అన్వేషించండి

Maxwell Fastest ODI Hundred: ప్రపంచకప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీ, మ్యాక్స్ విధ్వంసంతో రికార్డులు బద్దలు

ODI World Cup 2023: పసికూన నెదర్లాండ్స్‌పై  ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. తాను క్రీజులో కాసేపు నిలబడితే ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించాడు.

Maxwell Fastest ODI Hundred in World Cup 2023: 
పసికూన నెదర్లాండ్స్‌పై  ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం సృష్టించాడు. తాను క్రీజులో కాసేపు నిలబడితే ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించాడు. ప్రపంచకప్‌ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు పంపాడు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ భారీ ఇన్నింగ్స్‌ ఆడని మ్యాక్స్‌వెల్‌ సునామీలా డచ్‌ జట్టుపై విరుచుకుపడ్డాడు. నెదర్లాండ్స్‌ బౌలర్లను  ఊచకోత కోశాడు. దొరికిన బంతిని దొరికినట్లు బాది పడేశాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచకప్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ సెంచరీని సాధించేశాడు. మ్యాక్స్‌వెల్‌ సునామీలో డచ్‌ బౌలర్లు కొట్టుకుపోయారు. దొరికిన బంతిని దొరికినట్లు.. బంతి ఎక్కడ వేయాలో కూడా బౌలర్లకు తేలీదన్నట్లు విధ్వంసం సృష్టించాడు. మ్యాక్స్‌వెల్ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా శతకం చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. వన్డే క్రికెట్‌లో ఇది నాల్గవ వేగవంతమైన సెంచరీ కూడా కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో మొత్తం 44 బంతులో ఎదుర్కొన్న మ్యాక్స్‌వెల్‌ 9 ఫోర్లు, 8 సిక్సులతో 106 పరుగులు చేశాడు. గ్లెన్‌ చేసిన 106 పరుగుల్లో 84 రన్స్‌ బౌండరీల రూపంలోనే వచ్చాయంటే విధ్వంసం ఎలా సాగిందో చెప్పొచ్చు. 
 
ఇదే ప్రపంచకప్‌లో శ్రీలంకపై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఐడెన్ మార్క్రామ్ కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేసి ఇప్పటివరకూ వేగవంతమైన సెంచరీ చేసిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇదే ప్రపంచకప్‌లో ఆ రికార్డును మ్యాక్స్‌ వెల్‌ బద్దలు కొట్టాడు. అంతకుముందు ఈ రికార్డు ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఓబ్రెయిన్ పేరిట ఉంది. కెవిన్ ఓబ్రెయిన్ 2011 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై 54 బంతుల్లో సెంచరీ సాధించాడు.
 
ప్రపంచకప్‌లో వేగవంతమైన సెంచరీలు
40 బంతుల్లో మ్యాక్స్‌వెల్‌ vs నెదర్లాండ్స్‌పై 2023
49 బంతుల్లో  ఐడెన్ మార్క్‌రామ్ vs శ్రీలంక2023
50 బంతుల్లో కెవిన్ ఓబ్రెయిన్ vs ఇంగ్లండ్, బెంగళూరు 2011
51 బంతుల్లో  గ్లెన్ మాక్స్‌వెల్ vs శ్రీలంక2015
52  బంతుల్లో AB డివిలియర్స్ vs వెస్టిండీస్ 2015
 
ఇక నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ సునామీ ఇన్నింగ్స్‌.. డేవిడ్‌ వార్నర్‌ మరోసారి శతక గర్జన చేసిన సమయాన... పసికూన నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించింది. డచ్‌ జట్టుపై నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 399 పరుగుల భారీ స్కోరు చేశారు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ప్రపంచకప్‌లోనే అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేసి నెదర్లాండ్స్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. 44 బంతుల్లో 9 ఫోర్లు, ఎనిమిది సిక్సులతో మ్యాక్స్‌ వెల్‌ 106 పరుగులు చేశాడు. మ్యాక్స్‌ వెల్‌ విధ్వంసకర శతకానికి తోడు పాకిస్థాన్‌పై భారీ సెంచరీతో చెలరేగిన డేవిడ్‌ బాయ్‌... ఈ మ్యాచ్‌లోనూ శతక నాదం చేశాడు. డేవిడ్‌ వార్నర్‌ 93 బంతుల్లో 11 ఫోర్లు 3 సిక్సర్లతో 104 పరుగులు చేసి మరోసారి సత్తా చాటాడు. వార్నర్‌కు తోడుగా స్టీవ్‌ స్మిత్‌, లబుషేన్‌ కూడా రాణించడంతో కంగారు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. స్టీవ్‌ స్మిత్‌ 68 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సుతో స్మిత్‌ 71 పరుగులు చేశాడు. లబుషేన్‌ తన సహజ స్వభావానికి విరుద్ధంగా ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో లబుషేన్‌ 62 పరుగులు చేశాడు.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hathras Stampede: హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
హాథ్రస్ విషాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి - ప్రముఖ నేతలు సంతాపం
Revanth Reddy: చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
చంద్రబాబుతో భేటీకి డేట్, ప్లేస్‌ ఫిక్స్ చేసిన రేవంత్ - ఆ రోజే ఇద్దరి తొలి సమావేశం
KCR News: కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
కాంగ్రెస్ పార్టీకి వింత లక్షణం, అలా ఛీ అనిపించుకుంటది - కేసీఆర్
Modi Speech: రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
రాహుల్ గాంధీవి పిల్లచేష్టలు, ఆ మాటలు క్షమించరానివి - మోదీ స్ట్రాంగ్ కౌంటర్
Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
సల్మాన్‌ ఖాన్‌ హత్యకు కుట్ర కారులోనే, ఆ కేసులో దిమ్మతిరిగే నిజాలు బయటికి
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Janasena MLA Chirri Balaraju : జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
జనసేన ఎమ్మెల్యేకు కారు కొనిచ్చిన కార్యకర్తలు - కానీ ఈఎంఐ ఆయన కట్టుకోవాల్సిందే !
PM Modi Speech: 2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
2024 వికసిత్ భారత్‌ కోసం 24x7 పని చేస్తాం: మోదీ, లోక్‌సభలో హోరెత్తిన నిరసనలు
Embed widget