అన్వేషించండి
Advertisement
PAK vs AFG: అఫ్గాన్‌పై ఓటమి కలచివేసింది - పాక్ కెప్టెన్ బాబర్ అజామ్
ODI World Cup 2023: అఫ్గానిస్థాన్‌పై ఓటమి తమను తీవ్రంగా కలచివేసిందని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ జట్టు బౌలింగ్ తగిన స్థాయిలో లేదని బాబర్ అంగీకరించాడు.
అఫ్గానిస్థాన్‌పై ఓటమి తమను తీవ్రంగా కలచివేసిందని పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తమ జట్టు బౌలింగ్ తగిన స్థాయిలో లేదని బాబర్ అంగీకరించాడు. అఫ్ఘాన్‌పై తాము మంచి స్కోరే చేశామని. కానీ తమ బౌలింగ్ స్థాయికి తగ్గట్టు లేకపోవడంతో పరాజయం పాలయ్యామని బాబర్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయకపోవడం తమకు విజయాన్ని దూరం చేసిందని పాక్ సారధి తెలిపాడు. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో ఒక్క విభాగంలో రాణించకపోయినా ఓటమి తథ్యమని బాబర్ స్పష్టం చేశాడు. తాము ప్రారంభంలో బాగానే బౌలింగ్ చేశామని.. క్రమక్రమంగా తప బౌలింగ్ గాడి తప్పందని అన్నాడు.
తాము మంచి క్రికెట్ ఆడటం లేదని, ముఖ్యంగా బౌలింగ్, ఫీల్డింగ్‌లో తమ ఆట స్థాయికి తగట్టు లేదని బాబర్ అన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా పిచ్ స్పిన్నర్లకు అనుకూలించిందని.. కానీ తమ బౌలర్లు అఫ్గాన్ బ్యాటర్లపై ఒత్తిడి తేవడంలో విఫలమ్యయారని బాబార్ తెలిపాడు.
ఈ ఓటమితో మేము చాలా నిరాశకు గురయ్యామని బాబర్ ఆజం అన్నాడు. అఫ్గాన్ బ్యాటర్లు కూడా బాగా ఆడారని పాక్ సారధి కొనియాడాడు. అఫ్గానిస్థాన్ అద్భుత క్రికెట్ ఆడిందనడంలో సందేహమే లేదన్నాడు. అఫ్గాన్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఈ మూడు విభాగాల్లోనూ తమ జట్టును ఓడించిందని బాబర్ ఆజం చెప్పాడు. అఫ్గాన్ జట్టు గెలిచేందుకు అర్హమైన జట్టని అన్నాడు.
ఆత్మవిశ్వాసం పెంచింది
పాక్‌పై గెలుపు తమ ఆత్మ విశ్వాసాన్ని పెంచిందని.. అఫ్గానిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ తెలిపాడు. కొన్నేళ్ల నుంచి తాము నాణ్యమైన క్రికెట్ ఆడుతున్నామని గుర్తు చేశాడు. తమ బౌలింగ్ చాలా బాగుందని, ముఖ్యంగా స్పిన్నర్లు గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారని షాహిదీ గుర్తు చేశాడు. ఆట ప్రారంభం నుంచి చివరి వరకు మ్యాచ్ అంత తమ చేతుల్లోనే ఉందన్నాడు. ఇక భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్తాన్ మరోసారి గర్జించింది. పాకిస్థాన్‌కు బొమ్మ చూపిస్తూ ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. పాకిస్థాన్ విధించిన 283 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఉఫ్ మని ఊదేసింది. వన్డేలలో పాకిస్థాన్ చేతిలో వరుసగా ఏడు ఓటములు చవిచూసిన అఫ్ఘాన్.. 50 ఓవర్ల ఫార్మాట్లో పాక్ మీద తొలి గెలుపు సాధించింది.
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన ఆ జట్టు పాక్‌పై పంజా విసిరింది. పాకిస్థాన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ 74, ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ 58 పరుగులతో రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో నూర్ అహ్మద్ 3, నవీనుల్ హక్ 2 వికెట్లు తీశారు. అనంతరం 283 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌కు శుభారంభం దక్కింది. అఫ్గాన్ ఓపెనర్లు రహ్మనుల్లా గుర్భాజ్ 65.... ఇబ్రహీం జాద్రాన్ 74 పరుగులతో రాణించి జట్టు విజయానికి పునాది వేశారు. రహ్మత్ షా 77, హష్మాతుల్లా షాహిది 48 పరులతో సమయోచితంగా రాణించారు. అఫ్గాన్ బ్యాటర్లు రాణించడంతో మరో ఆరు బంతులు మిగిలుండగానే కేవలం రెండే వికెట్లు కోల్పోయి ఆ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది.
గాలివాటం కాదని నిరూపిస్తూ...
87 పరుగులతో పాకిస్థాన్ ఓటమిలో కీరోల్ పోషించిన అఫ్ఘాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్‌ను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లు ఆడిన అఫ్ఘాన్ టీమ్.. రెండు విజయాలు సాధించింది. మూడో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్లు ఇంగ్లండ్ మీద సంచలన విజయం సాధించి ఈ ప్రపంచకప్‌నకే ఊపు తెచ్చింది. ఐదో మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అఫ్ఘాన్ జట్టు.. తాజా గెలుపుతో పాక్ ప్రపంచకప్ సెమీస్ ఆశలను సైతం డేంజర్‌లో పడేసింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
మొబైల్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion