T20 world cup Records: ఒకటి రెండు కాదు షేర్ ఖాన్, ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు
T20 world cup records five wickets in an innings: త్వరలో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా పొట్టి ప్రపంచ కప్ నిర్వహిస్తున్నాయి. మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన బౌలర్లు వీరే.
![T20 world cup Records: ఒకటి రెండు కాదు షేర్ ఖాన్, ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు List of Players with Five Wickets in an innings ICC Men T20 World Cup T20 world cup Records: ఒకటి రెండు కాదు షేర్ ఖాన్, ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/28/49845fca380405fbe78745fcc0d05a0e17168762102861036_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
T20 world cup records 5 wickets in an innings: మరో 6 రోజుల్లో టీ 20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. అమెరికా, వెస్టిండీస్ దేశాలు ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకూ జరిగిన టీ 20 ప్రపంచ కప్ మ్యాచుల్లో నమోదైన రికార్డులను చూస్తే ఆశ్చర్యం అనిపించక మానదు. మ్యాచ్ ఏదైనా పరుగుల వరదే కాదు వికెట్ల పతనం కూడా జోరుగా సాగుతూనే ఉంటుంది. ఈ నేపధ్యంలో బంతితో రఫ్ ఆడించిన ఆటగాళ్ళు ఎవరు? ఒకటి రెండు కాదు ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన పోటుగాళ్ళు ఎవరు అన్నది ఒకసారి చూద్దాం..
2007 నుంచి టీ 20 వరల్డ్ కప్ ప్రారంభం అయ్యింది. ఎనిమిది ఎడిషన్ల పాటు జరిగిన ఈ టీ 20 వరల్డ్ కప్ లో మొత్తం ఆరు మ్యాచ్ లలో పదిసార్లు ఈ అద్భుతం జరిగింది.. ఇంక 2012, 2014, 2016, 2021లలో అయితే ఒకసారి కాదు ఏకంగా 2 సార్లు ఈ అద్భుతం రిపీట్ అయ్యింది. ఒక బౌలర్ ఒక ఇన్నింగ్స్ లో 4 నాలుగు కంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయలేరు కాబట్టి దీనిని ఒక అద్భుతంగా చెప్పచ్చు ప్రత్యేకించి ట్వంటీ20 ఫార్మాట్‌లో.
వికెట్ల వీరులు వీరే
2009 లో న్యూజిలాండ్‌తో ఆడుతున్నప్పుడు పాకిస్తాన్‌కు చెందిన ఉమర్ గుల్ T20I మ్యాచ్‌లో మొదటి ఐదు వికెట్లు తీసుకున్నాడు. ప్రస్తుతం ఉమర్ గుల్ పాకిస్తాన్ జాతీయ తాత్కాలిక బౌలింగ్ కోచ్గా ఉన్నారు . అదే సంవత్సరం అంటే 2009లో ICC వరల్డ్ ట్వంటీ20 ని పాకిస్తాన్ జట్టు నిలిచింది. టోర్నమెంట్‌లో అత్యధికంగా 13 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డులలో ఉన్నాడు ఉమర్ గుల్. తరువాత ఆ లిస్ట్ లో శ్రీలంక క్రికెటర్ లు అజంతా మెండిస్ 2 ఇన్నింగ్స్ లో6 వికెట్లు తియ్యగా , శ్రీలంక బౌలర్ మలింగ 2 ఇన్నింగ్స్ లోనూ, నెదర్లాండ్స్ ఆటగాడు అహ్సన్ మాలిక్ ఒక ఇన్నింగ్స్ లోనూ 5 వికెట్లు తీసినవారిలో ఉన్నారు.
ఇక శ్రీలంకకు చెందిన లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ రంగనా హెరాత్ మూడు ఓవర్లు బౌలింగ్ చేసి 3 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. తరువాత ఈ లిస్ట్ లో జేమ్స్ ఫాల్క్‌నర్, ముస్తాఫిజుర్ రెహమాన్, ముజీబ్ ఉర్ రెహమాన్, ఆడమ్ జంపా, సామ్ కర్రాన్ ఉన్నారు. వీరిలో ముస్తాఫిజుర్ రెహమాన్ తన అరంగేట్రం మ్యాచ్ లోనే ఈ ఫీట్ చేశాడు. అతను చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపిఎల్ ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 10 బంతుల్లోనే ఆర్సీబీని చిత్తు చేసి ఔరా అనిపించాడు.
ఇక ఈ ఏడాది విషయానికి వస్తే టీం ఇండియా జట్టులో కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్,అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. వీళ్ళు ఏం అద్భుతాలు చూడాలి ఈసారి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)