By: ABP Desam | Updated at : 03 May 2023 09:26 AM (IST)
కోహ్లీ - గంభీర్ ( Image Source : Social Media )
Kohli vs Gambhir: ‘చిన్నకొడుకా మొగిలన్నా.. అన్నంటే తండ్రెనుక తండ్రి కొడుకా.. ఒక్క తల్లి పిల్లలూ నా కొడుకా కూడిమాడిండాలే నా కొడుకా..’ అంటూ ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించిన బలగం సినిమా తెలంగాణ పల్లెల్లో బంధాలను తట్టిలేపుతున్నది. అప్పుడెప్పుడో ఎన్టీవోడి కాలంలో ఊళ్లల్లో సినిమాలు ప్రదర్శించినట్టుగా తెలంగాణ గ్రామాల్లో ఈ సినిమాను ఎల్‌ఈడీ తెరల్లో చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాను టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీలకు బలవంతంగా అయినా కూర్చోబెట్టి చూపించాలని అభిమానులు కోరుతున్నారు.
రెండ్రోజుల క్రితం లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య లక్నో వేదికగా ముగిసిన పోరులో జరిగిన రచ్చ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పన్లేదు. నవీన్ ఉల్ హక్ ఉడుకు రక్తం, కోహ్లీ అతి, గంభీర్ పాత పగలు కలిసి ఈ మ్యాచ్‌ను వివాదానికి కేంద్ర బింధువుగా మార్చాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత నవీన్ ఉల్ హక్‌ను పట్టించుకోని ఫ్యాన్స్.. కోహ్లీ - గంభీర్ పైనే దృష్టి సారించారు.
మ్యాచ్ ముగిశాక కోహ్లీ - గంభీర్ అభిమానులు సైతం ఈ గొడవపై ముందు సోషల్ మీడియాలో వాదులాడుకున్నా తర్వాత మాత్రం ‘ప్చ్.. ఇది జరుగకుంటే ఉండే బావుండు’అనుకుంటున్నారు. తాజాగా సామాజిక మాధ్యమాలలో ఈ ఇద్దరినీ ఉద్దేశిస్తూ బలగం సినిమా మీమ్ ఫుల్ వైరల్ అవుతోంది. కోహ్లీ - గంభీర్‌లకు అర్జెంట్‌గా బలగం సినిమా చూపించి వారిద్దరినీ కలపాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా కుర్రాళ్లు చేస్తున్న మీమ్స్ నెట్టింట నవ్వులు పూయిస్తున్నాయి.
సుడిగాడు సినిమాలో అల్టరి నరేష్.. 30 ఈయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి తాళ్లు కట్టేసి సినిమా చూపించినట్టుగా కోహ్లీ - గంభీర్ కు కూడా కుర్చీలలో కూర్చోబెట్టి బలవంతంగా బలగం మూవీ చూపించిన మీమ్ బాగా పాపులర్ అయింది. బలగం సినిమా చూశాక.. ‘వద్దు బ్రో, మేం కలిసిపోతాం’ అని వారితో చెప్పించినట్టు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ‘ఒక్కతల్లి బిడ్డలూ నా కొడుకా.. కలిసిమెలిసుండాలే నా కొడుకా..’ పాటతో ఈ మీమ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.
అక్కడ కూడా ధోనికే క్రెడిట్..
ఈ మీమ్స్ లోనే.. బలగం సినిమాలో తాత రోల్ ను ధోనితో వేయించాలని దాంతో అతడే మొత్తం క్రెడిట్ తీసుకుంటాడని కూడా నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం. ఈ క్రెడిట్స్ విషయంలో ప్రథమ బాధితుడు గంభీరే అన్న సంగతి తెలిసిందే. 2011 వరల్డ్ కప్ ఫైనల్ లో గంభీర్ 97 పరుగులు చేసినా గెలిపించిన క్రెడిట్ మొత్తం ధోని కొట్టేశాడని.. ఈ ఢిల్లీ ఎంపీ చాలాసార్లు బహిరంగంగానే తన ఆవేదనను వ్యక్తం చేశాడు.
నేను కలుపుతా : రవిశాస్త్రి
గంభీర్ - కోహ్లీలు ఇద్దరూ ఢిల్లీకి చెందినవారే. దేశవాళీలతో పాటు భారత జట్టులో కూడా డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నవారే. కానీ 2013 ఐపీఎల్ లో మొదలైన గొడవ ఇప్పటికీ రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఈ ఇద్దరూ దిగ్గజ క్రికెటర్లు పంతాలు పక్కనబెట్టి ఎంత త్వరగా కలిసిపోతే అంతమంచిదని ఫ్యాన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ తో పాటు కోహ్లీ జాన్ జిగ్రీ దోస్త్ రవిశాస్త్రి కూడా చెప్పాడు. ఈ ఇద్దరి మధ్య సంధి కుదర్చడానికి తాను రెడీ అంటూ ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చాడు. మరి ఢిల్లీ బాయ్స్ ఏం చేస్తారో..!
MS Dhoni Knee Surgery: ధోనికి విజయవంతంగా శస్త్రచికిత్స - రిటైర్మెంట్‌పై నిర్ణయం అప్పుడే!
Team India New Jersey: డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచే కొత్త జెర్సీలు - ఘనంగా ఆవిష్కరించిన అడిడాస్
WTC 2023 Final: ఐపీఎల్ ముగిసింది - ఐసీసీ వేట మొదలైంది - డబ్ల్యూటీసీ ఫైనల్ వేదిక, బ్రాడ్‌కాస్ట్, జట్ల వివరాలివే
Annamalai on Jadeja: సీఎస్‌కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Realme 11 Pro: 200 మెగాపిక్సెల్ కెమెరాతో రియల్‌మీ 11 ప్రో సిరీస్ - త్వరలో మనదేశంలో కూడా - ఎప్పుడు రానుందంటే?
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !
Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం