కోహ్లీ (14941) తర్వాత మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
Before You Go
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
ట్రెండింగ్ వార్తలు



















