అన్వేషించండి
Advertisement
ODI World Cup 2023: పుట్టినరోజు నాడు సెంచరీలు... కోహ్లీకు ముందు ఆరుగురే
ODI Century on Their Birthday: తన పుట్టిన రోజు నాడు తాను ఆరాధించే సచిన్ రికార్డును సమం చేసి కోహ్లీ తన 35వ జన్మదినం నాడు తనకు తానే అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చుకున్నాడు.
జన్మదినం.. ప్రతీ ఒక్కరికి ప్రత్యేకమైన రోజు. ఆ రోజును ప్రత్యేకంగా జరుపుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఇక ఆటగాళ్లకు అయితే అది ఇంకా ప్రత్యేకం. తమకు జీవితాంతం గుర్తుండే ప్రదర్శన చేసి జన్మదినాన్ని మరింత మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని చూస్తుంటారు. క్రికెటర్లు అయితే మరీను. నిన్న తన పుట్టిన రోజు నాడు తాను ఆరాధించే సచిన్ రికార్డును సమం చేసి కోహ్లీ తన 35వ జన్మదినం నాడు తనకు తానే అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. కోహ్లీతో పాటు మరికొందరు ఆటగాళ్లు కూడా పుట్టినరోజునాడే సెంచరీలు చేసి తమ జన్మదినాన్ని మరింత మధురంగా మలుచుకున్నారు.
తన 35వ పుట్టినరోజు నాడు కోహ్లీ సూపర్ సెంచరీ చేసి క్రికెట్ గాడ్ అయిన సచిన్ 49 సెంచరీల రికార్డును సమం చేశాడు. ప్రతిష్టాత్మకమైన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఈ సెంచరీ సాధించాడు. దీంతో ఈ బర్త్ డే ఎంతో స్పెషల్ గా మారిపోయింది. అయితే కోహ్లీ ఇలా పుట్టినరోజు నాడు సెంచరీ చేసిన నేపథ్యంలో.. కోహ్లీ లాగే బర్త్ డే రోజు సెంచరీ కొట్టిన బ్యాటర్లు ఎవరన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే కోహ్లీ కన్నా ముందు ఆరుగురు మాత్రమే ఇలా పుట్టినరోజు నాడు సెంచరీ కొడితే.. వీరిలో ఇద్దరు మాత్రమే తమ పుట్టినరోజున వన్డే ప్రపంచకప్‌లో సెంచరీలు కొట్టారు.
1. వినోద్ కాంబ్లీ (21వ పుట్టినరోజు) – 100* vs ఇంగ్లాండ్, జైపూర్ (1993)
2. సచిన్ టెండూల్కర్ (25వ పుట్టినరోజు) – 134 vs ఆస్ట్రేలియా, షార్జా (1998 )
3. సనత్ జయసూర్య (39వ పుట్టినరోజు) – 130 vs బంగ్లాదేశ్, కరాచీ (2008)
4. రాస్ టేలర్ (27వ పుట్టినరోజు) – 131* vs పాకిస్తాన్, పల్లెకెలె (2011)
5.టామ్ లాథమ్ (30వ పుట్టినరోజు) – 140* vs నెదర్లాండ్స్, హామిల్టన్ (2022)
6. మిచెల్ మార్ష్ 32వ పుట్టినరోజు) – 121 vs పాకిస్థాన్, బెంగళూరు (2023)
7. విరాట్ కోహ్లీ (భారతదేశం) (35వ పుట్టినరోజు) – 100* vs దక్షిణాఫ్రికా, కోల్‌కతా
ఈ ప్రపంచకప్‌లోనే ఇద్దరు ఆటగాళ్లు సెంచరీలు చేసి తమ జన్మదినాన్ని మరింత మధురంగా మార్చుకున్నారు. అందులో ఒకరు విరాట్ కోహ్లీ అయితే, మరొకరు మిచెల్ మార్ష్. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఆస్ట్రేలియా ప్లేయర్ శతకం సాధించాడు.
దక్షిణాఫ్రికాపై బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై 119 బంతుల్లో 10 ఫోర్లతో సెంచరీ సాధించి విరాట్ క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును సమం చేశాడు. మొత్తం 121 బంతులు ఎదుర్కొన్న విరాట్...101 పరుగులతో అజేయంగా నిలిచాడు. పిచ్‌పై బంతి తిరుగుతున్న వేళ కోహ్లీ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. ఈ సెంచరీతో క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. జన్మదినం రోజున తన ఆరాధ్య క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వన్డే సెంచరీల రికార్డును సమం చేసిన కింగ్ కోహ్లీ... క్రికెట్ దేవుడిపై తనకున్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు. 49వ వన్డే సెంచరీ చేసిన అనంతరం సచిన్‌పై తనకున్న అభిమానం గురించి చాటిచెప్పాడు. సచిన్ టెండూల్కర్ తన హీరో అని... అతనిలా తాను ఎప్పుడూ రాణించలేనని కోహ్లీ వ్యాఖ్యానించాడు. సచిన్ ఎప్పటికీ తన ఆరాధ్యుడేనన్న కోహ్లీ.. సచినతో తనను పోల్చడాన్ని తప్పుపట్టాడు. క్రికెట్ లెజెండ్ సచిన్‌లా తాను ఎప్పటికీ రాణించలేనని పేర్కొన్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు స్వీకరించిన అనంతరం మాట్లాడిన కోహ్లీ... తన హీరో రికార్డును సమం చేయడం తనకు ప్రత్యేకమైన క్షణమని అన్నాడు. బ్యాటింగ్‌లో సచిన్ పరిపూర్ణుడని కోహ్లీ కొనియాడాడు. సచిన్ ఎప్పుడూ తన హీరోగానే ఉంటాడని కోహ్లీ చెప్పాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆటో
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion