అన్వేషించండి

Deepak Chahar Injury: దీపక్ చాహర్‌కు మళ్లీ గాయం! చెన్నైకి మరో షాక్ తప్పదా?

IPL 2023: గతేడాది ఐపీఎల్‌కు ముందు గాయపడి సీజన్ మొత్తానికి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన పేసర్ దీపక్ చాహర్ మరోసారి గాయపడ్డాడు.

Deepak Chahar Injury: ఐపీఎల్-16లో  శనివారం  ముంబై ఇండియన్స్‌తో  జరిగిన మ్యాచ్ నెగ్గిన ఉత్సాహంలో  ఉన్న చెన్నై సూపర్ కింగ్స్‌కు  మరో భారీ షాక్ తప్పేట్టు లేదు. ముంబైతో మ్యాచ్‌కు ముందు  సీఎస్కే ఆల్ రౌండర్ బెన్  స్టోక్స్  చేతికి గాయంతో దూరమయ్యాడు. అతడికి వారం రోజుల విరామం అవసరమని వైద్యులు సూచించడంతో నిన్నటి మ్యాచ్ ఆడలేదు. కాగా ముంబైతో మ్యాచ్  జరుగుతుండగానే  సీఎస్కేకు మరో షాక్ తగిలింది. చెన్నై  కీలక  పేసర్ దీపక్ చాహర్ గాయంతో  గ్రౌండ్‌ను వీడాల్సి వచ్చింది.  

ఏం జరిగింది..? 

ఈ సీజన్‌లో తొలి ‘ఎల్ క్లాసికో’ మ్యాచ్‌లో భాగంగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇన్నింగ్స్‌లో దీపక్ చహర్ తొలి ఓవర్ వేశాడు.  ఈ ఓవర్ ముగిసేటప్పటికీ  చహర్ గతంలో మాదిరిగానే తొడ కండరాలు పట్టేయడంతో ఇబ్బందిపడ్డాడు.  ఒక్క ఓవర్ వేయగానే అతడు నొప్పితో విలవిల్లాడు. ఫిజియోలు వచ్చి నొప్పి తగ్గించేందుకు యత్నించినా సాధ్యం కాకపోవడంతో అతడు  డగౌట్ కు చేరుకున్నాడు.  

నాలుగైదు మ్యాచ్‌లు అనుమానమే..!

చహర్ నొప్పితో ఇబ్బందిపడుతూ  గ్రౌండ్‌ను వీడుతున్న తరుణంలో సీఎస్కే మాజీ ఆటగాడు,  ప్రస్తుతం జియో సినిమాలో హిందీ కామెంట్రీ చెబుతున్న సురేశ్ రైనా స్పందిస్తూ.. ‘చూస్తుంటే   చాహర్ కు మళ్లీ తొడ కండరాలు పట్టేసినట్టు అనిపిస్తుంది. ఇది చెన్నైకి ఇబ్బందికర పరిస్థితే. దీపక్ మరో నాలుగైదు మ్యాచ్‌లు ఆడేది  అనుమానంగానే ఉంది.  చెన్నై జట్టు తాము ఇతర  వేదికల్లో ఆడే  మ్యాచ్‌లకు చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. ఇది వాళ్లకు  కాస్త అసౌకర్యం కలిగించేదే..’అని  చెప్పాడు.  సీఎస్కే వర్గాలు దీపక్ గాయంపై అధికారిక ప్రకటన చేయకపోయినా అతడు  కొన్ని  మ్యాచ్‌లకు  ఆడటం కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

కాగా ఇదే విషయమై ముంబైతో మ్యాచ్ ముగిశాక సీఎస్కే సారథి ధోని మాట్లాడుతూ... ‘ముంబైపై  మ్యాచ్ గెలిచినందుకు సంతోషంగా ఉంది.  కానీ మేం తొలి ఓవర్లోనే మా ప్రధాన పేసర్ దీపక్ చాహర్ సేవల్ని కోల్పోయాం..’ అని  చెప్పాడు. చాహర్ గాయంపై ధోని కూడా ఇంతకు మించి  అప్డేట్ ఇవ్వలేకపోయాడు.  ఈ నేపథ్యంలో   చెన్నై తర్వాత ఆడబోయే మ్యాచ్‌లకు చాహర్ అందుబాటులో ఉంటాడా..? లేదా..? అన్నది అనుమానంగానే ఉంది. 

స్టోక్స్ ప్లేస్‌లో రఫ్ఫాడించిన రహానే.. 

ముంబైతో మ్యాచ్‌లో సీఎస్కే బెన్ స్టోక్స్ లేకుండానే ఆడింది. వాంఖెడేలో  ప్రాక్టీస్ చేస్తుండగా  స్టోక్స్ చేతి మడమకు గాయమైనట్టు చెన్నై వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం  స్టోక్స్ గాయపడగా అతడికి   వైద్యులు   కనీసం పది రోజుల విశ్రాంతి అవసరమని సూచించారని సమాచారం. అయితే నిన్నటి మ్యాచ్ లో  అజింక్యా రహానే స్టోక్స్ లోని లోటును తీర్చాడు.  డెవాన్ కాన్వే నిష్క్రమించిన తర్వాత  క్రీజులోకి వచ్చిన రహానే.. ముంబైకి ఊహించని  షాక్ ఇచ్చాడు. చెన్నైకి  ఈ ఒక్కమ్యాచ్‌కు సర్‌ప్రైజ్ ప్యాకేజీలా దొరికిన రహానే.. 19 బంతుల్లోనే  హాఫ్ సెంచరీ  చేశాడు. ఈ సీజన్ లో ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టీ. మొత్తంగా  27 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 భారీ సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసిన  రహానే.. సీఎస్కేకు ఈజీ విక్టరీ  అందించాడు. 

టాప్ హెడ్ లైన్స్

NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
IND VS SL 2nd Test Updates:  రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
రెండో టెస్టుకు అలాంటి పిచ్ సిద్ధం చేస్తున్న లంక‌.. ఈ మ్యాచ్ లో గెలిస్తే, సిరీస్ భార‌త వశం.. డ‌బ్ల్యూటీసీ రేసులో ముందంజ‌!
England's Joe Root Sachin Record: క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
క్రికెట్ గాడ్ సచిన్ ఆల్ టైమ్ రికార్డును స‌మం చేసిన‌ రూట్... ! అత్యధిక ఫిఫ్టీలతో సంయుక్తంగా టాప్ ప్లేస్ కు చేరిక
Sachin Vs Kohli: సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 
సచిన్  కంటే కోహ్లీనే ఆ విష‌యంలో గ్రేట్.. ప్ర‌పంచ క్రికెట్లో టీమిండియా ఆధిప‌త్యం కొన‌సాగిస్తోంది.. మాజీ క్రికెట‌ర్ డివిలియ‌ర్స్ 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget