అన్వేషించండి

Bumrah News: మరో రికార్డుపై బుమ్రా కన్ను.. టెస్టుల్లో విజయవంతమైన భారత బౌలర్ గా నిలిచేందుకు గురి.. మరో ఆరు వికెట్లు సాధిస్తే రికార్డు 

BGT News: భారత్ తరపున టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరిన భారత  పేసర్ గా బుమ్రా గతవారం రికార్డు నెలకొల్పాడు. తాజాగా మరో రికార్డుపై నజర్ పెట్టాడు.

Aus Vs Ind Test Series Updates: ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. తాజాగా మరో రికార్డుపై కన్నేశాడు. ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచేందుకు గట్టి పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఆ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ లో ఆడుతున్న బుమ్రా.. ఇప్పటికే 30 వికెట్లు తీశాడు. రెండోస్థానంలో ఉన్న ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఖాతాలో 20 వికెట్లు ఉన్నాయి. వీరిద్దరి మధ్య పదివికెట్ల తేడా ఉందంటేనే బుమ్రా ఫామ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సిరీస్ లో భాగంగా ఈనెల 3 నుంచి జరిగే సిడ్నీ టెస్టులో మరో ఆరు వికెట్లు సాధిస్తే అద్భుతమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. 

చంద్రశేఖర్ పేరిట రికార్డు..
ఒక సిరీస్ లో అత్యంత విజయవంతమైన బౌలర్ గా బీఎస్ చంద్రశేఖర్ నిలిచాడు. 1972-73 సిరీస్ 35 వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు. అప్పటి నుంచి ఈ రికార్డు చెక్కు చెదరకుండా పదిలంగానే ఉంది. ఆ తర్వాతి స్థానంలో వినూ మన్కడ్-సుభాష్ గుప్తే చెరో 34 వికెట్లతో నిలిచారు. ఇక ఆసీస్ తోనే జరిగిన ఫేమస్ 2001 సిరీస్ లో టర్బోనేటర్ హర్భజన్ సింగ్ 32 వికెట్లతో ఈ రికార్డుకు దగ్గరగా వచ్చినా దాన్ని బద్దలు కొట్టలేకపోయాడు. అయితే ఈ సువర్ణావకాశం బుమ్రా చేతికి వచ్చింది. మరి దీన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటుతాడో చూడాలి. 

గతేడాది ఫుల్లు జోష్ లో బుమ్రా..
గతేడాది బుమ్రా కెరీర్ మరపురానిదనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓవరాల్ గా 71 వికెట్లు తీసిన బుమ్రా.. నెం.1 ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఇక తాజాగా జరుగుతున్న బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ) సిరీస్ లో 30 వికెట్లు సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. గతవారం ముగిసిన నాలుగో టెస్టులో 9 వికెట్లు సాధించడంతో తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్ లో 907 పాయింట్లతో తన నెం.1 ర్యాంకును మరింత పదిలం చేసుకున్నాడు. దీంతో ఇప్పటివరకు అత్యధిక ఐసీసీ రేటింగ్ పాయింట్లు (904) సాధించిన భారత బౌలర్ గా రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉన్న రికార్డును తిరగరాశాడు. 
ఇక గతేడాది ప్రదర్శనకు గాను ఐసీసీ అందించే ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) , ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు బుమ్రా నామినేట్ అయ్యాడు. తాజాగా ప్రకటించిన అప్డేట్ లో తను ఈ అవార్డులకు షార్ట్ లిస్టు అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ అవార్డుల విన్నర్ల పేర్లను ఐసీసీ ప్రకటించనుంది. బుమ్రా జోరును చూస్తుంటే ఈ రెండు అవార్డును అతనే కైవసం చేసుకునే అవకాశముంది. 

టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు -
BS చంద్రశేఖర్ – 5 టెస్టుల్లో 35 వికెట్లు, ఇంగ్లండ్ పై, 1972-73
వినూ మన్కడ్ - 5 టెస్టుల్లో 34 వికెట్లు, ఇంగ్లండ్ పై, 1951-52
సుభాష్ గుప్తే – 5 టెస్టుల్లో 34 వికెట్లు, న్యూజిలాండ్ పై,  1955-56
కపిల్ దేవ్ - 6 టెస్టుల్లో 32 వికెట్లు, పాకిస్థాన్, 1979-80
హర్భజన్ సింగ్ - 3 టెస్టుల్లో 32 వికెట్లు,  ఆస్ట్రేలియాపై, 2000-01
రవిచంద్రన్ అశ్విన్ - 4 టెస్టుల్లో 32 వికెట్లు, ఇంగ్లండ్ పై, 2020-21
బిషన్ సింగ్ బేడీ - 5 టెస్టుల్లో 31 వికెట్లు, ఆస్ట్రేలియాపై, 1977-78
రవిచంద్రన్ అశ్విన్ - 4 టెస్టుల్లో 31 వికెట్లు, దక్షిణాఫ్రికాపై, 2015-16
జస్ప్రీత్ బుమ్రా - 4 టెస్టుల్లో 30 వికెట్లు, ఆస్ట్రేలియాపై, 2024-25

Also Read: Sydney Test Updates: ఐదో టెస్టులో ఆ టీమిండియా స్టార్ పై వేటు ఖాయం..! గంభీర్ పైనా వేళాడుతున్న కత్తి.. జట్టు ప్రదర్శనను నిశితంగా పరిశీలిస్తున్న బోర్డు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Blowout: గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
గ్యాస్ డ్రిల్లింగ్ బ్లో అవుట్లు అసలు ఎలా జరుగుతాయి? ఎలా ఆపాలి ?
Hyderabad Water Supply: హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
హైదరాబాద్‌లో ఇక తాగునీటి సమస్య ఉండదు! 8 వేల కోట్లతో రింగ్ మెయిన్ ప్రాజెక్ట్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Embed widget