KL Rahul Athiya Shetty Wedding: కేఎల్ రాహుల్, అతియా శెట్టి పెళ్లి ఫిక్స్!
భారత ఓపెనర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టిల వివాహం త్వరలోనే జరగనుంది. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.
లవ్ బర్డ్స్ కేఎల్ రాహుల్, అతియా శెట్టిల పెళ్లి ముహుర్తానికి సమయం ఆసన్నమైంది. భారత క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడు సీనియర్ నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరి ప్రేమకు పెద్దలు ఓకే చెప్పారు. త్వరలోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు.
ఈ పెళ్లిని మొదట ముంబయిలోని ఓ స్టార్ హోటల్ లో వేడుకగా నిర్వహించాలనుకున్నారట. అయితే ఇప్పుడు వివాహ వేదికను ఖండాలాలో సునీల్ శెట్టికి ఉన్న బంగ్లాకు మార్చాలని నిర్ణయించారు. ఈ బంగ్లాను 17 సంవత్సరాలీ క్రితం నిర్మించారు. ఇప్పటికే ఓ వెడ్డింగ్ ప్లానర్ అక్కడికి వెళ్లి బంగ్లాను పరిశీలించి.. పెళ్లి ఏర్పాట్లపై రాహుల్- అతియా ఇంట్లో మాట్లాడినట్లు సమాచారం.
2015లో సూరజ్ పంచోలి సరసన హీరో అనే సినిమాతో అతియాశెట్టి తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ముబారకన్, మోతీచూర్ చక్నాచూర్ అనే చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే రాహుల్ తో ప్రేమ వ్యవహారంతో తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
ఇక రాహుల్ ప్రస్తుతం ఆసియా కప్ లో ఆడుతున్నాడు. మరో 40 రోజుల్లో టీ20 ప్రపంచకప్ లో రాహుల్ కీలకం కానున్నాడు. ఆ మెగా టోర్నీ ముగిశాకే వీరి వివాహం ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Happy birthday my ❤️ @theathiyashetty pic.twitter.com/CqLUbyLHrK
— K L Rahul (@klrahul) November 5, 2021
#KLRahul, #AthiyaShetty to get married at this venue:
— Zee News English (@ZeeNewsEnglish) September 5, 2022
Check Details: https://t.co/RnAsKtb64R