ODI World Cup 2023: నేను విన్నాను నేనున్నాను - క్రికెట్ అభిమానులకు ‘ఓయో’ గుడ్ న్యూస్
అక్టోబర్ నుంచి భారత్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ మ్యాచులు జరుగబోయే నగరాల్లో హోటల్స్ అద్దెలు ఆకాశాన్నంటుతున్నాయి.
![ODI World Cup 2023: నేను విన్నాను నేనున్నాను - క్రికెట్ అభిమానులకు ‘ఓయో’ గుడ్ న్యూస్ ODI World Cup 2023 OYO To Come Up With 500 New Hotels For Affordable Stay During The Marquee Tournament ODI World Cup 2023: నేను విన్నాను నేనున్నాను - క్రికెట్ అభిమానులకు ‘ఓయో’ గుడ్ న్యూస్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/08/4644767e24d091c9a36953ec6d6e6d221688811681626689_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ODI World Cup 2023: వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో అక్టోబర్ - నవంబర్ లో ప్రపంచకప్ మ్యాచులు జరుగబోయే నగరాల్లో హోటల్ రూమ్ రెంట్స్ కొండెక్కుతున్న వేళ ఆతిథ్య రంగంలో సంచలనాలు నమోదుచేస్తున్న ‘ఓయో’.. క్రికెట్ అభిమానులకు క్రేజీ న్యూస్ చెప్పింది. భారత్ - పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా జరుగబోయే మ్యాచ్ కు గాను అక్కడి హోటల్స్ లో గదులు అద్దెకు కావాలంటే రోజుకు రూ. 70 వేల నుంచి లక్ష రూపాయలు వెచ్చించినా దొరకడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. రాబోయే మూడు నెలల్లో ప్రపంచకప్ జరుగబోయే పది నగరాలలో ఏకంగా 500 కొత్త హోటల్స్ ను తెరవనుంది.
ఈ మేరకు ఓయో ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘రాబోయే మూడు నెలల్లో వన్డే వరల్డ్ కప్ జరుగబోయే పది నగరాలలో 500 కొత్త హోటల్స్ ను తెరవబోతున్నాం. ప్రపంచకప్ మ్యాచులను లైవ్ గా చూసేందుకు చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వారికి అందుబాటు ధరల్లో ఉండే విధంగా వసతులు కల్పించేందుకు ఓయో సిద్ధమవుతుంది..’ అని తెలిపాడు.
OYO will add 500 hotels in the host cities in the next 3 months to meet the demand for World Cup 2023 as they want to ensure fans come from far away to enjoy the World Cup with affordable accommodation. [PTI] pic.twitter.com/ZYnm7W2p0L
— Johns. (@CricCrazyJohns) July 8, 2023
ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో.. గతంలో అహ్మదాబాద్ లోని స్టార్ హోటల్స్ లో రోజుకు రూ. 5 వేల నుంచి రూ. 6 వేల వరకూ ఉన్న గదుల అద్దెలు మ్యాచ్ నాటికి ఏకంగా రోజుకు లక్ష రూపాయలు ఇచ్చి బుక్ చేసుకుందామాన్నా దొరకడం లేదు. ఐటీసీతో పాటు ప్రముఖ హోటల్స్ లో అక్టోబర్ లో రూమ్స్ అన్నీ బుక్ అయిపోయినట్టు సమాచారం. హై ఫై హోటల్స్ లోనే గాక నార్మల్ స్టేయింగ్ హోటల్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ లో కూడా అద్దెలు కాక రేపుతున్నాయి. రోజుకు రూ. 2 వేల నుంచి రూ. 3 వేలకు వరకు ఛార్జ్ చేసే హోటల్స్ కూడా అక్టోబర్ లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నవారికి రూ. 30 వేల నుంచి రూ. 40 వేల దాకా వసూలు చేస్తున్నాయి. మిగతా హోటల్స్ తో పోలిస్తే ఓయో ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉంటాయి. మరి రాబోయే వన్డే వరల్డ్ కప్ లో ఓయో.. క్రికెట్ అభిమానులకు ఎలాంటి వసతులు కల్పిస్తుందో వేచి చూడాలి.
ఓయోతో పాటు మరో ప్రముఖ సంస్థ ‘మేక్ మై ట్రిప్’ కూడా అభిమానులకు శుభవార్త చెప్పింది. ‘దేశవ్యాప్తంగా అక్టోబర్, నవంబర్ లో హోమ్ స్టే ప్రాపర్టీలలో గణనీయమైన పెరుగుదల ఉండటాన్ని మేం గమనిస్తున్నాం. ఇది మంచి సంకేతం. రేట్లు పెరుగుతున్నా క్రికెట్ ఫ్యాన్స్ కు అందుబాటు ధరలలో ఉన్న ప్రాపర్టీస్ ను ఇంకా ఉన్నాయి..’అని మేక్ మై ట్రిప్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పరీక్షిత్ చౌధరి తెలిపాడు.
వరల్డ్ కప్ లో టీమిండియా షెడ్యూల్ :
- అక్టోబర్ 08 : ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా - చెన్నై
- అక్టోబర్ 11 : ఇండియా వర్సెస్ అఫ్గానిస్తాన్ - ఢిల్లీ
- అక్టోబర్ 15 : ఇండియా వర్సెస్ పాకిస్తాన్ - అహ్మదాబాద్
- అక్టోబర్ 19 : ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ - పూణె
- అక్టోబర్ 22 : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ - ధర్మశాల
- అక్టోబర్ 29 : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ - లక్నో
- నవంబర్ 02 : ఇండియా వర్సెస్ శ్రీలంక - ముంబై
- నవంబర్ 05 : ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా - కోల్కతా
- నవంబర్ 11 : ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ - బెంగళూరు
భారత్ ఆడబోయే మ్యాచ్ లు అన్నీ మధ్యాహ్నం 2 గంటల నుంచే జరుగుతాయి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)