Rohit Sharma: బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించిన రోహిత్ - వారిపై నమ్మకం పెట్టుకోవచ్చంటూ!
ఇంగ్లండ్‌తో మ్యాచ్ గెలిచిన అనంతరం బౌలర్లపై రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించారు.
ICC World Cup 2023: ప్రపంచ కప్‌లో టీమిండియా విజయాల పరంపరను డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కూడా ఆపలేకపోయింది. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ విజయంతో టోర్నీలో భారత్ ఆరు మ్యాచ్‌ల్లో విజయం సాధించి, 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
భారత్ విజయం తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట తన జట్టులోని మ్యాచ్ విన్నింగ్ ఆటగాళ్ల గురించి మాట్లాడాడు. తమ జట్టులోని చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఈ మ్యాచ్‌లో కనిపించారని రోహిత్ చెప్పాడు. తమ సీనియర్ ఆటగాళ్లందరూ సరైన సమయంలో ప్రతిభ చూపించి జట్టును విజయతీరాలకు చేర్చారని పేర్కొన్నాడు.
ఈ ప్రపంచకప్‌లో తొలిసారి బ్యాటింగ్ చేయడం గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ "ఈ టోర్నమెంట్‌లో మొదటి ఐదు మ్యాచ్‌లలో మేం ఛేజింగ్ చేశాం. ఇక్కడ మేం మొదట బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ముందు నుంచి మేము కఠినమైన సవాలును ఎదుర్కొన్నాం. ఇంగ్లండ్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్ చేయడం కష్టంగా ఉన్న పిచ్‌పై మేం మంచి స్కోరు చేయాలనుకున్నాం. మేం మంచి స్కోరును చేరుకోవాలనుకున్నాం." అన్నారు.
అనంతరం రోహిత్ జట్టు బ్యాటింగ్, పేలవమైన షాట్ ఆప్షన్ గురించి మాట్లాడుతూ, "మేం ఈ రోజు బాగా బ్యాటింగ్ చేయలేదు. త్వరగా మూడు వికెట్లు కోల్పోవడం మంచి పరిస్థితి కాదు. మీరు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరూ సుదీర్ఘ భాగస్వామ్యాన్ని నిర్మించాలని కోరుకుంటారు. మేమంతా సానుకూలంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాం. నాకు అనువైన ప్రాంతంలో బంతి పడినప్పుడు బయటకు పంపడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ మేం అవసరమైన మార్కు కంటే 30 పరుగులు తక్కువగా చేశామని నేను అనుకున్నాను." తెలిపారు.
కొత్త బంతితో బౌలింగ్ గురించి టీమ్ ఇండియా కెప్టెన్ ఇంకా మాట్లాడుతూ, "మీరు ప్రతిరోజూ దీన్ని చూడరు. మీరు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించినప్పుడు, దాన్ని ఏ విధంగానైనా ప్రారంభిస్తారు. వారు వికెట్లు తీయడానికి ప్రయత్నించారు. ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చారు. మా సీమర్లకు ఉన్న అనుభవానికి, ముఖ్యమైన వికెట్లు తీయడం కోసం వారిపై ఎల్లప్పుడూ ఆధారపడవచ్చు. ఈరోజు మా సీమర్లు సరిగ్గా అదే చేశారు. వారు పరిస్థితులను బాగా ఉపయోగించుకున్నారు. స్వింగ్ అందుబాటులో ఉంది, బంతి కూడా తిరుగుతోంది. వారు సరైన స్థానంలో ఉన్న బంతి వేసి బ్యాట్స్‌మెన్‌ను కన్ఫ్యూజ్ చేశారు. వికెట్లు దక్కాయి." అన్నారు.
చివరగా టీమ్ ఇండియా బౌలింగ్ అత్యుత్తమ బౌలింగ్ అటాక్ అని రోహిత్ శర్మ అన్నారు. "మాకు మంచి బ్యాలెన్స్ ఉంది. కొంతమంది మంచి స్పిన్నర్లు, సీమర్లకు చాలా అనుభవం ఉంది. జట్టులో కొత్తదనం, అనుభవం సరైన పాళ్లలో అందుబాటులో ఉన్నాయి. బ్యాట్స్‌మెన్ బోర్డుపై పరుగులు పెట్టడం చాలా ముఖ్యం. మరియు వారికి (బౌలర్‌లకు) వారి పనిని చేయడానికి అవకాశం ఇస్తే, వారు తమ మ్యాజిక్‌ను ప్రదర్శించగలరు." అని తెలిపారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial