అన్వేషించండి
Advertisement
Nathan Lyon: 500 వికెట్ల క్లబ్‌లో లియన్, ఇప్పటివరకూ ఎనిమిది మందికే సాధ్యం
Nathan Lyon: ఆస్ట్రేలియా టాప్ స్పిన్నర్ నాథన్ లియన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు.
ఆస్ట్రేలియా టాప్ స్పిన్నర్ నాథన్ లియన్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్టులో లియన్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదు వికెట్లు తీసిన లియాన్.. 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. లియాన్ ఆస్ట్రేలియా తరఫున టెస్టులలో 500 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా, రెండో స్పిన్నర్‌గా ఖ్యాతినార్జించాడు. లియాన్ కంటే ముందు దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్‌లు ఈ ఘనత సాధించారు. సుదీర్ఘ ఫార్మాట్‌లో లియోన్ సహా కేవలం ఎనిమిది మంది మాత్రమే ఈ ఘనతను సాధించారు. అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో 500, అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించినవారిలో లియాన్ 8 వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో లంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీథరన్ (133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు) అగ్రస్థానంలో ఉండగా.. షేన్ వార్న్ (708), జేమ్స్ ఆండర్సన్ (690), అనిల్ కుంబ్లే (619), స్టువర్ట్ బ్రాడ్ (604), గ్లెన్ మెక్‌గ్రాత్ (563), కోట్నీ వాల్ష్ (519) లియోన్ కంటే ముందు 500 వికెట్ల క్లబ్‌లో చేరిన వారిలో ఉన్నారు.
2011లో శ్రీలంకతో గాలె వేదికగా జరిగిన టెస్టులో అరంగేట్రం చేసిన లియాన్.. ఈ ఫార్మాట్‌లో ఆసీస్‌కు ప్రధాన స్పిన్నర్ అయ్యాడు. టెస్టులలో 23 సార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన లియాన్.. నాలుగు సార్లు 10 వికెట్లు తీసిన రికార్డు అందుకున్నాడు. టెస్టులలో అతడి అత్యుత్తమ ప్రదర్శన 8/50గా ఉంది.
టెస్టులలో టాప్10 వికెట్ టేకర్స్
ముత్తయ్య మురళీధరన్ - 800 వికెట్లు
షేన్ వార్న్-708-వికెట్లు
జేమ్స్ అండర్సన్ -690 వికెట్లు
అనిల్ కుంబ్లే -619-వికెట్లు
స్టువర్ట్ బ్రాడ్ -604-వికెట్లు
గ్లెన్ మెక్‌గ్రాత్ (563)
కోట్నీ వాల్ష్ -519-వికెట్లు
నాథన్ లియాన్ -501-వికెట్లు
రవిచంద్రన్ అశ్విన్ -489-వికెట్లు
డేల్ స్టెయిన్ -439-వికెట్లు
ఆస్ట్రేలియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్ల
షేన్ వార్న్ (133 టెస్టులలో 708 వికెట్లు)
గ్లెన్ మెక్‌గ్రాత్ (124 టెస్టులలో 563)
నాథన్ లియాన్ (123 టెస్టులలో 501)
డెన్నిస్ లిల్లీ (70 టెస్టులలో 355)
ఇక ఆస్ట్రేలియా పర్యటనను పాకిస్థాన్ ఘోర పరాజయంతో ప్రారంభించింది. మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 360 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. నాలుగు రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌ను 5 వికెట్ల నష్టానికి 233 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన ఆసీస్.. పాకిస్తాన్ ఎదుట 449 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. 450 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్ 89 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆసీస్ 1-0 ఆధిక్యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 487 పరుగులకు ఆలౌట్ కాగా.. పాక్ కేవలం 271 పరుగులకే పరిమితమైంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా.. 5 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసి డిక్లేర్ చేసి 450 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధి ముందు ఉంచింది. భారీ లక్ష్య ఛేదనకు దిగిన పాక్.. ఆసీస్ బౌలర్లు మూకుమ్మడిగా అటాక్ చేయడంతో 89 పరుగులకే కుప్పకూలి భారీ తేడాతో ఓటమిపాలైంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion