అన్వేషించండి

NZ vs SA: తొలి టెస్ట్‌ న్యూజిలాండ్‌దే, దక్షిణాఫ్రికా చిత్తు

New Zealand vs South Africa: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ ఘన విజయం సాధించింది. కివీస్‌ జట్టు ముందు ప్రొటీస్‌ యువ జట్టు తేలిపోయింది.

New Zealand vs South Africa: దక్షిణాఫ్రికా(South Africa)తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్‌ (New Zealand)ఘన విజయం సాధించింది.
కివీస్‌ జట్టు ముందు ప్రొటీస్‌ యువ జట్టు తేలిపోయింది. తొలి టెస్టులో 281 పరుగుల తేడాతో సఫారీ జట్టును న్యూజిలాండ్‌ చిత్తుగా ఓడించింది. నాలుగు రోజుల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. 529 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 247 పరుగులకే ఆలౌటైంది. కైల్‌ జేమిసన్‌ నాలుగు, మిచెల్‌ శాంట్నర్‌ 3 వికెట్లతో సఫారీ యువ జట్టు పతనాన్ని శాసించారు. సౌతాఫ్రికా జట్టులో డేవిడ్‌ బెడింగ్‌హమ్‌ (87), రువాన్‌ డి స్వార్ట్‌ (34), రేనార్డ్‌ వాన్‌ టోండర్‌ (31), జుబేర్‌ హంజా (36) పోరాడారు. కానీ ఆ పోరాటం కివీస్‌ విజయ అంతరాన్ని మాత్రమే తగ్గించింది. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 179 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 511 పరుగులు చేయగా.. దక్షిణాఫ్రికా 162 పరుగులకే ఆలౌటైంది. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా తరపున ఆరుగురు ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన రచిన్‌ రవీంద్ర ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఎంపికయ్యాడు. 

రెండు ఇన్నింగ్సుల్లోనూ శతకాలు
గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన న్యూజిలాండ్‌(New Zealand) సీనియర్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌(Kane Williamson) వరుస శతకాలతో చెలరేగిపోయాడు. భీకర ఫామ్‌లో ఉన్న కేన్‌ మామ.. వరుసగా రెండు సెంచరీలు చేసి పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. స్వదేశంలో ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లోనూ విలియమ్సన్‌ శతక మోత మోగించాడు. బే ఓవ‌ల్‌లో జ‌రుగుతున్న మొద‌టి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో.. కేన్‌ విలియమ్సన్‌ శ‌త‌కంతో గ‌ర్జించాడు. క్లాస్ ఇన్నింగ్స్‌తో అల‌రించిన కేన్ మామ 30వ సెంచ‌రీతో కొత్త రికార్డు సృష్టించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ చేసి సుదీర్ఘ ఫార్మాట్‌లో 31 శతకాన్ని తన పేరిట లిఖించుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ 132 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్లతో 109 ర‌న్స్ బాదాడు. త‌ద్వారా ఈ స్టార్ ఆట‌గాడు సుదీర్ఘ ఫార్మాట్‌లో 31వ సెంచ‌రీ న‌మోదు చేశాడు.

రికార్డుల మోత
ఇప్పటికే భారత స్టార్‌ విరాట్‌ కోహ్లీ(Virat Kohli), క్రికెట్‌ లెజెండ్‌, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు డాన్‌ బ్రాడ్‌మన్‌ పేరిట ఉన్న 29 సెంచరీల రికార్డును అధిగమించిన కేన్‌ మామ.. ఇప్పుడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్(Joe Root) రికార్డును బ్రేక్ చేశాడు. 30 సెంచరీల జో రూట్‌ రికార్డును విలియమ్సన్‌ బద్దలు కొట్టాడు. మ‌రొక‌ సెంచ‌రీ కొడితే ఈ కివీస్ మాజీ సార‌థి ..ఆస్ట్రేలియా ర‌న్ మెషిన్ స్టీవ్ స్మిత్‌ స‌ర‌స‌న నిలుస్తాడు. ప్రస్తుతం స్మిత్ 32 శ‌త‌కాల‌తో టాప్‌లో కొన‌సాగుతున్నాడు. టెస్టుల్లో అత్యధిక సార్లు మూడంకెల స్కోర్ సాధించిన రెండో ఆట‌గాడిగా కేన్‌ నిలిచాడు.

మ్యాచ్‌ ముగిసిందిలా...
ఈ మ్యాచ్‌లో ర‌చిన్ ర‌వీంద్ర(240) డ‌బుల్ సెంచ‌రీతో విజృంభించ‌గా.. విలియ‌మ్సన్‌(118) సెంచ‌రీతో జ‌ట్టుకు కొండంత స్కోర్ అందించాడు. అనంతరం స‌ఫారీల‌ను 162 ప‌రుగుల‌కే చుట్టేసిన కివీస్.. రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడుతోంది. విలియ‌మ్సన్ సెంచ‌రీతో న్యూజిలాండ్ ఆధిక్యం 500 పరుగులు దాటింది. మూడో రోజు ఆట ముగిసే స‌రికి న్యూజిలాండ్ 4 వికెట్ల న‌ష్టానికి 179 ర‌న్స్‌తో ఉన్న కివీస్‌ అదే స్కోరు వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.  529 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన దక్షిణాఫ్రికా 247 పరుగులకే ఆలౌటైంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Tanikella Bharani: నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs CSK Match Highlights IPL 2025 | చెన్నై పై 6 పరుగుల తేడాతో రాజస్థాన్ విజయం | ABP DesamDC vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఢిల్లీ క్యాపిటల్స్ గ్రాండ్ విక్టరీ | ABP DesamRR vs CSK Match Preview IPL 2025 | నేడు గువహాటిలో చెన్నసూపర్ కింగ్స్ తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ | ABP DesamDC vs SRH Match Preview IPL 2025 | ఏ టీమ్ తెలుగు వాళ్లది..ఆటతో తేల్చేస్తారా | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Mann Ki Baatలో ఆదిలాబాద్ ఆదివాసీల గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ, ఇంతకీ ఏం మాట్లాడారు..?
Andhra Pradesh News: ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
ఏపీలో మిషన్ పీ4 ప్రారంభం, గేమ్ ఛేంజర్ అవుతుందని సీఎం చంద్రబాబు ధీమా
Tanikella Bharani: నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
నూతన నటీనటులకు తనికెళ్ల భరణి సినిమా ఛాన్స్ - ఇంట్రెస్ట్ ఉంటే ఇలా అప్లై చేసుకోండి!
Pastor Praveen Pagadala Video: ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
ప్రవీణ్‌ పగడాల మృతి కేసులో ట్విస్ట్, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పాస్టర్‌ వీడియో..!
Vizag Trains: ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు, ప్రకటించిన వాల్తేరు డివిజన్
ఏప్రిల్ నెలలో వైజాగ్ రైళ్లకు అదనపు కోచ్ లు, ప్రకటించిన వాల్తేరు డివిజన్
IPL 2025 SRH VS DC Result Update: స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
స‌న్ రైజ‌ర్స్ కు రెండో ఓట‌మి.. అన్ని విభాగాల్లో ఆకట్టుకున్న ఢిల్లీ, టాప్-2కి చేరిక‌ రాణించిన డుప్లెసిస్, స్టార్క్
Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Peddi Movie Glimpse: రామ్ చరణ్ 'పెద్ది' నుంచి మరో అప్ డేట్ - గ్లింప్స్ వచ్చేది ఎప్పుడో తెలుసా?
రామ్ చరణ్ 'పెద్ది' నుంచి మరో అప్ డేట్ - గ్లింప్స్ వచ్చేది ఎప్పుడో తెలుసా?
Embed widget