Prithvi Shaw Emotional Post: కివీస్, బంగ్లా సిరీస్‌ల్లో చోటు దక్కకపోవడంపై యువ క్రికెటర్ల అసంతృప్తి- పృథ్వీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్
Prithvi Shaw Emotional Post: రాబోయే న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్ లకు జట్టులో చోటు దక్కని యువ బ్యాట్స్ మెన్ పృథ్వీ షా.. తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
Prithvi Shaw Emotional Post: టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత టీమిండియా న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో టీ20, వన్డే, టెస్ట్ సిరీస్ లు ఆడనుంది. ఇందుకోసం బీసీసీఐ నాలుగు జట్లను ప్రకటించింది. అయితే ఇందులో ఏ ఒక్క దానిలోనూ భారత యువ బ్యాట్స్ మెన్ పృథ్వీ షాకు చోటు దక్కలేదు. దీనిపై అతను నిరాశ చెందినట్లు తెలుస్తోంది. దీనిపై పృథ్వీ షా ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
బాబా నువ్వు అంతా చూస్తూనే ఉన్నావు
ఇటీవల జరిగిన దేశవాళీ టోర్నీల్లో పృథ్వీషా విశేషంగా రాణించాడు. రంజీ ట్రోఫీలో 6 మ్యాచుల్లో 355 పరుగులు, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 7 మ్యాచుల్లో 47.50 సగటుతో 191.27 స్ట్రైక్ రేటులో 285 పరుగులు చేశాడు. వైట్ బాల్ క్రికెట్ లో షా మంచి ఆటగాడు. అయినప్పటికీ సెలక్టర్లు తనను పరిగణనలోకి తీసుకోకపోవడంపై షా అసంతృప్తితో ఉన్నట్లు కనపడుతోంది. దీనిపై పృథ్వీ షా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్ట్ చేశాడు. సాయిబాబా ఫొటోతో పాటు హోప్ యూ ఆర్ వాచింగ్ ఎవ్రీథింగ్ (నువ్వు అంతా చూస్తూనే ఉన్నావు) అనే క్యాప్షన్ ను జతచేశాడు. షా పెట్టిన పోస్ట్ పై అతని అభిమానులు వివిధ రకాలుగా స్పందించారు. పృథ్వీ షా తో పాటు ఈ సిరీస్ లకు ఎంపికవ్వని ఉమేష్ యాదవ్, రవి బిష్ణోయ్, సర్ఫరాజ్ ఖాన్ కూడా తమ అసంతృప్తిని ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.
టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత భారత్ న్యూజిలాండ్‌కు వెళుతుంది. అక్కడ 3 టీ20లు, 3 వన్డేలు ఆడతారు. కివీస్ తో సిరీస్ తర్వాత బంగ్లాదేశ్ తో 3 వన్డేలు, 2 టెస్టులు ఆడనున్నారు. 2023 వన్డే ప్రపంచకప్ కు సన్నాహకంగా వీటిని ఉపయోగించుకోనున్నారు. ఇందులో సత్తా చాటిన వారు ప్రపంచకప్ జట్టుతో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉంది.
న్యూజిలాండ్ సిరీస్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్ లకు విశ్రాంతి కల్పించారు. టీ20 సిరీస్ కు హార్దిక్ పాండ్య, వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నారు. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత నవంబర్ 18 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 జట్టులో శుభ్ మన్ గిల్ అరంగేట్రం చేయనున్నాడు. అలాగే వన్డే సిరీస్ కు ముగ్గురు ఆటగాళ్లు అరంగేట్రం చేయనున్నారు. అర్హ్ దీప్ సింగ్, కుల్దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్ లకు జట్టులో చోటు దక్కింది. ఈ ముగ్గురూ పేసర్లే.
న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టు
హార్దిక్ పాండ్య (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, అర్హ్ దీప్ సింగ్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్.
న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు భారత జట్టు
శిఖర్ ధావన్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, కుల్దీప్ సేన్, అర్హ్ దీప్ సింగ్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్.
The Instagram story of Prithvi Shaw. pic.twitter.com/wAT0vRp3vQ
— Johns. (@CricCrazyJohns) October 31, 2022