అన్వేషించండి

Cricketer Nitish Reddy: తిరుమలలో మోస్ట్ హ్యాపెనింగ్ ఇండియన్ ఆల్ రౌండర్ సందడి - మోకాళ్లపై మెట్లు ఎక్కి భక్తిని చాటుకున్న భారత స్టార్

Tirumala: మోస్ట్ హ్యాపెనింగ్ ఇండియన్ ఆల్ రౌండర్ నితీశ్‌రెడ్డి తిరుమలలో సందడి చేశాడు. మోకాళ్లపై మెట్లు ఎక్కి తన భక్తిని చాటుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.

Nitish Reddy News: భారత క్రికెటర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి.. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలను దర్శించుకున్నాడు. తాజాగా వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోడానికి వచ్చాడు. మోకాళ్ల పర్వతం దగ్గర మోకాళ్లతో మెట్లు ఎక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా నిమిషాల్లో వైరలైంది. గతేడాది ద్వితీయార్థంలో నితిశ్ రెడ్డి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఐపీఎల్లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో టీమిండియాలో చోటు దక్కించుకున్న నితీశ్.. టీ20ల్లో అదరగొట్టాడు. ఆ తర్వాత అనూహ్యంగా ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు జట్టులో అరంగేట్రం చేశాడు. ఈ సిరీస్‌లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు. అటు బౌలింగ్‌లోనూ ఐదు వికెట్లతో అదరగొట్టి సిసలైన ఆల్ రౌండర్ అనిపించాడు. ఇక మెల్‌బోర్న్‌లో జరిగిన నాలుగో టెస్టులో స్టన్నింగ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాట్ ఝుళిపించి, ఫాలో ఆన్ నుంచి తప్పించి ఆపద్భాందవుడు అయ్యాడు. 

ఇంగ్లాండ్ సిరీస్లోనూ..
ఇక ఈ నెల 22 నుంచి జరిగే ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌లోనూ నితీశ్‌కుమార్‌రెడ్డి చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు తను ఉన్న ఫామ్ ప్రకారం జట్టులో చోటు ఖాయమే. ఈ సిరీస్‌లో సత్తా చాటితే వన్డే సిరీస్‌లోనూ తను ఎంపికయ్యే అవకాశముంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తర్వాత ఆ స్థాయి ఆల్‌రౌండర్ జట్టుకు లభించలేదు. నితీశ్ రెడ్డి అతనికి వారసుడని పలువురు భావిస్తున్నారు. అయితే నిలకడగా రాణిస్తేనే నితీశ్‌కు టీమిండియాలో చోటు నిలబడుతుందని ఇప్పటికే పలువురు మాజీలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు వచ్చే నెలలో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడాలని నితీశ్ కోరుకుంటున్నాడు. అందుకు ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌లను వేదికగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. నిజానికి పాకిస్తాన్‌లో ఈ ట్రోఫీ వచ్చే నెల 19 నుంచి ప్రారంభమవుతుండగా, భారత్ ఆడే మ్యాచ్‌లు దుబాయిలో జరుగుతున్నాయి. 20న బంగ్లాదేశ్, 23న పాక్, మార్చి 2న న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. 

గ్రేమ్ స్మిత్ ప్రయోగం బాటలో టీమిండియా..
భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా ఇప్పుడు ఎవరనే ప్రశ్న ఉదయిస్తోంది. రోహిత్ శర్మ, అటు బ్యాటర్‌గా ఇటు కెప్టెన్‌గా విఫలమవుతుండటంతో నూతన కెప్టెన్ వేటలో టీమిండియా పడింది. అయితే నూతన సారథిగా కుర్రాడు యశస్వి జైస్వాల్‌ను నియమించాలని కోచ్ గౌతం గంభీర్ ఆలోచనగా ఉంది. స్థిరమైన ఆటతీరుతో ఇప్పటికే టెస్టు జట్టులో పాతుకుపోయిన జైస్వాల్.. గతేడాది భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన టెస్టు ప్లేయర్‌గా నిలిచాడు. దూకుడైన ఆటతీరుకు అతను చిరునామా. అయితే కేవలం మరీ 23 ఏళ్లకే అతడిని కెప్టెన్‌గా చేయడంపై సందేహాలు నెలకొన్నాయి. అయితే సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఉదంతాన్ని పలువురు ప్రస్థావిస్తున్నారు. సంక్షోభంలో చిక్కుకున్న సౌతాఫ్రికాకు కేవలం 22 ఏళ్ల వయసులో కెప్టెన్‌గా బాధ్యతలు వహించిన స్మిత్.. దాదాపు 11 ఏళ్ల పాటు సారథిగా జట్టును ముందుకు నడిపించాడు. ఈ కాలంలో జట్టును దుర్బేధ్యంగా మార్చాడు. టెస్టు క్రికెట్లో అతనితో విజయవంతమైన ఉదాహరణ. జైస్వాల్‌కు కూడా పగ్గాలప్పగిస్తే జట్టును బలోపేతమవుతుందని పలువురు భావిస్తున్నారు. ఇక రేసులో ఉన్న బుమ్రా.. గాయాలతో సతమతమవుతుండటం, సీనియర్ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ఎప్పుడెలా ఆడుతాడో తెలియదు. బాధ్యత లేకుండా ఆడతాడనే అపప్రథ ఉంది. అలాంటి ఆటగానికి టీమిండియా లాంటి జట్టు పగ్గాలు అప్పగించకూడదని మాజీలు వాదిస్తున్నారు. అయితే భారత్ తర్వాతి టెస్టును వచ్చే జూన్‌లో ఇంగ్లాండ్‌తో ఆడుతుంది. ఆలోగా కెప్టెన్సీపై బీసీసీఐ కసరత్తు పూర్తి చేసుకోనుంది.  

Also Read: Rohit In Ranji Trophy: పని చేసిన గంభీర్ హెచ్చరికలు - రంజీల్లో బరిలోకి రోహిత్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
Sabarimala Makara Jyothi 2025: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
Sankranthiki Vasthunam Twitter Review - 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి - మేజిస్ట్రేట్ ముందు హాజరు, కేటీఆర్, హరీశ్‌రావు హౌస్ అరెస్ట్
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి - మేజిస్ట్రేట్ ముందు హాజరు, కేటీఆర్, హరీశ్‌రావు హౌస్ అరెస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP DesamDanthapuri Fort | బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం..అశోకుడు నడయాడిన ప్రదేశం | ABP DesamNara Devansh Sack Run | నారావారిపల్లెలో గోనెసంచి పరుగుపందెంలో దేవాన్ష్ | ABP DesamNara Devansh Lost Lokesh No Cheating | మ్యూజికల్ ఛైర్ లో ఓడిన దేవాన్ష్, ఆర్యవీర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Padi Kaushik Reddy: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఊరట - బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి
Sabarimala Makara Jyothi 2025: శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
శబరిమల మకరజ్యోతి కనిపించే ప్రదేశం ఇదే .. ఆ జ్యోతి నిజమా కాదా .. దాని వెనుకున్న సైన్స్ గురించి తెలుసా!
Sankranthiki Vasthunam Twitter Review - 'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
'సంక్రాంతికి వస్తున్నాం' ట్విట్టర్ రివ్యూ: ఎఫ్ 2 రేంజ్‌లో వెంకీ మార్క్ అనిల్ రావిపూడి సినిమా - జనాలు ఏమంటున్నారంటే?
MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి - మేజిస్ట్రేట్ ముందు హాజరు, కేటీఆర్, హరీశ్‌రావు హౌస్ అరెస్ట్
ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి వైద్య పరీక్షలు పూర్తి - మేజిస్ట్రేట్ ముందు హాజరు, కేటీఆర్, హరీశ్‌రావు హౌస్ అరెస్ట్
Viral News: కోడలు కావాల్సిన అమ్మాయితో తండ్రి ప్రేమ వివాహం - పెళ్లి దుస్తుల్లో కొత్త జంటను చూసిన కొడుకు ఏం చేశాడంటే?
కోడలు కావాల్సిన అమ్మాయితో తండ్రి ప్రేమ వివాహం - పెళ్లి దుస్తుల్లో కొత్త జంటను చూసిన కొడుకు ఏం చేశాడంటే?
Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై బిగ్ అప్ డేట్ - మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
Tirumala News: తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
తిరుమల పరకామణిలో చోరీ - వెలుగులోకి సంచలన విషయాలు, బంగారం బిస్కెట్ మాత్రమే కాదు
Crime News: కన్న కూతురికే లైంగిక వేధింపులు - ఇద్దరు భార్యల ముద్దుల భర్త, చివరకు వారి చేతుల్లోనే..
కన్న కూతురికే లైంగిక వేధింపులు - ఇద్దరు భార్యల ముద్దుల భర్త, చివరకు వారి చేతుల్లోనే..
Embed widget