అన్వేషించండి

Hardik Nitish Comeback: అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్లు రెడీ.. హార్దిక్ ,నితీష్ కుమార్ రెడ్డి రీఎంట్రీతో టీమ్ ఇండియా జోరు

అఫ్గానిస్తాన్‌తో జరిగే టీ20 సిరీస్ ద్వారా హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ టీమ్ ఇండియాలోకి రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

IND VS AFG, Big Stars Prepare For Afghanistan T20 Series:  ఈ నెల చివర్లో అఫ్గానిస్తాన్‌తో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌తో భారత జట్టులోని కీలక స్టార్ ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి దిగడానికి రెడీ అవుతున్నారు. స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి పూర్తి ఫిట్‌నెస్ సాధించగా, స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా పునరాగమనానికి లైన్ క్లియర్ చేసుకున్నాడు. ఐపీఎల్ వరకు సాగే ద్వైపాక్షిక సిరీస్‌ల పరంపర ఈ హోమ్ అసైన్‌మెంట్‌తోనే ప్రారంభం అవ‌నుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) లో హార్దిక్, నితీష్ రెడ్డి గత కొంతకాలంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ వారం సుందర్ కూడా సీవోఈలో ఫిట్‌నెస్ నిరూపించుకుని సెలెక్షన్‌కు అందుబాటులోకి వ‌చ్చాడు.

స‌రైన సిరీస్..
గాయాల నుంచి కోలుకుంటున్న ఆటగాళ్లు నేరుగా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించేందుకు ఈ సిరీస్ సరైన వేదికగా మారనుందని తెలుస్తోంది. "అఫ్గానిస్తాన్‌తో టీ20 మ్యాచ్‌ల ద్వారా వాషింగ్టన్ సుందర్ తిరిగి జట్టులోకి రావడం ప్రాక్టికల్ టార్గెట్. గత కొద్ది వారాల్లో అతడి వర్క్‌లోడ్ క్రమంగా పెరిగింది, మూడు టీ20ల సెలెక్షన్‌కు అతడు అందుబాటులో ఉంటాడు. హార్దిక్ పాండ్యా, నితీష్ రెడ్డి కూడా వ్యక్తిగత పనుల విరామాలు మినహా నిరంతరం సీవోఈలోనే ప్రాక్టీస్ చేస్తున్నారు" అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

బుమ్రాపై ఫోకస్..
శ్రీలంక టెస్ట్ సిరీస్‌కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా సీవోఈలోనే ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఏడాది చివర్లో న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టుల సమయానికి బుమ్రా పూర్తి ఫామ్‌లోకి రావాలని బీసీసీఐ ఆలోచ‌న‌గా ఉన్నట్లు తెలుస్తోంది. "మోకాలి గాయం తర్వాత బుమ్రాను నేరుగా లాంగర్ ఫార్మాట్ బదులు షార్టర్ ఫార్మాట్ ద్వారా నెమ్మదిగా మ్యాచ్‌ల్లోకి తీసుకురావాలని మేనేజ్‌మెంట్ ప్లాన్ చేస్తోంది. అఫ్గాన్ సిరీస్ సమయానికి కాస్త రిస్క్ అయినప్పటికీ, ఎలాంటి కొత్త సమస్యలు రాకపోతే జపాన్‌లో జరిగే ఏషియన్ గేమ్స్‌లో అతడు బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి" అని బోర్గు వ‌ర్గాలు పేర్కొన్నాయి.

కృనాల్ రీ ఎంట్రీ..
ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ 7 మ్యాచ్‌లలో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసి తుస్సు మ‌నిపించాడు. ఈ క్రమంలో సీనియర్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా పేరును కూడా సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. జూలై 2021 లో చివరిసారిగా భారత్ తరఫున ఆడిన కృనాల్, దేశవాళీ ప్రదర్శనలతో మళ్లీ రేసులోకి వచ్చిన‌ట్లు తెలుస్తోంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tilak Runout Explanation: బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Smriti Mandhana Dominance : ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
ప్రపంచ నంబర్ వన్ పీఠంపై స్మృతి మంధాన తిరుగులేని హవా.. గిల్ ,షెఫాలీలకు ఐసీసీ అవార్డులు
Prithvi Shaw - Akriti Agarwal: బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
బ్రేకప్ కాదు... ప్యాచప్ - మళ్ళీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Vijayasai Reddy New Party Postponed: అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
అంత హడావుడి చేసి పార్టీ ప్రకటన వాయిదా వేసిన విజయసాయిరెడ్డి - తెర వెనుక ఏం జరిగింది?
Embed widget