అన్వేషించండి

India vs South Africa: ఇది కదా మ్యాచ్‌ అంటే, దక్షిణాఫ్రికాతో భారత్‌ ఢీ

ODI World Cup 2023 IND vs SA: ఒక జట్టు ఈ ప్రపంచకప్‌లో అయిదుసార్లు 300కుపైగా పరుగులు సాధించి ప్రత్యర్థి జట్లను చిత్తు చేసింది. మరో జట్టు ప్రత్యర్థి జట్టును కేవలం 55 పరుగులకే కుప్పకూల్చి సత్తా చాటింది.

ODI World Cup 2023 SA vs Ind:
ఒక జట్టు ఈ ప్రపంచకప్‌లో అయిదుసార్లు 300కుపైగా పరుగులు సాధించి ప్రత్యర్థి జట్లను చిత్తు చేసింది. మరో జట్టు ప్రత్యర్థి జట్టును కేవలం 55 పరుగులకే కుప్పకూల్చి సత్తా చాటింది. ఇప్పటికే ఆ రెండు జట్లు ఏవో మీకు అర్థమై ఉంటుంది. ఆ రెండింట్లో తొలి జట్టు దక్షిణాఫ్రికా అయితే... రెండో జట్టు టీమిండియా. ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు అప్రతిహాత జైత్రయాత్ర సాగిస్తుంటే.... సఫారీ జట్టు కూడా అదే తరహాలో ముందుకు సాగుతోంది. ఒక్క నెదర్లాండ్స్‌ మినహా భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అసలు దక్షిణాఫ్రికాకు ఓటమే లేదు. ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ ప్రోటీస్‌ జట్టు దూసుకుపోతుంది. ఈ మహా సంగ్రామంలో టీమిండియాది ఇదే కథ. అసలు ఇప్పటివరకూ రోహిత్‌ సేనకు అసలు పోటీనే లేకుండా పోయింది. బ్యాటుతో బ్యాటర్లు అదరగొడుతుంటే... బంతితో బౌలర్లు బెదరగొడుతున్నారు. ఈ రెండు జట్లు రేపు అమీతుమీ తేల్చుకున్నాయి. ఈ ప్రపంచకప్‌లో హైలెట్‌ మ్యాచ్‌గా భావిస్తున్న పోరులో కోల్‌కత్తా ఈడెన్‌గార్డెన్స్‌లో ప్రొటీస్‌.. భారత్‌ తలపడుతున్నాయి.
 
ప్రపంచకప్‌లో అసలైన పోరుకు రంగం సిద్ధమైంది. మహా సంగ్రామం పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు అగ్రస్థానం కోసం పోటీ పడబోతున్నాయి. దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడబోతుంది. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న ఇరు జట్లు ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఒక్క మ్యాచ్‌ ఓడిపోకుండా ప్రపంచకప్‌ గెలవాలనే పట్టుదలతో ఉన్న రోహిత్‌ సేన ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సెమీస్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలని చూస్తోంది.  2011 ప్రపంచకప్‌లో ఒక్క దక్షిణాఫ్రికా చేతిలోనే టీమిండియా ఓడిపోయింది. ఆ ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలని భారత్‌ చూస్తోంది. బ్యాటింగ్‌లో భారత జట్టు చాలా బలంగా ఉంది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్‌లతో బ్యాటింగ్‌ దుర్భేద్యంగా ఉంది. గత మ్యాచ్‌లో త్రుటిలో సెంచరీలు చేజార్చుకున్న కోహ్లీ, గిల్ ఈ మ్యాచ్‌లు కచ్చితంగా శతకాలు సాధించాలని పట్టుదలగా ఉన్నారు. రోహిత్‌ శర్మ కూడా భారీ స్కోరుపై కన్నేశాడు. గత మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన శ్రేయస్స్‌ అయ్యర్‌ మరోసారి దానిని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఇటు టీమిండియా బౌలింగ్‌ విభాగం పిచ్‌పై నిప్పులు చెరుగుతోంది. శ్రీలంకను కేవలం 55 పరుగులకే కుప్పకూల్చి సత్తా చాటింది. ఆడిన మూడు మ్యాచుల్లో మహమ్మద్ షమీ రెండోసార్లు అయిదు వికెట్లు తీసి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. బుమ్రా, సిరాజ్‌ కూడా మెరుపులు మెరిపిస్తున్నారు. కుల్‌దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా కూడా రాణిస్తుండడంతో టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. 
 
దక్షిణాఫ్రికా కూడా బలంగానే
 ఒక నెదర్లాండ్స్‌తో మినహా మిగిలిన అన్ని మ్యాచుల్లో దక్షిణాఫ్రికా అన్ని విజయాలే సాధించింది. పవర్ హిట్టర్లతో నిండిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్.. భారత బౌలర్లకు సవాల్‌ విసరనుంది. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు 428/ దక్షిణాఫ్రికా పేరు మీదే ఉంది. అయిదు మ్యాచుల్లో ప్రొటీస్‌ 300కుపైగా పరుగులు చేసింది. డి కాక్ ఏడు మ్యాచ్‌ల్లో 545 పరుగులతో ఈ ప్రపంచకప్‌లో టాప్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు. కానీ లక్ష్యాన్ని ఛేదించడమే ప్రొటీస్‌ను ఇబ్బంది పెడుతోంది. దక్షిణాఫ్రికా పాకిస్థాన్‌పై చివరి వికెట్‌కు విజయం సాధించింది. ఈడెన్‌ గార్డెన్స్‌లో రెండోసారి బ్యాటింగ్‌ తేలిక కాబట్టి టాస్‌ కీలకంగా మారనుంది. 
 
భారత్ జట్టు: రోహిత్ శర్మ ( కెప్టెన్‌), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, KL రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
 
దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్‌), గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, ఆండిల్ ఫెహ్లుక్వాయో, కేశవ్ మహరాజ్, ఐడెన్ మాక్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగీ ఎంగిడి, కగిసో రబాడ, షంసీ, రాస్సీ వాన్ డెర్ డస్సెన్, లిజాద్ విలియమ్స్.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు - బీఆర్ఎస్ నేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు - బీఆర్ఎస్ నేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Harish Rao Tweet: కాంగ్రెస్ పాలనలో పోలీసుల జీవితాలకే భద్రత లేదు - రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు
కాంగ్రెస్ పాలనలో పోలీసుల జీవితాలకే భద్రత లేదు - రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ajith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు - బీఆర్ఎస్ నేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు - బీఆర్ఎస్ నేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Harish Rao Tweet: కాంగ్రెస్ పాలనలో పోలీసుల జీవితాలకే భద్రత లేదు - రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు
కాంగ్రెస్ పాలనలో పోలీసుల జీవితాలకే భద్రత లేదు - రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపాటు
Pradeep Machiraju: బుల్లితెరపై ప్రదీప్ రీ ఎంట్రీ... వెంకీ మామతో 'బ్రహ్మముడి' కావ్య కామెడీ... సంక్రాంతి వేడుక కోసం
బుల్లితెరపై ప్రదీప్ రీ ఎంట్రీ... వెంకీ మామతో 'బ్రహ్మముడి' కావ్య కామెడీ... సంక్రాంతి వేడుక కోసం
Parents Property Rights: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఆస్తులు వెనక్కే, వారి పేరిటే తిరిగి రిజిస్ట్రేషన్: ఏపీ ప్రభుత్వం
Renu Desai: రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
రేణూ దేశాయ్‌ను ఏడిపించిన క్లైమాక్స్... ఆ సినిమాలో దివి ఏం చేసిందో తెలుసా?
Hyderabad Metro Phase 2: మెట్రోల డీపీఆర్‌లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు- ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల‌పై సమీక్ష
మెట్రోల డీపీఆర్‌లపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు- ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్ల‌పై సమీక్ష
Embed widget