By: ABP Desam | Updated at : 27 Mar 2023 01:05 PM (IST)
WPL 2023 Winner Mumbai Indians ( Image Source : WPL Twitter )
WPL 2023 Prize Money: ప్రపంచంలో అత్యంత ధనవంతమైన క్రికెట్ బోర్డుగా ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మరోసారి తన ‘ధనబలం’ను ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ ఏడాది బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్‌కు రూ. 6 కోట్ల ప్రైజ్ మనీని అందించింది. ఐపీఎల్ కంటే మేమే తోపులం అని అవాకులు చెవాకులు పోతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) లో విజేతలకు ఇచ్చే ప్రైజ్ మనీ (రూ. 3.4 కోట్లు) కంటే ఇది దాదాపు రెట్టింపు. డబ్ల్యూపీఎల్ లో రన్నరప్ గా నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజేతల్లో సగం (రూ. 3 కోట్లు) ప్రైజ్ మనీ దక్కింది.
ఆదివారం ముంబైలోని బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ - ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని ముంబై జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఢిల్లీ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో ముంబై.. 19.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
డబ్ల్యూపీఎల్ - 2023 గణాంకాలు :
- అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్) : మెగ్ లానింగ్ (ఢిల్లీ - 345 పరుగులు)
- అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్) : హేలీ మాథ్యూస్ (ముంబై - 16 వికెట్లు)
- అత్యధిక వ్యక్తిగత స్కోరు : సోఫీ డివైన్ (ఆర్సీబీ - 99)
- అత్యధిక సిక్సర్లు : షెఫాలీ వర్మ (ఢిల్లీ - 13)
- బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ : మరియనె కాప్ (ఢిల్లీ) - 5/15 (గుజరాత్ పై)
- ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఈయర్ : యస్తికా భాటియా (ముంబై)
- ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ గెలిచిన ఆటగాళ్లకు తలా రూ. 5 లక్షల క్యాష్ ప్రైజ్. క్యాచ్ ఆఫ్ ది సీజన్ పట్టిన హర్లీన్ డియోల్ కు రూ. 5 లక్షలు దక్కాయి.
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలోని ఉమెన్స్ క్రికెట్ లీగ్‌లతో పాటు చాలా దేశాల్లో జరుగుతున్న మెన్స్ ఫ్రాంచైజీ లీగ్ ల కంటే డబ్ల్యూపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు దక్కిన క్యాష్ ప్రైజే ఎక్కువ. ఈ జాబితాలో ఐపీఎల్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. గతేడాది ఐపీఎల్ విజేతగా గెలిచిన గుజరాత్ టైటాన్స్ కు రూ. 20 కోట్ల క్యాష్ ప్రైజ్ అందగా రన్నరప్ రాజస్తాన్ రాయల్స్ కు రూ. 13 కోట్లు దక్కాయి.
1. ఐపీఎల్ - రూ. 20 కోట్లు
2. ఎస్ఎ20 లీగ్ - రూ. 15 కోట్లు
3. కరేబియన్ ప్రీమియర్ లీగ్ - రూ. 8 కోట్లు
4. డబ్ల్యూపీఎల్ - రూ. 6 కోట్లు
5. ఐఎల్ టీ20 - రూ. 5.7 కోట్లు
6. పీఎస్ఎల్ - రూ. 3.4 కోట్లు
7. బిగ్ బాష్ లీగ్ - రూ. 2.7 కోట్లు
8. ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ - రూ. 2.7 కోట్లు
9. బంగ్లా ప్రీమియర్ లీగ్ - రూ. 1.53 కోట్లు
10. ఉమెన్స్ హండ్రెడ్ (ఇంగ్లాండ్) - రూ. 1.5 కోట్లు
11. మెన్స్ హండ్రడె్ - రూ. 1.5 కోట్లు
12. లంక ప్రీమియర్ లీగ్ - రూ. 82 లక్షలు
(పై గణాంకాలు 2022, 2023 లలో జరిగిన లీగ్ లకు సంబంధించినవి)
CSK Vs GT, Final: చెన్నై కప్‌ను వదిలేసిందా - ఎంత పని చేశావు చాహర్!
CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?
CSK Vs GT: ఫైనల్లో టాస్ చెన్నైదే - ఛేజింగ్‌కే మొగ్గు చూపిన ధోని!
IPL Record: ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక నోబాల్స్ ఈ సీజన్‌లోనే - ఎన్ని వేశారంటే?
World Test Championship: 'WTC ఫైనల్' జట్లను ఫైనల్ చేసిన టీమ్‌ఇండియా, ఆసీస్!
CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !
Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !
SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!
Partner Swapping Case: భార్యల మార్పిడి కేసులో సంచలనం, విషం తాగిన నిందితుడు - మృతి