Prithvi Shaw Record: ఒక ట్రిపుల్ సెంచరీ, 2 రికార్డులు- రంజీల్లో పృథ్వీ షా సంచలనం
Prithvi Shaw Record: యువ ఓపెనింగ్ బ్యాటర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీ మ్యాచ్ లో రికార్డు సృష్టించాడు. బుధవారం అస్సాంతో జరిగిన మ్యాచు లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న షా ట్రిపుల్ సెంచరీ సాధించాడు.
Prithvi Shaw Record: యువ ఓపెనింగ్ బ్యాటర్ పృథ్వీ షా రంజీ ట్రోఫీ మ్యాచ్ లో రికార్డు సృష్టించాడు. బుధవారం అస్సాంతో జరిగిన మ్యాచు లో ముంబైకి ప్రాతినిథ్యం వహిస్తున్న షా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో 379 పరుగులు చేసిన పృథ్వీ షా ముంబయి తరఫున ఒకే రంజీ మ్యాచ్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రికార్డులు తిరగరాశాడు.
మెరుపు ట్రిపుల్ సెంచరీ
గౌహతిలోని అమిన్ గావ్ క్రికెట్ మైదానంలో అస్సాం- ముంబయి మధ్య రంజీ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముంబై ఓపెనర్ పృథ్వీ షా రెచ్చిపోయాడు కేవలం 383 బంతుల్లోనే 379 పరుగులు చేశాడు. రంజీ కెరీర్ లో తన తొలి ట్రిపుల్ సెంచరీని సాధించాడు. ఈ క్రమంలో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. రంజీల్లో ముంబై తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు, మొత్తం రంజీ ట్రోఫీ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు. ఈ రెండు రికార్డులను షా సాధించాడు.
సంజయ్ మంజ్రేకర్ 1990-91 సీజన్‌లో హైదరాబాద్‌పై ముంబై తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు 377 పరుగులు సాధించాడు. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో షాకు ఇదే తొలి సెంచరీ. అతను తన చివరి 7 ఇన్నింగ్స్‌లలో 160 పరుగులు మాత్రమే చేశాడు, సగటు 22.85, అత్యధిక స్కోరు 68.
రంజీ ట్రోఫీలో అత్యధిక వ్యక్తిగత స్కోరు
- బీబీ నింబాల్కర్ (మహారాష్ట్ర): 443 నాటాట్ vs సౌరాష్ట్ర
- పృథ్వీ షా (ముంబై): 379 vs అస్సాం
- సంజయ్ మంజ్రేకర్ (బాంబే): 377 vs హైదరాబాద్
- ఎంవీ శ్రీధర్ (హైదరాబాద్): 366 vs ఆంధ్రప్రదేశ్
రంజీ ట్రోఫీ ఇన్నింగ్స్‌లో ముంబై తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు:
- పృథ్వీ షా: 379 vs అస్సాం
- సంజయ్ మంజ్రేకర్ (బాంబే): 377 vs హైదరాబాద్
- విజయ్ మర్చంట్: 359 నాటౌట్ vs మహారాష్ట్ర
- సునీల్ గవాస్కర్: 340 vs బెంగాల్
పృథ్వీ షా ఈ సీజన్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ రాణించాడు. 181.42 స్ట్రైక్ రేట్‌తో 332 పరుగులు సాధించాడు. అస్సాంపై చేసిన 134 పరుగులు అత్యధిక స్కోరు. షా విజయ్ హజారే ట్రోఫీలో 7 ఇన్నింగ్స్‌లలో 217 పరుగులు చేశాడు, లిస్ట్ A క్రికెట్‌లో షా సగటు 50 కంటే ఎక్కువ. అయితే దేశవాళీల్లో నిలకడగా రాణిస్తున్నప్పటికీ పృథ్వీ షాకు జాతీయ జట్టులో స్థానం లభించడంలేదు. 23 ఏళ్ల షా జులై 2021 తర్వాత మళ్లీ భారత్ తరఫున మ్యాచ్ ఆడలేదు.
A rare and special talent- Prithvi Shaw .
— Venkatesh Prasad (@venkateshprasad) January 11, 2023
Whatever may be the issues that are keeping him away from the team , it’s job of the management to give a chance and have an effective communication with him which helps both him and Team India. pic.twitter.com/kD9kmMRUGX
Cricketer #PrithviShaw has smashed the second-highest score ever in the #RanjiTrophy
— Shubhankar Mishra (@shubhankrmishra) January 11, 2023
His 379 is only behind Bhausaheb Nimbalkar's 443* in 1948. pic.twitter.com/8YiqiPewnR