Rajkot T20 Live Updates: భారత్ బౌలింగ్.. షమీ వచ్చేశాడు.. సిరీస్ పై భారత్ కన్ను
సిరీస్ ను ఈ మ్యాచ్ తోనే కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు చాలా ఒత్తిడిలో ఉంది. ఈ మ్యాచ్ లో నెగ్గకపోతే సిరీస్ ప్రత్యర్థి వశమవుతుంది.

Ind Vs Eng 3rd T20i Live Updates: మరో టీ20 పోరుకు ఇంగ్లాండ్, భారత్ జట్లు సిద్ధమయ్యాయి. రాజకోట్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. సిరీస్ లో వరుసగా మూడోసారి భారత్ టాస్ నెగ్గడం విశేషం. బ్యాటింగ్ కు స్వర్గధామమైన ఈ పిచ్ పై ఇరు జట్ల ఆటగాళ్లు భారీ స్కోరుపై కన్నేశారు. ముఖ్యంగా సిరీస్ ను ఈ మ్యాచ్ తోనే కైవసం చేసుకోవాలని భారత్ భావిస్తోంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్ లు నెగ్గిన భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టు చాలా ఒత్తిడిలో ఉంది. ఈ మ్యాచ్ లో నెగ్గకపోతే సిరీస్ ప్రత్యర్థి వశమవుతుంది. అలాగే ఫ్లాట్ పిచ్ పై తమ ఆటగాళ్లు భారీగా పరుగులు సాధించాలని కోరుకుంటుంది. మరోవైపు నిరంజన్ షా మైదానంలో సగటు స్కోరు 189 పరుగులుగా ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ భారీగా పరుగులు చేయాలని భావిస్తోంది. పిచ్ పై డ్యూ ప్రభావం లేకపోవడంతో ఛేజింగ్ కు కొంచెం ఈజీగా ఉండబోతోంది. మరోవైపు చాలాకాలంగా పునరాగమనం ఎదురు చూస్తున్న భారత వెటరన్ పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి వచ్చాడు. అర్షదీప్ సింగ్ కు విశ్రాంతినిచ్చారు. ఇంగ్లాండ్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు.
🚨 Team News
— BCCI (@BCCI) January 28, 2025
Mohd. Shami picked in the Playing XI as #TeamIndia make 1⃣ change to the line-up 🔽
Updates ▶️ https://t.co/amaTrbtzzJ#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/zKTKBk8yL3
సూర్య ఫాంలోకి వస్తాడా..?
చాలాకాలంగా విఫలమవుతూ వస్తున్న భారత టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఈ మ్యాచ్ ద్వారా సత్తా చాటాలని భావిస్తున్నాడు. నిజానికి గతేడాది జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత తను రాణించింది లేదు. ఇక రాజకోట్ లోని నిరంజన్ షా మైదానం తనకు చాలా స్పెషల్. గతంలో శ్రీలంకపై ఇక్కడ సూర్య సెంచరీ బాదాడు. ఆ జోరును గుర్తుకు తెచ్చుకుని సూర్య మరోసారి రెచ్చిపోవాలని భారత అభిమానులు భావిస్తున్నారు. ఇక వెటరన్ పేసర్ షమీ ఈ మ్యాచ్ లో రెచ్చిపోయి తన కంబ్యాక్ ను ఘనంగా చాటుకోవాలని అనుకుంటున్నాడు. ఇక పిచ్ స్పిన్నర్లకు అంతగా సహకరించకున్నా, నలుగురు స్పిన్నర్లతో భారత్ బరిలోకి దిగుతోంది. ఇక ఆరంభంలోనే వికెట్లు సత్తా చాటుతున్న అర్షదీప్ సింగ్ కు విరామం ఇచ్చి, భారత్ ప్రయోగాలు చేస్తోంది. ఇక, అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్, ఈ మ్యాచ్ నెగ్గాలని గట్టి పట్టుదలగా ఉంది.
అద్బుత రికార్డు..
ఈ వేదికపై ఇండియాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఆడిన ఐదింటిలో నాలుగు విజయాలను సాధించింది. గతేడాది జనవరి 7న శ్రీలంకతో ఆడిన మ్యాచ్ లో 91 పరుగులతో భారీ విజయాన్ని సాధించింది. ఇక తొలిసారిగా 2013లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్ లో ఆరు వికెట్లతో సునాయాసంగా భారత్ గెలుపొందింది. ఆ తర్వాత 2017లో న్యూజిలాండ్ తో ఆడిన మ్యాచ్ లో 40 పరుగులతో ఓడిపోయినా, 2019లో బంగ్లాదేశ్ లో జరిగిన మ్యాచ్ లో తిరిగి గెలుపు గుర్రాన్ని ఎక్కింది. ఆ మ్యాచ్ లో 8 వికెట్లతో అలవోక విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత సౌతాఫ్రికాతో జూన్ 17, 2022న జరిగిన మ్యాచ్ లో 82 పరుగులతో గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో అచ్చొచ్చిన మైదానంలో మంగళవారం కూడా విజయం సాధించాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ఫియర్లెస్ క్రికెట్ ఆడుతామని ఇండియాకు వచ్చిన ఇంగ్లాండ్ తంటాలు పడుతోంది. ముఖ్యంగా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లోనూ తేలిపోతుంది. జట్టు కూర్పు విషయంలోనూ ఇబ్బంది పడుతోంది. గత మ్యాచ్ లో స్పిన్నర్లు లేక ఇబ్బంది పడింది. ఇక నేటి మ్యాచ్ లో గెలిస్తేనే సిరీస్ లో నిలుస్తుంది. ఈక్రమంలో అన్ని శక్తులు ధారపోసి మ్యాచ్ ను గెలవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. ఈ మ్యాచ్ లో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతోంది. అయితే వికెట్ కీపర్ గా జేమీ స్మిత్ ఆడతాడాని బట్లర్ తెలిపాడు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

