అన్వేషించండి

Rishabh Pant: ఐపీఎల్‌ బరిలో రిషభ్‌ పంత్‌ , తీవ్రంగా శ్రమిస్తున్న స్టార్‌

Rishabh Pants: కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న టీమిండియా వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్‌ రిషభ్ పంత్  తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న టీమిండియా వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్‌ రిషభ్ పంత్  తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఏడాదిగా పంత్‌ మైదానంలో అడుగు పెట్టనే లేదు. ఈ క్రమంలోనే 2023 వన్డే వరల్డ్ కప్‌ కూడా మిస్సయ్యాడు. వచ్చే ఏడాది టీ-20 ప్రపంచ కప్ జరగనుంది. అంతకుముందే ఐపీఎల్-2024 కూడా జరగనుంది. రోడ్డు ప్రమాదం తర్వాత పంత్ ఇప్పటివరకు బ్యాట్ పట్టలేదు. మరి ఆ టోర్నీల్లో ఆడతాడో లేడో ఇప్పటికీ స్పష్టత లేదు. అయితే.. పంత్ మాత్రం క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. 


కారు ప్రమాదంలో గాయపడ్డ పంత్ గత ఐపీఎల్ టోర్నీకి దూరమయ్యాడు. ఈసారి ఐపీఎల్ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో పునరాగమనం కోసం తీవ్రకసరత్తు చేస్తున్నాడు. ఐపీఎల్ మ్యాచ్ ల ప్రారంభం నాటికి పూర్తిస్థాయి ఫిట్ నెస్ తో ఉండేందుకు శ్రమిస్తున్నాడు. 
 ఈ ఐపీఎల్‌ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ చేసిన ఆటగాళ్లలో పంత్ కూడా ఉన్నాడు. అతను దక్షిణాఫ్రికాలో సిరీస్ కు భారత్ జట్టులో ఎంపిక కానప్పటికీ.. గత నెలలో జాదవ్ పూర్ యూనివర్శిటీ సాల్ట్ లేక్ క్యాంపస్ పిచ్ లో శిక్షణా శిబిరంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ సహచరులతో చేరాడు. పంత్ మళ్లీ క్రికెట్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం తన బరువును తగ్గించుకొని ఫిట్ గా ఉండేందుకు పంత్ జిమ్ లో వర్కవుట్ చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో పంచుకున్నాడు. తిరిగి వస్తున్నాను అని పంత్ రాశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌లో బరువులు ఎత్తుతూ పుష్‌అప్స్ తీస్తున్న వీడియోను పోస్ట్ చేసి.. బౌన్సింగ్ బ్యాక్ విత్ ఎవ్‌రీ రిప్ అని పంత్‌ కామెంట్ పెట్టాడు. అంటే ఏ అవకాశాన్ని వదలట్లేదని అర్థం వచ్చేలా అన్నాడు. 


 పంత్‌ను ఐపీఎల్- 2024 కోసం ఢిల్లీ ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకోగా.. భారత మాజీ క్రికెటర్ దీప్‌దాస్ గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2025 ఐపీఎల్ కోసం.. చెన్నై సూపర్ కింగ్స్ పంత్‌ను తీసుకునే అవకాశం ఉందని అంచనా వేశాడు. ధోనీ వారసుడిగా పంత్‌ కోసం చెన్నై చూస్తుండొచ్చని, ఇది మంచి ఎంపిక అని వ్యాఖ్యానించాడు. డిసెంబర్ 31న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు వెళ్తుండగా రూర్కీ వద్ద కారు డివైడర్‌కు ఢీకొట్టడంతో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ కాలికి శస్త్ర చికిత్స జరిగింది. గత ఐపీఎల్‌లో అతడు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మ్యాచ్‌లకు అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్ 31న  రోడ్డు ప్రమాదానికి గురైన భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. బెంగళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో ఉన్న పంత్..మెల్లిమెల్లిగా వికెట్ కీపింగ్‌ కూడా ప్రాక్టీస్‌ చేశాడు.

భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ డిసెంబర్‌లో రూర్కీ వెళ్తుండగా కారు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ యాక్సిడెంట్‌లో అతని కాలులోని లిగమెంట్‌ చిరిగిపోయింది. దీంతో పాటు చేయి, కాలు, వీపుకు కూడా గాయాలయ్యాయి. అతని ప్రాథమిక చికిత్స మొదట డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆసుపత్రిలో జరిగింది. ఆ తర్వాత ముంబైకి రిఫర్ చేశారు. పంత్ కోలుకుంటున్నా కానీ IPL 2023కి పూర్తిగా దూరం అయ్యాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
Bajaj Platina vs Honda Shine: బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
బజాజ్ ప్లాటినా వర్సెస్ హోండా షైన్ - ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్?
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Embed widget