Rishabh Pant Record: 148 ఏళ్లలో తొలిసారి.. ఆసీస్ గడ్డపై సరికొత్తగా పంత్ రికార్డు.. ఐదో టెస్టులో జూలు విదిల్చిన పంత్
BGT Updates: ధనాధన్ ఆటతీరుతో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న పంత్ ఖాతాలో తాజాగా మరో రికార్డు చేరింది. 148 ఏళ్ల చరిత్రలో ఏ విదేశీ ప్లేయర్ చేయని ఘనతను పంత్ ఇట్టే చేసి చూపించాడు.
Ind Vs Aus Test Updates: భారత వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ 148 ఏళ్ల చరిత్రను తిరగ రాశాడు. ఆసీస్ గడ్డపై అత్యంత వేగవంతంగా ఫిఫ్టీ చేసిన విదేశీ ప్లేయర్ గా నిలిచాడు. 1877లో ఆసీస్ తొలి టెస్టు ఆడినప్పటి నుంచి 30 బంతుల్లోపల ఫిఫ్టీ విదేశీ ప్లేయర్ చేయడమనే రికార్డు ఎప్పుడు నమోదు కాలేదు. శనివారం ఐదో టెస్టులో రెండో రోజు పంత్ కేవలం 29 బంతుల్లో ఫిఫ్టీ బాది ఈ రికార్డు నమోదు చేశాడు. స్టన్నింగ్ ఫిఫ్టీ (33 బంతుల్లో 61, 4 సిక్సర్లు, 6 ఫోర్లు) నమోదు చేయడంతోపాటు ఈ అరుదైన ఫీట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఈ ఆసీస్ గడ్డపై ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన రికార్డు ఇంగ్లాండ్ కు చెందిన జాన్ బ్రౌన్ ( మెల్బోర్న్-1895), రాయ్ ఫ్రెడరిక్స్ (పెర్త్-1975) పేరిట సంయుక్తంగా ఉండేది. తాజా ఇన్నింగ్స్ తో దాదాపు నాలుగు బంతుల తేడాతో ఈ రికార్డును పంత్ తుడిచేశాడు.
Rishabh Pant hit the second-fastest Test fifty by an Indian during the fifth Test against Australia, Pant smashed the fastest Test half-century on Australian soil by a visiting batter during the ongoing fifth Test Sydney Cricket Ground. pic.twitter.com/lCNMxyJTC5
— Vinod Bro (@VinodBro13648) January 4, 2025
కీలక సమయంలో జులు విదిల్చిన పంత్..
నిజానికి ఐదు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో రిషభ్ పంత్ అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయాడు. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో చేసిన 40 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం. అయితే కష్ట సాధ్యమైన పిచ్ పై 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచిన పంత్.. రెండో ఇన్నింగ్స్ లో మరిన్ని విలువైన పరుగులు చేశాడు. అతను అందించిన పరుగులతోనే భారత్ 120 పరుగల లీడ్ మార్కును చేరుకుంది. ధనాధన్ ఆటతీరుతో ఆసీస్ ను ముప్పుతిప్పలు పెట్టిన పంత్.. బౌలర్ల లయను దెబ్బ తీస్తూ వాళ్లను ఉతికారేశాడు. గత రెండు బీజీటీల్లో సత్తా చాటిన పంత్.. ఈసారి కాస్త ఆలస్యంగా ఐదో టెస్టులో తన మార్కు ఇన్నింగ్స్ ఆడి అభిమానుల్లో జోష్ ను నింపాడు.
ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కూడా పంత్ ఖాతాలోనే..
ఇక భారత్ తరపున వేగవంతగా ఫిఫ్టీ చేసిన రికాకర్డు కూడా పంత్ పేరిట ఉంది. 2020 బెంగళూరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో కేవలం 28 బంతుల్లోనే పంత్ సెంచరీ చేశాడు. ఇదే భారత్ తరపున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. ప్రస్తుత సిడ్నీ ఇన్నింగ్స్ రెండో వేగవంతమైన ఫిఫ్టీ కావడం విశేసం. అంటే తొలి రెండు ఫాస్టెస్ట్ ఫిఫ్టీల రికార్డు పంత్ పేరిట నిలిచాయి. ఇక సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ పట్టుదల ప్రదర్శిస్తోంది. 4 పరుగుల స్వల్ప లీడ్ తో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ రెండోరోజు ఆటముగిసేసరికి ఆరు వికెట్లకు 141 పరుగులు చేసింది. దీంతో ఓవరాల్ గా 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 185 పరుగులు చేయగా, ఆసీస్ 181 రన్స్ కు ఆలౌటైంది. ఇక ఐదు టెస్టుల బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో ఆసీస్ 2-1తో ఆధిక్యంలో ఉంది.