Rohit Vs BCCI: ఒత్తిడిలో రోహిత్.. భవిష్యత్తు ప్రణాళికలపై ప్రశ్నించిన బోర్డు.. మెగాటోర్నీ వరకు సమయం అడిగిన హిట్ మ్యాన్
వన్డే సిరీస్, చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించనప్పుడు ఈ విషయాలపై చర్చ జరిగినట్లు సమాచారం. తన ఫ్యూచర్ ప్లాన్ల గురించి మరింత సమయం కావాలని రోహిత్ కోరగా, బోర్డు దానికి అంగీకరించినట్లు తెలుస్తోంది

ICC Champions Trophy News: భారత వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ముగిశాక రిటైర్మెంట్ పై తన నిర్ణయం ప్రకటించనున్నట్లు సమాచారం. రిటైర్మెంట్ కాకపోయినప్పటికీ, జట్టు కెప్టెన్సీ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే బోర్డు ఈ దిశగా సంకేతాలు రోహిత్ కు పంపినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ కోసం జట్టును ప్రకటించన నేపథ్యంలో ఈ విషయాలపై చర్చ జరిగినట్లు బోర్డు వర్గాల సమాచారం. తన ఫ్యూచర్ ప్లాన్ల గురించి మరింత సమయం కావాలని రోహిత్ కోరగా, బోర్డు దానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
సంధి దశ సాఫీగా..
వెటరన్లు రోహిత్, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నారు. ఇప్పటికే టీ20ల నుంచి వీరు ముగ్గురు వైదొలిగారు. 2027 వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే జట్టును రూపొందించాలని బీసీసీఐ కృత నిశ్చయంతో ఉంది. దీంతో రోహిత్ తన భవిష్యత్తు ప్రణాళికను త్వరగా తేలిస్తే, బోర్డు త్వరగా నిర్ణయం తేల్చుకునే అవకాశముంది. ఇక రోహిత్ వారసునిగా చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందరికంటే మిన్నగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను రెండు ఫార్మాట్లలోనూ కెప్టెన్ గా చేయాలని భావించినా అతని ఫిట్ నెస్ లెవల్ జట్టును ఆందోళన పరుస్తోంది. ఐదు టెస్టుల సిరీస్ లాంటి సుదీర్ఘ టోర్నీకి తను నాయకత్వం వహించగలడా..? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దీంతో బోర్డు మరిన్ని ప్రత్యమ్నాయాలపై ఫోకస్ పెట్టింది.
ఆ నలుగురు..
బుమ్రా తర్వాత బోర్డు యువ ప్లేయర్ శుభమాన్ గిల్ పేరును పరిశీలిస్తోంది. అయితే అతడి ఫామ్ కలవరపరుస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా టూర్లో రీ ఎంట్రీ ఇచ్చిన గిల్ ఘోరంగా విఫలమయ్యాడు. తననుతాను నిరూపించుకున్నట్లయితేనే కెప్టెన్సీ దక్కే అవకాశముంది. గిల్ తర్వత విధ్వంసక వికెట్ కీపర్ రిషభ్ పంత్, కుర్ర ఓపెనర్ యశస్వి జైస్వాల్ పై బోర్డు ఫోకస్ పెట్టింది. జైస్వాల్ వన్డేల్లో నిరూపించుకోవాల్సి ఉంది. టెస్టుల్లో ఇప్పటికే తన సత్తా చాటాడు. రోహిత్ రిటైర్ అయితే, అతని వారసుడిగా వన్డేల్లో జైస్వాల్ ఆడుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో యుక్త వయసులోనే పగ్గాలు అప్పగించి, బోర్డు సాహసం చేస్తుందా అనేది చూడాలి. ఇక పంత్.. నిలకడలేమి అతనికి మైనస్ గా మారే అవకాశముంది. పరిస్థితులతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆడే పంత్ ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత అప్పగించడంపై బోర్డు మల్లగుల్లాలు పడుతుంది. ఏదేమైనా ఐసీసీ చాంపియన్స్ టోర్నీ తర్వాత టీమిండియా కొత్త కెప్టెన్ పై అవగాహన వచ్చే అవకాశముంది.
Also Read: Viral Video: టీమిండియా సభ్యునికి చేదు అనుభవం.. ఫ్యాన్ అనుకుని హోటల్లోకి అనుమతించని పోలీసులు..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

