అన్వేషించండి
Advertisement
INDvsAFG 3rd T20I: రోహిత్-రింకూ కొత్త చరిత్ర, రెండు రికార్డులు సృష్టించిన జోడీ
Rohit Sharma and Rinku Singh: అఫ్గానిస్థాన్‌తో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో... టీమిండియా సారధి రోహిత్‌శర్మ-నయా ఫినిషర్ రింకూ సింగ్ కొత్త రికార్డు సృష్టించారు.
అఫ్గానిస్థాన్‌తో జరిగిన నామమాత్రపు మూడో వన్డేలో... టీమిండియా సారధి రోహిత్‌శర్మ-నయా ఫినిషర్ రింకూ సింగ్ కొత్త రికార్డు సృష్టించారు. అఫ్గాన్ బౌలర్లను చీల్చి చెండాడిన వీళ్లిద్దరూ అరుదైన రికార్డులను తమ పేరిట లిఖించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారీ శతకంతో రోహిత్ చెలరేగగా... అజేయ అర్థ శతకంతో రింకూ తన ఎంతటి విలువైన ఆటగాడినో మరోసారి చాటిచెప్పాడు. ఇక ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ నెలకొల్పిన అజేయమైన 190 పరుగుల భాగస్వామ్యం... అంతర్జాతీయ టీ20లలో భారత్‌కు ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యంగా నమోదైంది. 190 పరుగుల భాగస్వామ్యంతో రోహిత్-రింకూ టీ 20 క్రికెట్‌లో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడిగా చరిత్ర సృష్టించారు. అంతకుముందు ఈ రికార్డు సంజు శాంసన్-దీపక్ హుడా పేరున ఉంది. 2022లో ఐర్లాండ్‌పై సంజూ శాంసన్- దీపక్ హుడా జోడి 176 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ఈ రికార్డును రోహిత్ శర్మ-రింకూసింగ్ జోడీ బద్దలు కొట్టింది.
టీ 20ల్లో భారత్ అత్యధిక పార్ట్‌నర్‌షిప్
రోహిత్ శర్మ- రింకూ సింగ్- 190 పరుగులు
సంజూ శాంసన్- దీపక్ హుడా -176 పరుగుల
రోహిత్ శర్మ- కేఎల్ రాహుల్- 165 రన్స్
యశస్వి జైశ్వాల్- శుబ్‌మన్ గిల్- 165 పరుగులు
అంతేనా అంతర్జాతీయ టీ20లలో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన జోడిగాను రోహిత్ శర్మ రింకూసింగ్ చరిత్ర సృష్టించారు. కరీం జనత్ బౌలింగ్‌లో వీరిద్దరూ కలిసి 36 పరుగులు జోడించారు.
టీ20లలో ఒక ఓవర్లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్లు
36- స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో యువరాజ్ సింగ్
36- అకిల ధనంజయ బౌలింగ్‌లో- కీరన్ పొలార్డ్- కూలిడ్జ్
36- కరీం జనత్ బౌలింగ్‌లో- రోహిత్ శర్మ, రింకూ సింగ్
చెలరేగిన రోహిత్-రింకూసింగ్
ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న నామమాత్రమైన మూడో టీ20లో రోహిత్ శర్మ-రింకూ సింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. తొలి రెండు మ్యాచుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన రోహిత్ శర్మ... మూడో మ్యాచ్లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో మెరిశాడు. సూపర్ సెంచరీతో... టీ 20 ప్రపంచకప్ కు ముందు... ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు.. టీమ్ పీకల్లోతు కష్టాల్లో వున్నప్పుడు రోహిత్ విద్వసకర బాటింగ్‌తో అఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 69 బంతుల్లో హిట్ మాన్ 11 ఫోర్లు.... 8 సిక్సర్లతో 121 పరుగులు చేశాడు. రోహిత్ కు అండగా నిలిచిన నయా ఫీనిషర్ రింకూ సింగ్ అర్ధ శతకంతో మరోసారి మెరిశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రింకూ 39 బంతుల్లో 69 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. రింకూ ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. రోహిత్- రింకూ పటిష్ట భాగస్వామ్యం కారణంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అఫ్గాన్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 212 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. అనంతరం సూపర్ ఓవర్ నిర్వహించగా అది కూడా టై అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ 16 పరుగులు చేయగా భారత్ కూడా 16 పరుగులే చేసింది. మరోసారి సూపర్ ఓవర్ పెట్టగా టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 11 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ బ్యాటర్లను రవి బిష్ణోయ్ అవుట్ చేశాడు. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోవడంతో అఫ్గాన్ కథ ముగిసింది. మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
పాలిటిక్స్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion