అన్వేషించండి

Babar Azam : ఇప్పుడు అవసరమా బాబర్‌, పాక్‌ కెప్టెన్‌కు రూ.2 కోట్ల కార్‌ గిఫ్ట్‌ ! అందుకేనా?

Pakistan Cricket: టీ 20 ప్రపంచకప్‌ లో మాజీ క్రికెటర్లు, అభిమానులు సహా దేశమంతా బాబర్‌ సేన ఘోర ప్రదర్శనపై భగ్గుమంటోంది.సరిగ్గా ఈ సమయంలోనే బాబర్ కొత్తగా 2 కోట్ల విలువైన ఆడి కారు బహుమతిగా తీసుకున్నాడు.

 Pakistan Journalist Raises Serious Allegation : టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup)లో లీగ్‌ దశలోనే వెనుదిరిగిన పాక్‌(Pakistan) జట్టుపై సర్వత్రా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. మాజీ క్రికెటర్లు, అభిమానులు సహా దేశమంతా బాబర్‌ సేన ఘోర ప్రదర్శనపై భగ్గుమంటూనే ఉంది. అమెరికా చేతిలో ఎదురైన పరాభవాన్ని పాక్‌ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోలేకపోతున్నారు. 2022లో టీ 20 ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన పాక్‌... 2024లో గ్రూప్‌ దశలోనే వెనుదిరగడంపై మాజీలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. సీనియర్లు అందరినీ జట్టు నుంచి పీకి పారేయాలంటూ పీసీబీకి సూచనలు చేస్తున్నారు. వారి పేలవ ఫిట్‌నెసే పాక్‌ వరుస వైఫల్యాలకు కారణమని విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌(Babar Azam) కొత్తగా 2 కోట్ల రూపాయలతో ఆడి కారును బహుమతిగా తీసుకోవడంపై తీవ్ర ఆరోపణలు చెలరేగుతున్నాయి. బాబర్‌ విలాసవంతమైన కారును బహుమతిగా ఎందుకు తీసుకున్నారంటూ పాక్‌ జర్నలిస్ట్‌ ఒకరు ఘాటుగా ప్రశ్నించారు. 

బాబర్‌పై తీవ్ర ఆరోపణలు
 టీ 20 ప్రపంచకప్‌లో లీగ్‌ దశలోనే పాక్‌ వెనుదిరగడం వెనకు కెప్టెన్ బాబర్‌ ఆజమ్‌ వైఫల్యం కూడా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్‌  సీనియర్ జర్నలిస్ట్ ముబాషిర్ లుక్మాన్ బాబర్ ఆజంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ కెప్టెన్‌ బాబర్‌ ఖరీదైన కారును బహుమతిగా తీసుకోవడంపై జర్నలిస్ట్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. బాబర్‌కు గత ఏడాది చివర్లో అతని అన్నయ్య ఆడి ఇ-ట్రాన్ జిటి కారును బహుమతిగా ఇచ్చాడు. భారత్‌లో ఈ కారు ధర సుమారు 2 కోట్ల రూపాయలుగా ఉంది. పాకిస్తాన్ రూపాయల్లో ఇది మన కరెన్సీకు రెట్టింపు ఉంటుంది. బాబర్ ఆజం కొత్తగా ఇ-ట్రాన్‌ ఆడి కారును బహుమతిగా తీసుకున్నాడని... దానిని అతని సోదరుడు బహుమతిగా ఇచ్చాడని బాబర్‌ చెప్తున్నాడని... 7 నుంచి 8 కోట్ల రూపాయల కారును బహుమతిగా ఇచ్చేంతలా అసలు బార్‌ సోదరుడు ఏం పనిచేస్తున్నాడని జర్నలిస్ట్ ఒక వీడియోలో ప్రశ్నించాడు. చిన్న జట్ల చేతిలో ఓడిపోతే ప్లాట్లు, కార్లు రావు అని.. అసలు బాబర్‌కు కారు ఇవ్వడం వెనక ఎవరు ఉన్నారో అందరికీ తెలుసని ఆ పాక్‌ జర్నలిస్ట్‌ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాక్‌ జర్నలిస్ట్‌ వ్యాఖ్యలు బాబర్‌ అన్నయ్య ఫిక్సర్ల నుంచి డబ్బులు తీసుకున్నాడనే కోణంలో ఉండడంతో క్రికెట్‌ ప్రపంచం విస్మయం వ్యక్తం చేస్తోంది. అయితే దీనికి ఎలాంటి ఆధారాలు లేవని... ఒక జర్నలిస్ట్‌ వ్యాఖ్యలను పట్టుకుని బాబర్‌ను అనుమానించడం కరెక్ట్‌ కాదని కొందరు అంటున్నారు. 

వేటు తప్పదు
 కెప్టెన్ బాబర్ ఆజం, ముహమ్మద్ రిజ్వాన్, షాహీన్ షా అఫ్రిదితో సహా T20 ప్రపంచ కప్‌లో విఫలమైన పలువురు సీనియర్ ఆటగాళ్లకు ఆగస్టులో బంగ్లాదేశ్‌తో స్వదేశీ టెస్ట్ సిరీస్‌లో విశ్రాంతి ఇవ్వవచన్న వాదన వినిపిస్తోంది. ఇంగ్లండ్ కౌంటీ జట్టు యార్క్‌షైర్‌కు కెప్టెన్‌గా ఉన్న టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్, హెడ్ కోచ్ జాసన్ గిల్లెస్పీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో జట్టులో ఎలా ఉండాలన్న దానిపై ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: 'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
'సినిమా చూశాకే వెళ్తానని బన్నీ అన్నారు' - ఆధారాలతో సహా బయటపెట్టిన తెలంగాణ పోలీసులు
Devansh: చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
చెస్‌లో దేవాన్ష్ ప్రపంచ రికార్డు - వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి సర్టిఫికెట్, నారా కుటుంబం హర్షం
Royal Enfield Bullet 350 Vs Hunter 350: రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది బెస్ట్ బైక్?
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Government Banned OTT Apps: 18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
18 ఓటీటీ యాప్స్ బ్యాన్ చేసిన ప్రభుత్వం - ఎందుకో తెలుసా?
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Embed widget