అన్వేషించండి

Mohammed Siraj: సిరాజ్ కేక - మళ్లీ నెంబర్ వన్ బౌలర్‌గా మియా

హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్ మళ్లీ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

Mohammed Siraj: టీమిండియా పేసర్, హైదరాబాద్ కుర్రాడు మహ్మద్ సిరాజ్  మరోసారి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటాడు. ఆసియా కప్‌కు ముందు   ఐసీసీ వన్డే  బౌలర్ల ర్యాంకింగ్స్ ‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న మియా (సిరాజ్ ముద్దుపేరు)  ఏకంగా 8 స్థానాలు ఎగబాకాడు. ఆసియా కప్ ఫైనల్స్ ‌లో శ్రీలంకపై  ఆరు వికెట్లు పడగొట్టిన సిరాజ్.. మరోసారి అగ్రస్థానానికి చేరుకున్నాడు.   

వన్డేలలో ఏడాదిన్నర కాలంగా నిలకడగా రాణిస్తున్న సిరాజ్.. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంక,  న్యూజిలాండ్‌లతో వన్డే సిరీస్‌లు ముగిశాక  నెంబర్ వన్ ర్యాంకు సొంతం చేసుకున్నాడు.  అయితే ఆ తర్వాత అతడు వెస్టిండీస్  సిరీస్‌లో ఆడలేదు. మిగతా బౌలర్లు కూడా నిలకడగా రాణించడంతో సిరాజ్.. ర్యాంకింగ్స్‌లో  కిందికి పడిపోయాడు.  ఆసియా కప్‌ మొదలునాటికి కూడా  అతడు 9వ స్థానంతోనే ఉన్నాడు. కానీ ఈ టోర్నీలో తొలుత  ఆకట్టుకోలేకపోయినా ఫైనల్‌లో  శ్రీలంకపై మాత్రం  చెలరేగిపోయాడు.  

ఆసియా కప్ ఫైనల్‌లో ఏడు ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు ఒక మెయిడిన్ వేసి 21 పరుగులే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతడి వన్డే ర్యాంకింగ్ అమాంతం పెరిగింది. తాజా ప్రదర్శనతో సిరాజ్.. 694 పాయింట్లతో  నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు. నిన్నటిదాకా నెంబర్ వన్ హోదాను అనుభవించిన జోష్ హెజిల్‌‌వుడ్ (678 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయాడు. ట్రెంట్ బౌల్ట్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్,మిచెల్ స్టార్క్ , మాథ్యూ హెన్రీ, ఆడమ్ జంపా వరుసగా 8 స్థానాలను ఆక్రమించగా  కుల్దీప్ యాదవ్ 9, షహీన్ అఫ్రిది 10వ స్థానాలనలో ఉన్నాడు. 

భారత్  ఆధిపత్యం.. 

ఐసీసీ తాజా ర్యాంకులలో భారత్ మూడు ఫార్మాట్లలో జట్టుగానే కాకుండా వ్యక్తిగతంగా ఆటగాళ్ల ర్యాంకులతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.  జట్టు, వ్యక్తిగత  ర్యాంకులలో టాప్ - 3లో వివరాలు.. 

- టెస్టులలో నెంబర్ వన్ జట్టు 
- టీ20లలో నెంబర్ వన్ జట్టు 
- వన్డేలలో  రెండో స్థానం 
- టీ20లలో నెంబర్ వన్ బ్యాటర్ : సూర్యకుమార్ యాదవ్ 
- వన్డేలలో నెంబర్ వన్ బౌలర్ : మహ్మద్ సిరాజ్ 
- టెస్టులలో నెంబర్ వన్ ఆల్ రౌండర్ : రవీంద్ర జడేజా 
- టెస్టులలో నెంబర్ వన్ బౌలర్ : అశ్విన్ 
- టెస్టులలో నెంబర్ టూ ఆల్ రౌండర్ : జడేజా 
- టెస్టులలో నెంబర్  త్రీ బౌలర్ : జడేజా 
- వన్డేలలో నెంబర్ 2 బ్యాటర్ : శుభ్‌మన్ గిల్ 
- టీ20లలో నెంబర్ వన్ ఆల్ రౌండర్ : హార్ధిక్ పాండ్యా 

అంతేగాక వన్డే వరల్డ్ కప్ ప్రారంభమయ్యేనాటికి  ఆస్ట్రేలియాతో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్న భారత్ ఈ సిరీస్‌లో క్లీన్ స్వీప్ చేసినా ఆస్ట్రేలియాను 2-1 తేడాతో  ఓడిస్తే  టీమిండియా 50 ఓవర్ల ఫార్మట్‌లో కూడా నెంబర్ వన్ టీమ్ అవనుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget