Ishant Sharma: ఇషాంత్ శర్మ ఫేస్ చేసిన టఫెస్ట్ బ్యాటర్ ఎవరు? - భారత బౌలర్ ఏమన్నాడంటే?
టెస్టు క్రికెట్‌లో తను ఇప్పటి వరకు బౌలింగ్ చేసిన వారిలో స్టీవ్ స్మిత్ మోస్ట్ టఫెస్ట్ బ్యాటర్ అని తెలిపారు.
Ishant Sharma On Steve Smith: భారత టెస్టు చరిత్రలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో ఇషాంత్ శర్మ ముందంజలో ఉంటాడు. ఇషాంత్ శర్మ టెస్టుతో పాటు వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇషాంత్ శర్మ టెస్టుల్లో ఎక్కువ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇషాంత్ శర్మ ఏ బ్యాట్స్‌మెన్‌కు బౌలింగ్ చేయడంలో చాలా కష్టపడ్డారు? ఈ ప్రశ్నకు స్వయంగా ఇషాంత్ శర్మ సమాధానం ఇచ్చాడు.
స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌ల్లో ఎవరికి బౌలింగ్ చేయడం అత్యంత సవాలుగా ఉందని ఇషాంత్ శర్మను అడిగినప్పుడు... ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌కు బౌలింగ్ చేయడం చాలా కష్టమని ఈ భారత ఏస్ ఫాస్ట్ బౌలర్ చెప్పాడు. తన కెరీర్‌లో ఇప్పటివరకు బౌలింగ్ చేసిన బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ అత్యంత టఫెస్ట్ బ్యాట్స్‌మెన్ అని ఇషాంత్ శర్మ చెప్పాడు.
జో రూట్, కేన్ విలియమ్సన్‌లతో పోలిస్తే స్టీవ్ స్మిత్ బౌలింగ్ చేయడం చాలా కష్టమని ఇషాంత్ శర్మ అన్నాడు. ఇది కాకుండా తన టెస్టు హ్యాట్రిక్‌పై కూడా ఇషాంత్ శర్మ స్పందించాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేయడం ద్వారా ఇషాంత్ శర్మ తన హ్యాట్రిక్ పూర్తి చేశాడు.-
స్టీవ్ స్మిత్‌ను ఔట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ పూర్తి చేయడం నాకు అత్యుత్తమ అనుభవం అని ఇషాంత్ శర్మ అన్నాడు. హ్యాట్రిక్ బాల్‌లో స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేయడం తనకు కల లాంటిదని అతను చెప్పాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ హ్యాట్రిక్ సాధించడం విశేషం. ఆ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్‌ను ఇషాంత్ శర్మ హ్యాట్రిక్ బాల్‌లో అవుట్ చేశాడు.
Happy birthday, @ajinkyarahane88! Wishing you an incredible day filled with joy and success. Keep shining on the field and off it. Have a fantastic year ahead! pic.twitter.com/RE5PNkFOdl
— Ishant Sharma (@ImIshant) June 6, 2023
Feeling blessed to witness the magic of Kedarnath! 🙏✨ The dedication and resilience of our @adgpi, @uttarakhandcops, and Uttarakhand Government in reviving this sacred place is truly commendable. Thank you for your unwavering efforts! pic.twitter.com/8C9HtBeRDa
— Ishant Sharma (@ImIshant) June 5, 2023
Proud to have been named Player of the Match in my first match this season for @DelhiCapitals , as we clinch our first win of the season. Here's to more hard-fought battles and triumphs together! #IPL2023 #DelhiCapitals #PlayerOfTheMatch https://t.co/WoXF5dEnr4
— Ishant Sharma (@ImIshant) April 20, 2023
For his impressive bowling spell and 2⃣ crucial wickets, @ImIshant receives the Player of the Match award in his first game of #TATAIPL 2023 👏👏@DelhiCapitals win by 4⃣ wickets against #KKR
— IndianPremierLeague (@IPL) April 20, 2023
Scorecard ▶️ https://t.co/CYENNIiaQp #DCvKKR pic.twitter.com/aRZjtrTvHa