అన్వేషించండి

BAN vs SL: వరుస పరాజయాలకు చెక్‌, లంకపై బంగ్లాదేశ్‌ ఘన విజయం

ODI World Cup 2023: ప్రపంచకప్‌లో వరుస పరాజయాల పరంపరకు బంగ్లాదేశ్‌ చెక్‌ పెట్టింది. మాజీ ప్రపంచకప్‌ ఛాంపియన్‌ శ్రీలంకపై ఘన విజయం సాధించింది.

ప్రపంచకప్‌లో వరుస పరాజయాల పరంపరకు బంగ్లాదేశ్‌ చెక్‌ పెట్టింది. మాజీ ప్రపంచకప్‌ ఛాంపియన్‌ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఢిల్లీలోని అరుణ్‌ జైట్లీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బౌలింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌..తొలుత శ్రీలంకను తక్కువ పరుగులకే కట్టడి చేసింది. బంగ్లాదేశ్‌ బౌలర్లు సమష్టిగా రాణించడంతో లంక 49.3 ఓవర్లలో 279 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బంగ్లాదేశ్‌ బ్యాటర్లు 41.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 280 పరుగుల లక్ష్యాన్ని  ఛేదించారు. బంగ్లా విజయంతో చరిత్‌ అసలంక అద్భుత శతకం వృథా అయింది. బంగ్లా బ్యాటర్లలో శాంటో 90 పరుగులు, షకీబుల్‌ హసన్‌ 82 పరుగులతో రాణించారు. వీరిద్దరి విలువైన భాగస్వామ్యంతో బంగ్లాదేశ్‌ అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 

 ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. తొలి ఓవర్‌లోనే షోరిఫుల్ ఇస్లాం శ్రీలంకకు షాక్ ఇచ్చాడు. 5 బంతుల్లో నాలుగు పరుగులు చేసిన కుశాల్‌ పెరీరాను అవుట్‌ చేశాడు. అనంతరం పాతుమ్‌ నిసంక, కుశాస్ మెండిస్‌ లంకను ఆదుకున్నారు. రెండో వికెట్‌కు కీలకమైన 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షకీబుల్‌ హసన్‌ విడదీశాడు. 30 బంతుల్లో 1 ఫోరు, 1 సిక్సుతో 19 పరుగులు చేసిన కుశాల్‌ను షకీబుల్‌ అవుట్‌ చేశాడు. దీంతో 66 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్‌ కోల్పోయింది. కాసేపటికే క్రీజులో కుదురుకున్న  పాతుమ్‌ నిసంక కూడా అవుట్‌ కావడంలో లంక కష్టాల్లో పడింది. 36 బంతుల్లో 8 ఫోర్లతో 41 పరుగులు చేసి మంచి టచ్‌లో కనిపించిన నిసంకను హసన్‌ షకీబ్‌ బౌల్డ్‌ చేశాడు. తర్వాత సధీర సమరవిక్రమ, చరిత్‌ అసలంక శ్రీలంకను భారీ స్కోరు దిశగా నడిపించారు.

 బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న సధీర సమరవిక్రమ, చరిత్‌ అసలంక జట్టును గౌరవప్రదమైన స్కోరు దిశగా నడిపించారు. కానీ సధీర సమరవిక్రమను షకీబుల్‌ హసన్‌ అవుట్‌ చేశాడు. 42 బంతుల్లో 4 ఫోర్లతో 41 పరుగులు చేసి సధీర సమరవిక్రమ అవుటయ్యాడు. దీర సమరవిక్రమను షకీబ్ అవుట్ చేసిన తర్వాత మాథ్యూస్ బ్యాటింగ్‌కి వచ్చాడు. కానీ మాధ్యూస్‌ బ్యాటింగ్‌కు రావడానికి చాలా సమయం తీసుకున్నాడు. దీంతో అతడిని అంపైర్‌ టైమ్డ్‌ అవుట్‌గా ప్రకటించాడు. దీంతో లంకకు ఎదురుదెబ్బ తగిలింది. 135 పరుగులకు లంక అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చరిత్‌ అసలంక105 బంతుల్లో ఆరు ఫోర్లు, అయిదు సిక్సులతో అసలంక 108 పరుగులు చేశాడు. అసలంక పోరాటంతో 49.3 ఓవర్లలో లంక 279 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో హసన్‌ షకీబ్‌ 3, షోరిఫుల్ ఇస్లాం 2, షకీబుల్‌ హసన్‌ రెండు వికెట్లు తీశారు.

 280 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు శుభారంభం లభించలేదు. జట్టు స్కోరు 17 పరుగుల వద్ద తన్జీద్‌ హసన్‌ అవుటయ్యాడు. 41 పరుగుల వద్ద లిట్టన్‌ దాస్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. దీంతో బంగ్లా లక్ష్యాన్ని ఛేదించడం కష్టమే అనిపించింది. కానీ హసన్ శాంటో 101 బంతుల్లో 12 ఫోర్లతో 90 పరుగులు, షకీబుల్‌ హసన్‌ 65 బంతుల్లోనే 12 ఫోర్లు, రెండు సిక్సులతో 82 పరుగులు చేశారు. వీరిద్దరి భాగస్వామ్యంతో బంగ్లా అవలీలగా లక్ష్యాన్ని ఛేదించింది. తర్వాత వీరిద్దరూ అవుటైనా బంగ్లాదేశ్‌కు ఎలాంటి కష్టం కాలేదు. అనంతరం బంగ్లాదేశ్‌ బ్యాటర్లు 41.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 280 పరుగుల లక్ష్యాన్ని  ఛేదించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh Davos Tour: దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
Nara Lokesh Davos Tour: దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్ - ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడి
సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్ - ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడి
White House Attack Case: వైట్ హౌస్‌పై దాడికి యత్నం కేసు, తెలుగు యువకుడికి 8 ఏళ్ల జైలుశిక్ష
వైట్ హౌస్‌పై దాడికి యత్నం కేసు, తెలుగు యువకుడికి 8 ఏళ్ల జైలుశిక్ష
Game Changer: 'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Konaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP DesamAttack on Saif Ali Khan | బాలీవుడ్ బడా హీరోలు టార్గెట్ గా హత్యాయత్నాలు | ABP DesamISRO SpaDEX Docking Successful | అంతరిక్షంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఇస్రో ఉపగ్రహాలు | ABP DesamKTR Attended ED Enquiry | ఫార్మూలా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరైన కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Davos Tour: దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
Nara Lokesh Davos Tour: దావోస్ పర్యటనకు మంత్రి లోకేష్, 30 మంది దిగ్గజ పారిశ్రామికవేత్తలతో భేటీ - ఉద్యోగాలు, పెట్టుబడులే టార్గెట్
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్ - ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడి
సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి అరెస్ట్ - ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు వెల్లడి
White House Attack Case: వైట్ హౌస్‌పై దాడికి యత్నం కేసు, తెలుగు యువకుడికి 8 ఏళ్ల జైలుశిక్ష
వైట్ హౌస్‌పై దాడికి యత్నం కేసు, తెలుగు యువకుడికి 8 ఏళ్ల జైలుశిక్ష
Game Changer: 'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
'గేమ్ చేంజర్' పైరసీ ప్రింట్ కేసులో అరెస్టులు... 'ఏపీ లోకల్ టీవీ' ఆఫీసుపై పోలీస్ రైడ్
YS Sharmila: సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబును ఏకిపారేసిన షర్మిల, హోదాపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ పథకాలపై చంద్రబాబును ఏకిపారేసిన షర్మిల, హోదాపై సైతం ఆసక్తికర వ్యాఖ్యలు
Ponnala Laxmaiah: మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ - పండుగకు సొంతూరికి వెళ్లిన సమయంలో నగదు, బంగారం లూటీ
మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో చోరీ - పండుగకు సొంతూరికి వెళ్లిన సమయంలో నగదు, బంగారం లూటీ
Sankranthiki Vasthunam 3 Days Collections : మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో...
మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో... "సంక్రాంతికి వస్తున్నాం" కలెక్షన్ల ఊచకోత... 'డాకు మహారాజ్' రికార్డు గల్లంతు
8th pay Commission: 8వ వేతన కమిషన్‌తో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరిగే ఛాన్స్ ఉంది! గణాంకాలు స్టెప్ బై స్టెప్ చూడండి
8వ వేతన కమిషన్‌తో ప్రభుత్వ ఉద్యోగుల జీతం ఎంత పెరిగే ఛాన్స్ ఉంది! గణాంకాలు స్టెప్ బై స్టెప్ చూడండి
Embed widget