అన్వేషించండి

World Cup 2023: ఐసీసీ చరిత్రలో తొలిసారి, స్టేడియానికి 10 లక్షల మంది

ODI World Cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌ రికార్డులకు వేదికగా మారుతోంది. ఇప్పటికే టీవీ, హాట్‌ స్టార్‌ ల్లో పలు రికార్డులు సృష్టించిన ఈ మహా టోర్నీఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది.

భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌... పలు రికార్డులకు వేదికగా మారుతోంది. ఇప్పటికే టీవీ, హాట్‌ స్టార్‌ వీక్షణల్లో పలు రికార్డులు సృష్టించిన ఈ మహా టోర్నీ... ఇప్పుడు మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటివరకూ జరిగిన ఏ దేశంలో జరిగిన ప్రపంచకప్‌ టోర్నీకి దక్కని రికార్డు భారత్‌ వేదికగా జరిగిన ఎడిషన్‌ దక్కించుకుంది. ఈసారి వన్డే ప్రపంచకప్‌లో స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ చూసిన వీక్షకుల సంఖ్య 10 లక్షలు దాటింది. 
ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌  ICC ఈవెంట్‌ చరిత్రలో ఇలా 10 లక్షల మంది కంటే ఎక్కువ అభిమానులు స్టేడియానికి తరలివచ్చి మ్యాచ్‌ను చూడడం ఇదే తొలిసారి. అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌తో స్టేడియానికి వచ్చి మ్యాచ్‌ చూసే వారి సంఖ్య పది లక్షలు దాటింది. పది లక్షల మందికి పైగా అభిమానులు స్టేడియానికి వచ్చి మ్యాచ్‌లను చూడడం వన్డే ఫార్మాట్‌కు ఆదరణ తగ్గలేదని నిరూపిస్తోందని, ప్రపంచ కప్‌ విలువ ఏంటో తెలియజేస్తోందని ఐసీసీ ఈవెంట్స్‌ అధిపతి క్రిస్‌ టెట్లీ చెప్పాడు. 
 
టీవీ వీక్షణల్లోనూ రికార్డే..
మరోవైపు క్రికెట్‌ ప్రేమికులు కేవలం భారత్‌ ఆడే మ్యాచ్‌లనే కాకుండా వేరే జట్ల మ్యాచ్‌లను కూడా టీవీలకు అతుక్కుపోయి మరీ వీక్షిస్తున్నారు. అయితే ప్రపంచకప్‌ మేనియాలో దేశం ఊగిపోతున్న వేళ బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. దేశంలో క్రికెట్‌ మేనియాకు ఇదే నిదర్శనమంటూ జై షా ట్వీట్‌ చేశాడు. ప్రపంచకప్‌ను టీవీల్లో వీక్షించే వారి సంఖ్య గత ప్రపంచకప్‌తో పోలిస్తే 43 శాతం వృద్ధి చెందిందని జై షా ట్వీట్‌ చేశాడు. టీవీ వీక్షకుల సంఖ్య అనూహ్యంగా భారీగా పెరిగిందని వెల్లడించారు. 2019లో ప్రపంచకప్‌తో పోలిస్తే వీక్షణ నిమిషాల్లో 43 శాతం వృద్ధి ఉందని జై షా తెలిపాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను టీవీలో 36.42 కోట్ల మంది వీక్షించారని వివరించాడు. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఇదో కొత్త రికార్డు అని జైషా ట్వీట్‌లో పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్ ఇండియా ఛానెల్‌ను వీక్షించే వారి సంఖ్య 43 శాతం పెరిగిందని తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే.. అభిమానులు గతంలో కంటే ఈసారి టీవీకి ఎక్కువగా అతుక్కుపోయారని.. ఇది భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణకు, భారత క్రికెట్ అభిమానుల శక్తికి నిదర్శనమని జై షా ట్వీట్ చేశాడు.
 
ఈ ప్రపంచకప్‌లో మొదటి 18 మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని 364.2 మిలియన్ల మంది చూశారని ఐసీసీ తెలిపింది. భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను టీవీల్లో 76 మిలియన్ల మంది, డిజిటల్‌లో 35 మిలియన్ల మంది వీక్షించారని వెల్లడించింది. అక్టోబరు 22న ధర్మశాలలో భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరిగిన ప్రపంచ కప్ 21వ మ్యాచ్‌ను డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో 43 మిలియన్ల మంది చూశారు. అంటే భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌ను అత్యధికంగా 4.3 కోట్ల మంది వీక్షించారన్న మాట. ప్రపంచ వీక్షకుల సంఖ్యలో ఇది కొత్త రికార్డు. ఆరంభంలో భారత్ వికెట్లు పడినప్పుడు టీమిండియా ఓడిపోతుందేమో అనిపించినా... క్రీజులో విరాట్ కోహ్లీ స్ట్రాంగ్‌గా ఉండడంతో మ్యాచ్‌లో ఉత్కంఠ పెరిగింది. చివర్లో మ్యాచ్‌ని చూసేందుకు చాలా మంది యాప్‌లోకి వచ్చారు. దీంతో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సరికొత్త రికార్డు సృష్టించింది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Telangana News: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్ - మార్కుల విధానంలో కీలక మార్పులు
Game Changer 3rd Single: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేసింది - తమన్ టాప్ క్లాస్ మ్యూజిక్... 'నానా హైరానా' ఇన్స్టంట్ చార్ట్ బస్టర్
Food Task Force: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలు - తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Srikakulam: ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? -  శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
ఆ పీఏ వైసీపీ మాజీ మంత్రి బినామీనా ? - శ్రీకాకుళంలో కలకలం రేపుతున్న ఏసీబీ సోదాలు !
Bangladesh:  బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న  హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం  !
బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
Bengaluru: జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
జొమాటోపై ఈ విధంగా రివెంజ్ తీర్చుకోవచ్చా ? ఈ వ్యక్తి చేసి చూపించాడు !
Allu Arjun: 'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
'నా గుండెను టచ్ చేశావ్' - దివ్యాంగ అభిమాని కళకు అల్లు అర్జున్ ఫిదా, వైరల్ వీడియో
Embed widget