By: ABP Desam | Updated at : 11 Feb 2023 02:30 PM (IST)
Edited By: nagavarapu
రిషభ్ పంత్ (source: twitter)
Rishabh Pant Photo: గతేడాది డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారత స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ ప్రస్తుతం కోలుకుంటున్నాడు. ఆ ఘోర ప్రమాదం తర్వాత దాదాపు నెలన్నరపాటు ఆసుపత్రిలో ఉన్న పంత్ ఇప్పుడు ఇంటికి వెళ్లాడు. ఆ ప్రమాదం తర్వాత పంత్ తొలిసారి తన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.
రోడ్డుప్రమాదం తర్వాత తొలిసారి రిషభ్ పంత్ సామాజిక మాధ్యమాల్లో తన ఫొటోలను పంచుకున్నాడు. ఊతకర్రల సాయంతో నడుస్తున్న తన రెండు చిత్రాలను పోస్ట్ చేసిన పంత్ వాటికింద ఇలా రాసుకొచ్చాడు. 'ఒక అడుగు బలంగా, ఒక అడుగు ముందుకు, ఒక అడుగు మెరుగ్గా' అనే క్యాప్షన్ ను జతచేశాడు. ఈ ప్రమాదం నుంచి కోలుకోవడానికి పంత్ కు దాదాపు 6 నుంచి 9 నెలలు సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో ఈ ఏడాది మొత్తానికి రిషభ్ పంత్ క్రికెట్ కు దూరమయ్యాడు.
One step forward
— Rishabh Pant (@RishabhPant17) February 10, 2023
One step stronger
One step better pic.twitter.com/uMiIfd7ap5
అండగా బీసీసీఐ
డిసెంబర్ 30న జరిగిన రోడ్డు ప్రమాదంలో రిషభ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రసుత్తం అతనికి లిగ్ మెంట్ స్నాయువు శస్త్రచికిత్స జరిగింది. ముంబయిలోని కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యులు ఈ సర్జరీ నిర్వహించారు. ఇదంతా బీసీసీఐ దగ్గరుండి పర్యవేక్షిస్తోంది. అలాగే పంత్ కు ఆర్ధికంగా అండగా నిలబడాలని బోర్డు నిర్ణయించినట్లు సమాచారం.
పూర్తి శాలరీ ఇవ్వనున్న బీసీసీఐ
ప్రమాదం కారణంగా పంత్ దాదాపు 6 నుంచి 9 నెలలు క్రికెట్ కు దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది చాలా క్రికెట్ టోర్నీలకు దూరమయ్యాడు. ఐపీఎల్, ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కు ఈ బ్యాటర్ దూరమయ్యాడు. అలాగే స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ నకు అందుబాటులో ఉండడం అనుమానమే. అయినప్పటికీ రిషభ్ పంత్ కు అతని మొత్తం శాలరీని ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. అలాగే ఐపీఎల్ ఆడనప్పటికీ పంత్ కాంట్రాక్ట్ ప్రకారం అతని రూ. 16 కోట్ల శాలరీని బోర్డు చెల్లించనుందట. అంతేకాకుండా సెంట్రల్ కాంట్రాక్ట్ ప్రకారం అతనికి ఇవ్వాల్సిన రూ. 5 కోట్ల జీతాన్ని ఇవ్వనుందట.
I may not have been able to thank everyone individually, but I must acknowledge these two heroes who helped me during my accident and ensured I got to the hospital safely. Rajat Kumar & Nishu Kumar, Thank you. I'll be forever grateful and indebted 🙏♥️ pic.twitter.com/iUcg2tazIS
— Rishabh Pant (@RishabhPant17) January 16, 2023
'It feels a blessing to be able to sit and breath fresh air" : Rishabh Pant on his recovery post his horrific accident
— CricketNews.com (@cricketnews_com) February 9, 2023
Read: https://t.co/DjJuiSYOzj#RishabhPantAccident #BCCI #JayShah pic.twitter.com/zZGymi3rGy
Pragyan Ojha on Rohit Sharma: కిట్ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్ శర్మ! అడిగితే ఎమోషనల్!
Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!
Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?
Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!
IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!