By: ABP Desam | Updated at : 08 Sep 2023 11:57 AM (IST)
ధోని, డొనాల్డ్ ట్రంప్ ( Image Source : Twitter )
MS Dhoni: భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడు. మేలో ముగిసిన ఐపీఎల్-16 తర్వాత మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్న మహేంద్రుడు.. అమెరికా పర్యటనలో భాగంగా బెడ్‌మినిస్టర్‌లో ఉన్న ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో మాజీ యూఎస్ ప్రెసిడెంట్‌ను కలిశాడు. ట్రంప్ ఆహ్వానం మేరకే ధోని ఇక్కడికి వెళ్లినట్టు సమాచారం. ధోని - ట్రంప్ కలిసి గోల్ఫ్ ఆడుతున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తమిళ, తెలుగు భాషల్లో రూపొందించిన ‘ఎల్‌జీఎం’ (లెట్స్ గెట్ మ్యారీడ్) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో కనిపించిన ధోని ఆ తర్వాత తాజాగా మీడియాలో కనిపించడం ఇదే తొలిసారి. అమెరికా పర్యటనలో ఉన్న ధోని.. యూఎస్ ఓపెన్ పోటీలను కూడా వీక్షించాడు. గురువారం స్పెయిన్ సంచలనం కార్లోస్ అల్కరాజ్ - జర్మనీ ఆటగాడు అలగ్జాండర్ జ్వెరెవ్‌ల మ్యాచ్‌ను తిలకించిన ధోని ఆ తర్వాత ట్రంప్ తో కలిసి గోల్ఫ్ ఆడటం విశేషం.
Former US President Donald Trump hosted a Golf game for MS Dhoni.
— Johns. (@CricCrazyJohns) September 8, 2023
- Thala fever in USA....!!! pic.twitter.com/8V7Vz7nHMB
ధోనితో పాటు అమెరికా పర్యటనలో ఉన్న ఆయన మిత్రుడు సంగ్వీ తన ఇన్‌స్టా ఖాతాలో ధోని - ట్రంప్‌లు గోల్ఫ్ ఆడిన ఫోటోలు, వీడియోలను షేర్ చేశాడు. ధోని యూఎస్ ఓపెన్ మ్యాచ్‌ను కూడా సంగ్వీతో కలిసి చూశాడు. ఈ ఏడాది ఏప్రిల్ - మే లో జరిగిన ఐపీఎల్ - 16లో ధోని కాలికి గాయమైనా సీజన్ మొత్తం గాయంతోనే బరిలోకి దిగాడు. మే 29న మొదలై వర్షం కారణంగా మూడు రోజుల పాటు సాగిన ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించిన ధోని సేన.. చెన్నైకి ఐదో ఐపీఎల్ ట్రోఫీని అందించింది. ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసిన వెంటనే ధోని.. మోకాలి గాయానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఐపీఎల్ - 2024లో కూడా ఆడేందుకు ధోని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
The MS Dhoni cameo during the US Open Quarter Finals.pic.twitter.com/Dfys7nafpI
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2023
MS Dhoni and former US President Donald Trump in a Golf Game.
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 8, 2023
- MSD, an icon, a legend....!!!! pic.twitter.com/d9o1TfHmSX
I have heard the name of MS Dhoni a lot, I know he's very very famous here. 💥
— DHONIsm™ ❤️ (@DHONIism) September 7, 2023
- Sami Zayn (WWE Superstar)@MSDhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/FAG5GRVWhD
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Top 5 Wicket Keepers: 2023 ప్రపంచకప్‌లో డేంజరస్ వికెట్ కీపర్లు వీరే - టాప్-5 లిస్ట్‌లో ఎవరున్నారు?
ICC World Cup 2023: వరల్డ్ కప్ కామెంటరీకి ప్రత్యేక సన్నాహాలు - 120 మందితో తొమ్మిది భాషల్లో!
HCA Election Notification: హెచ్‌సీఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే
Ravichandran Ashwin: ఇదే నా చివరి ప్రపంచ కప్ - కెరీర్ గురించి రవిచంద్రన్ అశ్విన్ ఏమన్నాడంటే?
World Cup Record: పాకిస్థాన్‌తో పాటు ఈ జట్లేవీ వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించలేకపోయాయి, ఆ జట్లు ఏవంటే?
Kadiam Srihari: స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకేనని ముందే తెలుసు!- కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు
బండారు సత్యనారాయణ మూర్తి ఇంటి చుట్టూ పోలీసులు - అనకాపల్లిలో ఉద్రిక్తత
Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
/body>