అన్వేషించండి
Advertisement
Mohammed Siraj: బజ్‌బాల్ అంటే మూడు రోజుల్లోనే ముగిస్తాం, ఇంగ్లండ్‌కు సిరాజ్ హెచ్చరిక
Mohammed Siraj: మొదటి టెస్టుకు ముందు ఇంగ్లండ్ బజ్‌బాల్ క్రికెట్‌ను ఉద్దేశించి భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
సొంత గడ్డపై టెస్టు సిరీసుల్లో 12 ఏళ్లుగా ఓటమి ఎరుగని భారత్ జట్టు సిసలైన సమరానికి సిద్ధమైంది. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్(Ind v Eng) మధ్య మరికాసేపట్లో హైదరాబాద్(Hyderabad) వేదికగా మ్యాచ్ మొదలయ్యింది. బజ్‌బాల్ ఆటతో సుదీర్ఘ ఫార్మాట్‌లో వేగాన్ని పెంచిన ఇంగ్లాండ్...దశాబ్దకాలానికిపైగా సొంతగడ్డపై తిరుగులేని టీమిండియాకు సవాలు విసరనుంది. తొలి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి. విజయంతో సిరీస్‌లో శుభారంభం చేయాలని ఇరుజట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. సొంతగడ్డపై భారత్ టెస్టు సిరీస్ ఓడి దాదాపు 11 ఏళ్లు గడిచిపోయాయి. చివరగా 2012లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-2తో భారత్ కోల్పోయింది. అప్పటి నుంచి సొంతగడ్డపై భారత్ మరో టెస్టు సిరీస్ ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టుకు టీమిండియా పేసర్ సిరాజ్(Mohammed Siraj) హెచ్చరికలు జారీ చేశాడు.
సిరాజ్ కీలక వ్యాఖ్యలు
మొదటి టెస్టుకు ముందు ఇంగ్లండ్ బజ్‌బాల్ క్రికెట్‌ను ఉద్దేశించి భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్ వంటి ఉపఖండ పరిస్థితులలో బాజ్‌బాల్ విధానాన్ని ఎంచుకుంటే ఇంగ్లీష్ జట్టుకు కష్టాలు తప్పవని సిరాజ్ హెచ్చరించాడు. ఒక వేళ ఇంగ్లండ్ భారత పరిస్థితుల్లో బజ్‌బాల్ ఆడేందుకు ప్రయత్నిస్తే మ్యాచ్ ఒకటిన్నర రోజు లేదా రెండు రోజుల్లోనే ముగుస్తుందని తెలిపాడు. ఉపఖండంలో ఉన్న పిచ్‌లపై ప్రతి బంతిని బాదడం కుదరదని... బంతి కొన్నిసార్లు ఎక్కువగా టర్న్ అవుతుందని. మరి కొన్ని సార్లు స్ట్రైట్‌గా వస్తోందన్నాడు. ఇంగ్లండ్ బజ్ బాల్ ఆడితే తమకే మంచదని.. మ్యాచ్ త్వరగా ముగుస్తుందని సిరాజ్ పేర్కొన్నాడు.
బజ్‌బాల్ పనిచేస్తుందా..?
మరోవైపు ప్రత్యర్థి ఎవరైనా....... వేదిక ఎక్కడైనా దూకుడైన బజ్‌బాల్ ఆటతీరుతో సాగిపోతున్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని....... పట్టుదలగా ఉంది. బెయిర్‌స్టో, క్రాలీ, డకెట్, ఫోక్స్, లారెన్స్, పోప్, రూట్, స్టోక్స్‌తో........బలమైన బ్యాటింగ్ లైనప్ ఇంగండ్ సొంతం. జాక్ లీచ్ మినహా టామ్ హార్ట్‌లీ, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్‌లతో కూడిన అనుభవలేమి స్పిన్ విభాగం ఏమేరకు రాణిస్తుందో చూడాలి. అండర్సన్, అట్కిన్సన్, రాబిన్సన్, మార్క్ వుడ్‌లతో ఇంగ్లాండ్ పేస్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది
కోహ్లీ లేకుండానే...
టెస్టుల్లో ఉప్పల్ వేదికలో దాదాపు 75 పైగా సగటు ఉన్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లేకుండా టీమిండియా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతోంది. వ్యక్తిగత కారణాలతో తొలి రెండు టెస్టులకు అందుబాటులోని లేని కోహ్లీ స్థానంలోయువ ఆటగాడు రజిత్ పాటిదార్ జట్టులోకి వచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మతో యువ ఆటగాడు యశ్వసి జైస్వాల్ ఓపెనింగ్ చేయనున్నాడు. గిల్ మూడో స్థానంలో రానున్నాడు. శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ మిడిల్‌ఆర్డర్‌లో బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. వికెట్ కీపర్‌గా ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఆల్‌రౌండర్ జడేజా, అశ్విన్‌లు తుది జట్టులో ఉంటే అక్షర్ లేదా కుల్‌దీప్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితం కానున్నారు. బుమ్రా, సిరాజ్ పేస్ భారాన్ని మోయనున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తిరుపతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion