Murali Vijay Retirement: అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించిన భారత సీనియర్ బ్యాటర్
Murali Vijay Retirement: టీమిండియా సీనియర్ బ్యాటర్ మురళీ విజయ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. తన రిటైర్ మెంట్ లేఖను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
Murali Vijay Retirement: టీమిండియా సీనియర్ బ్యాటర్ మురళీ విజయ్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించాడు. తన రిటైర్ మెంట్ లేఖను ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తన క్రికెట్ ప్రయాణంలో సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
2008లో భారత తరఫున అరంగేట్రం చేసిన మురళీ విజయ్ 2018లో తన చివరి మ్యాచ్ ను ఆడాడు. ఈ మధ్యకాలంలో టెస్టుల్లో మురళీ విజయం కీలక ప్లేయర్ గా ఎదిగాడు. ఓపెనర్ గా ఆడిన విజయ్ టెస్టుల్లో దాదాపు 4వేల పరుగులు సాధించాడు. అందులో 12 సెంచరీలు, 15 అర్ధసెంచరీలు ఉన్నాయి. 38 ఏళ్ల విజయ్ రిటైర్ మెంట్ తర్వాత ప్రపంచ క్రికెట్ పై దృష్టిపెట్టనున్నట్లు తెలిపాడు.
విదేశాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఓపెనర్
మురళీ విజయ్ భారత్ తరఫున మొత్తం 61 టెస్టులు, 17 వన్డే మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 3982 పరుగులు, వన్డేల్లో 339 పరుగులు సాధించాడు. ఓవర్సీస్ లో భారత్ కు మురళీ విజయ్ ఉత్తమ ఓపెనర్లలో ఒకడిగా నిలిచాడు. విదేశాల్లో మురళీకి మంచి రికార్డు ఉంది. ఆస్ట్రేలియాపై బ్రిస్బేన్ వేదికగా చేసిన 144 పరుగులు, ఇంగ్లండ్ పై ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా చేసిన 145 పరుగులు విజయ్ టెస్ట్ కెరీర్ లో బెస్ట్ గా నిలిచాయి.
Most test centuries as an opener of India.#MuraliVijay #cricketlovers #cricketfans #cricketer #testcricket #Cricketnews #news #NewsUpdates #virendersehwag #GautamGambhir #TeamIndia #IndianCricketTeam pic.twitter.com/mr8SVehQjY
— CricInformer (@CricInformer) January 30, 2023
బీసీసీఐపై వ్యాఖ్యలు
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్, మయాంక్ అగర్వాల్ లాంటి వాళ్లు ఓపెనర్లుగా నిలదొక్కుకోవటంతో బీసీసీఐ 2018 నుంచి మురళీ విజయ్ ను జట్టులోకి తీసుకోవడం లేదు. ఇటీవలే బీసీసీఐ 40 ఏళ్లు వచ్చినవారిని వృద్ధులుగా చూస్తోందంటూ మురళీ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. ఇప్పుడిక విదేశీ లీగుల్లో ఆడేందుకు సిద్ధమైనట్లు మురళీ విజయ్ తెలిపాడు.
@BCCI @TNCACricket @IPL @ChennaiIPL pic.twitter.com/ri8CCPzzWK
— Murali Vijay (@mvj888) January 30, 2023
144 at Brisbane.
— Johns. (@CricCrazyJohns) January 30, 2023
145 at Trent Bridge.
95 at Lord's.
99 at Adelaide.
97 at Kingsmead.
One of the best openers in overseas for India in Tests - Thank you, Murali Vijay. pic.twitter.com/EWbtlXq7ID