అన్వేషించండి

ODI World Cup 2023 : నేటి నుంచి వరల్డ్ కప్‌ ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు- మరి భారత్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో తలపడుతుంది?

ODI World Cup 2023 : వరల్డ్ కప్ 2023కు ముందు అన్ని జట్లు రెండేసి వామప్ మ్యాచ్‌లు ఆడతాయి. తొలి వామప్ మ్యాచ్ గువాహటిలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య జరగనుంది.

ODI World Cup 2023: వన్డే వరల్డ్‌కప్‌నకు ముందు అన్ని జట్లు ఆడే వామప్ మ్యాచ్‌లు నేటి (సెప్టెంబర్ 5) నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి వామప్‌ మ్యాచ్ గువాహటిలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య జరగనుంది. తొలి రోజు మొత్తం మూడు వామప్‌ మ్యాచ్లు జరగనున్నాయి. రెండో మ్యాచ్ తిరువనంతపురంలో దక్షిణాఫ్రికా- అఫ్గానిస్తాన్ మధ్య, మూడో మ్యాచ్ హైదరాబాద్‌లో పాకిస్థాన్- న్యూజిలాండ్ మధ్య జరగనుంది. సెప్టెంబర్ 30న  ఇంగ్లాండ్‌తో టీమ్ఇండియా తొలి వామప్ మ్యాచ్ ఆడనుంది.

ఇంగ్లండ్, నెదర్లాండ్స్‌తో భారత్ తలపడనుంది.

వామప్ మ్యాచుల్లో ఇంగ్లండ్, నెదర్లాండ్స్ జట్లతో భారత్ తలపడనుంది. సెప్టెంబర్ 30 శనివారం గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో భారత్ తొలి మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత రెండో మ్యాచ్ అక్టోబర్ 3న తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి.

 

అన్ని జట్లు రెండు వామప్ మ్యాచ్‌లు ఆడతాయి.

ప్రపంచకప్‌కు ముందు మొత్తం 10 జట్లు రెండు రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడతాయి. సెప్టెంబర్ 29న ప్రారంభమైన వార్మప్ మ్యాచ్‌లు అక్టోబర్ 3 వరకు జరగనున్నాయి. మొదటి రోజు 3 మ్యాచ్‌, చివరి రోజు 2 మ్యాచ్‌లు, జరుగుతాయి. బర్సపారా క్రికెట్ స్టేడియం (గౌహతి), గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం (తిరువనంతపురం), రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం (హైదరాబాద్) వామప్ మ్యాచ్‌లకు ఎంపికయ్యాయి. వీటికి మాత్రం ప్రేక్షకులను అనుమతించడం లేదు. 

చివరి నిమిషంలో భారత్ మార్పులు చేసింది.

వామప్ మ్యాచ్‌ల ప్రారంభానికి ఒక్క రోజు ముందు అంటే సెప్టెంబర్ 28న భారత జట్టు తుది జట్టులో చివరి మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు. గాయంతో సతమతమవుతున్న అక్షర్ సకాలంలో కోలుకోలేకపోవడంతో అశ్విన్‌కు భారత ప్రపంచకప్ జట్టులో చోటు దక్కింది.

అక్టోబర్ 5 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది.

అక్టోబర్ 5 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. టోర్నీలో భాగంగా అక్టోబర్ 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో టీం ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది.

వరల్డ్ కప్‌ వామప్‌ మ్యాచ్‌ల సమయం డేట్: అన్ని వామప్‌ మ్యాచ్‌లు కూడా ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతాయి. 

సెప్టెంబ్‌ 29
బంగ్లాదేశ్‌ VS శ్రీలంక- బర్సపారా క్రికెట్‌ స్టేడియం , గువహటి 
దక్షిణాఫ్రికా VS  అఫ్ఘనిస్థాన్- గ్రీన్‌ ఫీల్డ్‌ అంతర్జాతీయ స్టేడియం, తిరువనంతపురం 
న్యూజిలాండ్‌ VS పాకిస్థాన్ -రాజీవ్‌గాంధి అంతర్జాతీయ స్టేడియం , హైదరాబాద్ 

సెప్టెంబర్‌ 30
ఇండియా VS ఇంగ్లండ్- బర్సపారా స్టేడియం, గువహటి
ఆస్ట్రేలియా VS నెదర్లాండ్స్- గ్రీన్‌ ఫీల్డ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం, తిరువనంతపురం 

అక్టోబర్ 2

ఇంగ్లండ్‌ VS బంగ్లాదేశ్‌ - బర్సపారా స్టేడియం, గువహటి
న్యూజిలాండ్‌VS దక్షిణాఫ్రికా - గ్రీన్‌ ఫీల్డ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం, తిరువనంతపురం 

అక్టోబర్  3
అఫ్ఘనిస్థాన్ VS శ్రీలంక- బర్సపారా క్రికెట్‌ స్టేడియం , గువహటి 
ఇండియా VS నెదర్లాండ్స్‌- గ్రీన్‌ ఫీల్డ్‌ అంతర్జాతీయ స్టేడియం, తిరువనంతపురం 
పాకిస్థానం VS ఆస్ట్రేలియా - రాజీవ్‌గాంధి అంతర్జాతీయ స్టేడియం , హైదరాబాద్ 

వన్డే వరల్డ్‌కప్‌ 2023 వామప్‌ మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్‌, టెలికాస్ట్‌ వివరాలు :
భారత్‌లో ఈ ఈవెంట్‌ను స్టార్‌ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌, డిస్నీహాట్‌ స్టార్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. 
యూకేలో Sky Sports Cricket ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. 
సౌత్‌ ఆఫ్రికాలో SS Grandstand ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. 
యూఎస్‌ఏలో ESPN+ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP and TS Election 2024 Polling percentage: ఏపీ, తెలంగాణలో భారీగా ఓటింగ్ నమోదు - ఓటేసిన రెండున్నర కోట్ల ప్రజలు
ఏపీ, తెలంగాణలో భారీగా ఓటింగ్ నమోదు - ఓటేసిన రెండున్నర కోట్ల ప్రజలు
Tender vote : సర్కారు సినిమాలో విజయ్‌ లెక్క ఓటు వేసిన మహిళ- మీ ఓటు లేకపోతే ఇలా చేయొచ్చు !
సర్కారు సినిమాలో విజయ్‌ లెక్క ఓటు వేసిన మహిళ- మీ ఓటు లేకపోతే ఇలా చేయొచ్చు !
TS Election 2024 Voting updates: తెలంగాణలో సమస్యల పరిష్కారం కాలేదని పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాలు
తెలంగాణలో సమస్యల పరిష్కారం కాలేదని పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు
Lok Sabha election 2024 Phase 4 Voting Live: దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న పోలింగ్ - మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40.32 శాతం పోలింగ్
దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న పోలింగ్ - మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40.32 శాతం పోలింగ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Srikakulam Curfew Voting | పోలింగ్ జాతర రోజు సిక్కోలు వాసుల స్వచ్ఛంద నిర్ణయం | ABP DesamTelangana Voters Recation | తెలంగాణ పోలింగ్ పై ఓటర్లు అభిప్రాయం ఏంటీ..? | ABP DesamHigh Tension at AP Elections 2024 | ఏపీ ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు | ABP DesamAP Elections 2024 Polling Update | జోరుగా పోలింగ్...ఓటర్లు డిసైడ్ అయిపోరా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP and TS Election 2024 Polling percentage: ఏపీ, తెలంగాణలో భారీగా ఓటింగ్ నమోదు - ఓటేసిన రెండున్నర కోట్ల ప్రజలు
ఏపీ, తెలంగాణలో భారీగా ఓటింగ్ నమోదు - ఓటేసిన రెండున్నర కోట్ల ప్రజలు
Tender vote : సర్కారు సినిమాలో విజయ్‌ లెక్క ఓటు వేసిన మహిళ- మీ ఓటు లేకపోతే ఇలా చేయొచ్చు !
సర్కారు సినిమాలో విజయ్‌ లెక్క ఓటు వేసిన మహిళ- మీ ఓటు లేకపోతే ఇలా చేయొచ్చు !
TS Election 2024 Voting updates: తెలంగాణలో సమస్యల పరిష్కారం కాలేదని పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాలు
తెలంగాణలో సమస్యల పరిష్కారం కాలేదని పోలింగ్ బహిష్కరించిన పలు గ్రామాల ప్రజలు
Lok Sabha election 2024 Phase 4 Voting Live: దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న పోలింగ్ - మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40.32 శాతం పోలింగ్
దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న పోలింగ్ - మధ్యాహ్నం ఒంటి గంట వరకూ 40.32 శాతం పోలింగ్
Andhra Pradesh Polling Updates: నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై  వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం
నర్సరావుపేట, విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థులపై వైసీపీ నేతల దాడి- కార్లు ధ్వంసం- పరిస్థితి ఉద్రిక్తం
Tenali News: తెనాలిలో ఉద్రిక్తత- ఎమ్మెల్యే శివకుమార్‌పై తిరుగబడ్డ ఓటర్లు
తెనాలిలో ఉద్రిక్తత- ఎమ్మెల్యే శివకుమార్‌పై తిరుగబడ్డ ఓటర్లు
Orry: రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి
రోజుకు రూ.50 లక్షల సంపాదన - నాతో ఫొటో కావాలన్నా, ముట్టుకోవాలన్నా డబ్బులివ్వాలి - ఇవే నా రేట్లు: ఓర్రి
AP Polling Updates: ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు- పల్నాడులో హింసాత్మకం
Embed widget