By: ABP Desam | Updated at : 15 Dec 2022 09:43 AM (IST)
టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కేన్ విలియమ్సన్
Kane Williamson Steps Down from Test Captainship:టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న కేన్ విలియమ్సన్. సంచలన ప్రకటన చేశాడు. కేన్ స్థానంలో బౌలర్ టిమ్ సౌథీ న్యూజిలాండ్ టెస్టు జట్టుకు బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే కేన్ వన్డే, టీ20 ఫార్మాట్లలో న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.
టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి ఇదే సరైన సమయం అని కేన్ విలియమ్సన్ అన్నాడు. టెస్టు జట్టుకు కెప్టెన్‌గా ఉండటం నాకు దక్కిన గౌరవం. నా కెప్టెన్సీలో టెస్ట్ క్రికెట్ పట్టికలో న్యూజిలాండ్ అగ్రస్థానంలో ఉంది. కెప్టెన్ గా నేను సవాళ్లు ఆస్వాదించాను. కెప్టెన్‌గా పని, పనిభారం ఎక్కువగా ఉంటాయి. టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగాల్సిన సమయం ఆసన్నమైందని భావించాను' అని అన్నాడు.
కేన్ కెప్టెన్సీలో కివీస్ జట్టు భారత్‌ను ఓడించి తొలి టెస్టు ఛాంపియన్షిప్ టైటిల్ గెలుచుకుంది. అతని కెప్టెన్సీలో మిగతా రికార్డును పరిశీలిస్తే కేన్ న్యూజిలాండ్ తరఫున 38 టెస్ట్ మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. ఇందులో 22 సార్లు టీంను గెలిపించాడు. 8 మ్యాచ్ లు డ్రాగా ముగించాడు.
కేన్ విలియమ్సన్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ టెస్టు కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పాకిస్తాన్ పర్యటనలో అతను టెస్ట్ సిరీస్‌కు కెప్టెన్‌గా కనిపించనున్నాడు. టామ్ లాథమ్ జట్టు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. న్యూజిలాండ్ జట్టుకు 31వ టెస్టు కెప్టెన్‌గా టిమ్ సౌథీ నిలిచాడు. ఇంతకు ముందు సౌథీ టీ20ల్లో జట్టుకు నాయకత్వం వహించాడు.
• ఆడిన టెస్టు మ్యాచ్‌లు- 40
• గెలిచినవి- 22
• ఓడనవి - 10
• డ్రాగా ముగిసినవి - 8
• గెలుపు శాతం - 55%
• చేసిన పరుగులు- 3331
• సగటు - 57.43
• 100s/50s - 11/14
• ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ కైవసం
ఫ్యాబ్4 నిష్క్రమణ
ఈ ఏడాదిలో టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న క్రికెటర్లు వీళ్లే. విరాట్ కోహ్లీ జనవరిలో టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఏప్రిల్‌లో ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు విలియమ్సన్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.
Squad News | The first Test against @TheRealPCB starts in Karachi on Boxing Day.
— BLACKCAPS (@BLACKCAPS) December 14, 2022
More | https://t.co/cZdpKGOgNJ #PAKvNZ pic.twitter.com/urDBlmAURT
Finally all members of the fab 4 have given up captaincy duties.
— Delhi Capitals Fan (@pantiyerfc) December 15, 2022
Their rankings according to me:
1.Kane Williamson
2.Virat Kohli
3.Steve Smith
4.Joe Root
Ok Calm down Virat fans😅,Kane has the highest winning percentage among these plus he has the World test championship trophy. pic.twitter.com/r0gmIsjZ8d
Shaheen Afridi Marriage: షాహిద్ అఫ్రిది కుమార్తెను వివాహమాడిన పాక్ యువ బౌలర్ షహీన్
IND Vs AUS: మొదటి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు ఎదురు దెబ్బ - గాయంతో కీలక ఆటగాడు దూరం!
IND vs NZ: ఆ రికార్డు సృష్టించిన మొదటి భారత ఆల్‌రౌండర్ హార్దికే - ఏంటో తెలుసా?
Ashwin On Steve Smith: మీ స్లెడ్జింగ్, మైండ్‌గేమ్స్ మాకు తెలుసులే! ఆసీస్‌కు యాష్ పవర్ఫుల్ పంచ్!
IND vs AUS: విశాఖలో మ్యాచ్ ఉందని గుర్తుందా! బోర్డర్-గావస్కర్ ట్రోఫీ షెడ్యూలు, టైమింగ్స్, వేదికలు ఇవే!
Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!
Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?