By: ABP Desam | Updated at : 13 Apr 2023 12:30 PM (IST)
ఎంఎస్ ధోని ( Image Source : CSK Twitter )
IPL 2023 Viewership: జార్ఖండ్ డైనమైట్ మహేంద్ర సింగ్ ధోని సిక్సర్లా మజాకా.. వింటేజ్ ధోనిని గుర్తుకు చేస్తూ బుధవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ధోని విధ్వంసాలకు జియో సినిమా వ్యూయర్‌షిప్ రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఈ మ్యాచ్ జరుగుతున్న క్రమంలో 1 కోటి, కోటిన్నర వ్యూస్ ఉండగా ఆఖర్లో ధోని బ్యాటింగ్ కు వచ్చి బాదుడు మొదలెట్టాక వ్యూయర్‌షిప్ ఏకంగా 2 కోట్లు దాటింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం.
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో భాగంగా శాంసన్ సేన నిర్దేశించిన 176 పరుగులను ఛేదించే క్రమంలె చెన్నై ఆరంభంలో ధాటిగానే ఆడినా తర్వాత అశ్విన్, చాహల్, జంపాల స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడింది. 18 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే చేసింది 136 పరుగులే. ఆఖరి రెండు ఓవర్లలో 40 రన్స్ చేయాలి. అప్పటిదాకా జియో సినిమాలో రియల్ టైమ్ వ్యూస్ 1.8 కోట్ల వద్ద ఉంది. అప్పటికే టైమ్ 11 దాటింది.
జేసన్ హోల్డర్ వేసిన 19వ ఓవర్లో జడేజా ఓ ఫోర్, రెండు సిక్సర్లు కొట్టి చెన్నైకి విజయం మీద ఆశలు కల్పించాడు. దీంతో జియో సినిమాలో చూసేవారి సంఖ్య కూడా 2 కోట్లకు పెరిగింది. ఇక చివరి ఓవర్లో సందీప్ శర్మ బౌలింగ్. ప్రపంచంలోనే బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్న ధోని బ్యాటింగ్. ఆ ఓవర్లో 21 పరుగులు కావాలి. ఐపీఎల్ఖ-16లో మరో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ తప్పదనిపించింది. దానికి అనుగుణంగానే తాలా.. 2, 3 బంతుల్లో వరుసగా రెండు భారీ సిక్సర్లు. ధోని మ్యాచ్ ఫినిష్ చేస్తాడని భావించిన అభిమానులు రాత్రి 11.30 గంటలు దాటినా మొబైల్ తెరల ముందు కళ్లప్పగించి చూశారు. అప్పుడు జియో వ్యూయర్ షిప్ ఏకంగా 2.2 కోట్లకు తాకింది.
2.2 crore tuning into JioCinema, Crores in TV, at the age of 41, he is a hope after playing his last International match in 2019.
— Johns. (@CricCrazyJohns) April 12, 2023
It has been more than a decade in Yellow, the trust & faith of fans is the greatness of MS. pic.twitter.com/z67wW8x6sB
అయితే సందీప్ శర్మ చివరి మూడు బంతులను తెలివిగా వేసి చెన్నై విజయాన్ని దూరం చేశాడు. మ్యాచ్ పోయినా జియో వ్యూయర్ షిప్ లో మాత్రం ఇవే హయ్యస్ట్ వ్యూస్. 41 ఏండ్ల వయసులో ఉన్న ఒక వ్యక్తి.. అదీగాక అంతర్జాతీయ క్రికెట్ ను వదిలేసి మూడేండ్లు గడిచినా.. మునపటిలా షాట్లు కొడతాడో లేదోనన్న అనుమానాల ఊగిసలాటలో కూడా ధోని మీద తమిళ తంబీలతో పాటు ఐపీఎల్ అభిమానులకు ఉన్న నమ్మకానికి ఇంతకంటే తార్కాణం ఏం కావాలి. దటీజ్ ధోని..
జియో సినిమాలో ఐపీఎల్ - 2023 హయ్యస్ట్ వ్యూస్ రికార్డు..
- సీఎస్కే వర్సెస్ రాజస్తాన్ : 2.2 కోట్లు
- ఆర్సీబీ వర్సెస్ లక్నో : 1.8 కోట్లు
- ముంబై వర్సెస్ ఢిల్లీ : 1.7 కోట్లు (లాస్ట్ ఓవర్ థ్రిల్లర్)
- సీఎస్కే వర్సెస్ లక్నో : 1.7 కోట్లు (ఇది కూడా ధోని.. మార్క్ వుడ్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టినప్పుడే)
- సీఎస్కే వర్సెస్ గుజరాత్ : 1.6 కోట్లు
ఐపీఎల్‌లో ఇప్పటివరకు హయ్యస్ట్ వ్యూస్‌కు సంబంధించిన రికార్డు 2019 సీజన్ లో నమోదైంది. ఈ సీజన్ లో భాగంగా ముంబై - చెన్నై మధ్య జరిగిన ఫైనల్‌లో రియల్ టైమ్ వ్యూస్ 1.8 కోట్లకు తాకింది. అప్పుడు ఐపీఎల్ మ్యాచ్ లు హాట్ స్టార్ లో వచ్చేవి. కానీ ఈ రికార్డును జియో చెల్లాచెదురు చేస్తున్నది. ఈ సీజన్ లో శని, ఆదివారాలతో పాటు మిగతా రోజుల్లో కూడా మ్యాచ్ లలో రియల్ టైమ్ వ్యూస్ ఏకంగా కోటిని దాటుతున్నాయి. హాట్ స్టార్ లో మ్యాచ్ లు చూడాలంటే సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి. కానీ జియోలో ఐపీఎల్ ఉచితంగా ప్రసారమవుతున్నది.
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?
LGM Second Look: ధోని నిర్మిస్తున్న ‘ఎల్జీయం’ సెకండ్ లుక్ రివీల్ - ఎలా ఉందో చూశారా?
ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !