Kane Williamson: కేన్ మామ కొత్త రికార్డు - ఏకంగా 134 సార్లు!
న్యూజిలాండ్ తరఫున 134 సార్లు 50కి పైగా స్కోరు సాధించి కేన్ విలియమ్సన్ రికార్డు సృష్టించాడు.
ICC Cricket World Cup 2023: ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లోని టాప్ క్రికెటర్లలో కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్‌కు చెందిన గొప్ప క్రికెటర్. కేన్ విలియమ్సన్ ప్రపంచ క్రికెట్‌తో పాటు న్యూజిలాండ్‌లో కూడా అనేక కొత్త రికార్డులను సృష్టించాడు. ఎన్నో పాత రికార్డులను బద్దలు కొట్టాడు. ఈరోజు కూడా అదే చేశాడు. ప్రపంచకప్‌లో నేడు బంగ్లాదేశ్‌తో న్యూజిలాండ్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ కూడా ఆడుతున్నాడు. విలియమ్సన్‌కు ఈ ప్రపంచకప్‌లో ఇదే తొలి మ్యాచ్.
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బంగ్లాదేశ్‌పై హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి తన పేరిట సరికొత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున అత్యధిక సార్లు 50కి పైగా పరుగులు చేసిన ఆటగాడిగా విలియమ్సన్ నిలిచాడు. విలియమ్సన్ తన కెరీర్‌లో 134వ సారి 50కి పైగా పరుగులు చేశాడు. దీంతో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్ టేలర్ రికార్డును బద్దలు కొట్టాడు.
కేన్ విలియమ్సన్ సరికొత్త రికార్డు
కేన్ విలియమ్సన్ కంటే ముందు ఈ రికార్డు రాస్ టేలర్ పేరిట ఉంది. రాస్ టేలర్ అన్ని ఫార్మాట్లలో న్యూజిలాండ్ తరపున 133 సార్లు 50 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇప్పుడు కేన్ విలియమ్సన్ అతనిని దాటేశాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మూడో స్థానంలో నిలిచాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో 112 సార్లు ఈ ఘనతను సాధించాడు.
ఈ జాబితాలో న్యూజిలాండ్ దిగ్గజ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ పేరు కూడా చేరింది. మొత్తంగా అతను తన కెరీర్‌లో 50 లేదా అంతకంటే స్కోరు 99 సార్లు సాధించాడు. న్యూజిలాండ్ తరఫున కొన్నేళ్లుగా విధ్వంసక ఓపెనింగ్ బ్యాటింగ్ ఆడిన బ్రెండన్ మెకల్లమ్ పేరు కూడా ఈ జాబితాలో చేరింది. క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో కలిపి మెకల్లమ్ 50 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు 95 సార్లు చేశాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial