అన్వేషించండి
Advertisement
Shaheen Afridi ODI Wickets: ప్రపంచంలోనే తొలి ఫాస్ట్ బౌలర్, షహీన్ అఫ్రిదీ అరుదైన రికార్డ్
ODI World Cup 2023: పాకిస్థాన్ యువ సంచలనం షహీన్ షా అఫ్రీదీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు
పాకిస్థాన్ యువ సంచలనం... ఆ జట్టు స్టార్ బౌలర్ షహీన్ షా అఫ్రీదీ అరుదైన రికార్డును తన పేర లిఖించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మొదటి ఓవర్ 5 బంతికి బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ తాంజిద్ హసన్ వికెట్‌ను తీసిన షహీన్ షా అఫ్రిదీ వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. పాకిస్తాన్ బౌలర్లలో ఎవరికీ ఇంతవరకు ఈ రికార్డు సాధ్యం కాలేదు. షహీన్ షా అఫ్రిదీ 51 వన్డేల్లో 100 వికెట్లు తీసి... మిచెల్ స్కార్క్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. మిచెల్ స్టార్క్ 52 వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. కివీస్ మాజీ పేసర్ షేన్ బాండ్ తో పాటు బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ లు 54 మ్యాచ్‌లలో వంద వికెట్లు సాధించారు. ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ బ్రెట్ లీ 55 మ్యాచ్‌ల్లో వంద వికెట్లు తీశాడు.
పాకిస్తాన్ తరఫున అత్యంత వేగంగా వంద వికెట్లు సాధించినవారిలో షహీన్.. సక్లయిన్ ముస్తాక్ రికార్డును బ్రేక్ చేశాడు. ముస్తాక్.. 53 మ్యాచ్‌లలో వంద వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో వకార్ యూనిస్ (59 మ్యాచ్‌లు), షోయభ్ అక్తర్ (60 మ్యాచ్‌లు), నవేద్ ఉల్ హసన్ (65 మ్యాచ్‌లు) ఉన్నారు. అంతర్జాతీయ స్థాయిలో నేపాల్ బౌలర్ సందీప్ లమిచానె.. 42 మ్యాచ్‌లలో వంద వికెట్లు సాధించి ఈ జాబితాలో అందరికంటే ముందున్నాడు. రషీద్ ఖాన్ 44 మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించగా అఫ్రిది మూడో స్థానంలో ఉన్నాడు. ఫాస్ట్ బౌలర్ల పరంగా చూస్తే మాత్రం అఫ్రిదినే అందరికంటే ముందున్నాడు.
వేగంగా వంద వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లు
షహీన్ షా అఫ్రిదీ 51 వన్డేల్లో 100 వికెట్లు
మిచెల్ స్టార్క్ 52 వన్డేల్లో 100 వికెట్లు
సక్లయిన్ ముస్తాక్ 53 మ్యాచ్‌లలో వంద వికెట్లు
సక్లయిన్ ముస్తాక్ 53 మ్యాచ్‌లలో వంద వికెట్లు
షేన్ బాండ్, ముస్తాఫిజుర్ 54 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు
బ్రెట్ లీ 55 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు
పాకిస్తాన్ తరఫున వేగంగా వంద వికెట్లు
షహీన్ షా అఫ్రిదీ 51 వన్డేల్లో 100 వికెట్లు
సక్లయిన్ ముస్తాక్ 53 మ్యాచ్‌లలో వంద వికెట్లు
వకార్ యూనిస్ 59 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు
షోయభ్ అక్తర్ 60 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు
నవీద్ ఉల్ హసన్ 65 మ్యాచ్‌ల్లో 100 వికెట్లు
కానీ ఈ ప్రపంచకప్‌లో షహీన్ షా అఫ్రిదీ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. పాకిస్థాన్ కూడా వరుస పరాజయాలతో సతమతమవుతోంది. కెప్టెన్ బాబర్ ఆజమ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే బాబర్ ఆజమ్‌కు షహీన్ షా అఫ్రిదీ అండగా నిలిచాడు. బాబర్ అజామ్, పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ అయింది. పీసీబీ చీఫ్ జకా అష్రఫ్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. అతడే ఈ చాట్‌ని లీక్ చేశాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లీకైన చాటింగ్‌కు సంబంధించి అది ఎంత మేరకు నిజమో తెలియాల్సి ఉంది. ఈ కష్టకాలంలో బాబర్‌కు అండగా షాహిద్ అఫ్రిది నిలిచాడు. సంభాషణల లీకేజీలో బాబర్‌కు అండగా నిలిచాడు. ఎవరివైనా వ్యక్తిగత మెసేజ్‌లను టీవీలో ఎలా చూపిస్తారని ప్రశ్నించాడు. అది కూడా మన కెప్టెన్ మెసేజ్‌లా మన ఆటగాళ్లనే మనం ఇంతగా అవమానిస్తున్నామా అని పాక్ మీడియాను ప్రశ్నించాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion