Meg Lanning: క్రికెట్ లెజెండ్ గుడ్‌పై , ఆస్ట్రేలియా సారథి ఆకస్మిక నిర్ణయం
Australia Women Cricket Team: మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియాను తిరుగులేని శక్తిగా నిలిపిన..కెప్టెన్ మేగ్ లానింగ్ ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది.
Meg Lanning Retirement: మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియాను తిరుగులేని శక్తిగా నిలిపిన..కెప్టెన్ మేగ్ లానింగ్(Meg Lanning ) సంచలన నిర్ణయం తీసుకుంది. అభిమానులకు, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(Cricket Australia)కు షాక్ ఇస్తూ ఆమె ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఈ ఏడాది గాయం కారణంగా పలు సిరీస్‌లకు దూరమైన ఆమె ఒక్కసారిగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఆశ్చర్యానికి గురి చేశారు. కామన్‌వెల్త్ గేమ్స్ తర్వాత లానింగ్ పలు సిరీస్‌లకు దూరమైంది. ఆ తర్వాత ఇంగ్లండ్, ఐర్లాండ్ సిరీస్‌లతో పాటు స్వదేశంలో వెస్టిండీస్ జరిగిన సిరీస్‌లో ఆడలేదు. ఆస్ట్రేలియా గెలిచిన అయిదు వన్డే ప్రపంచకప్‌లు, రెండు టీ 20 ప్రపంచకప్‌లో లానింగ్ సభ్యురాలు. ఛాంపియన్‌షిప్‌లో సాధించిన జట్టులో సభ్యురాలైన....వన్డేల్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్‌గా లానింగ్ రికార్డు సృష్టించారు. వన్డేల్లో 15 సెంచరీలు చేసిన లానింగ్.. టీ 20ల్లోనూ రెండు సెంచరీలు చేసి తాను ఎంత ప్రమాదకరమైన బ్యాటరో ప్రపంచానికి చాటి చెప్పింది.
13 ఏళ్ల సుధీర్ఘ కెరీర్‌లో లానింగ్ 241 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. 182 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించారు. లానింగ్ తన కెరీర్‌లో 132 టీ20లు, 103 వన్డేలు ఆడింది. ఆరు టెస్టు మ్యాచ్‌లకు సారథ్యం వహించింది. ఆమె కెప్టెన్సీలో కంగారు జట్టు 69 వన్డేల్లో, 100 టీ20ల్లో, 4 టెస్టుల్లో గెలుపొందింది. ఈ మూడు ఫార్మట్‌లలో 8,352 పరుగులు సాధించారు. గత ఏడాది లానింగ్ సారధ్యంలోని ఆస్ట్రేలియా రెండోసారి టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. లానింగ్ సారథ్యంలో ఆసీస్ ఏకంగా 4 సార్లు పొట్టి ప్రపంచకప్ విజేతగా నిలిచింది.
ఆట నుంచి తప్పుకునేందుకు ఇదే సరైన సమయమని రిటైర్‌మెంట్ ప్రకటనలో మెగ్ లానింగ్ తెలిపింది. క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనుకోవడం కష్టమైన నిర్ణయమే అని.. కానీ ఇదే సరైన సమయం అనిపించిందని లానింగ్ భావోద్వేగ ప్రకటన చేసింది. 13 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడం అదృష్టంగా భావిస్తున్నాన్న ఆమె.. తనకు ఇన్నేళ్లు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తనకు ఇష్టమైన ఆటలో ఉన్న శిఖరాలు అధిరోహించేందుకు ఎంతగానో సహకరించిన కుటుంబ సభ్యులు, జట్టు సభ్యులు,క్రికెట్ విక్టోరియా, క్రికెట్ ఆస్ట్రేలియా, ఆసీస్ క్రికెటర్లకు ధన్యవాదాలంటూ లానింగ్ వీడ్కోలు ప్రకటనలో పేర్కొన్నారు.
ప్రస్తుతం మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో లానింగ్ మెల్‌బోర్న్ స్టార్స్‌కు సారథ్యం వహిస్తోంది. రిటైర్‌మెంట్ తర్వాత కూడా మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో మెల్‌బోర్న్ స్టార్స్‌కు సారథిగా కొనసాగుతానని ప్రకటించింది. లానింగ్ మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సారథిగా వ్యవహరించింది. ఆమెను రూ.1.1 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. ఫ్రాంఛైజీ నమ్మకాన్ని నిలబెడుతూ.. అద్భుతంగా రాణించి జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లింది. అయితే.. టైటిల్ పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది.
2010 డిసెంబర్ 30న ఓవల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ 20 మ్యాచ్‌లో లానింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసింది. 2011 జనవరి 5న ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లోకి అడుగుపెట్టింది. ఆ సిరీస్‌లోనే తొలి వన్డే సెంచరీ నమోదు చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో 118 బంతుల్లో 103 పరుగులతో లానింగ్ అజేయంగా నిలవడంతో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 18 ఏళ్ల 288 రోజుల వయస్సులో సెంచరీ చేసిన ఆస్ట్రేలియా పిన్న వయస్కురాలిగా ఆమె ఖ్యాతి గడించింది. అంతకుముందు ఈ రికార్డు రికీ పాంటింగ్ పేరు మీద ఉండేది . పాంటింగ్ 21 సంవత్సరాల 21 రోజుల వయసులో సెంచరీ చేయగా దానిని లానింగ్ బద్దలు కొట్టింది.