పాక్ పై భారత్ రివేంజ్ విక్టరీ - సెలబ్రేషన్స్ అంటే ఇట్టా ఉండాలి
పాకిస్థాన్ పై టీమిండియా గెలిస్తే సంబరాలు వేరే లెవల్లో ఉండాలి. అలానే చేసుకున్నారు దేశంలోని వివిధ ప్రాంతాల్లోని క్రికెట్ ప్రేమికులు. డాన్సులు చేస్తూ, డ్రమ్ములు వాయిస్తూ తమ ఆనందాన్ని వ్యక్తంచేశారు.
అసలే క్రికెట్ మ్యాచ్. ఆపై ప్రత్యర్థి దాయాది పాక్. మాములుగా వేరే ఏ దేశంపైనా గెలిచినా భారత అభిమానులు కేరింతలతో సరిపెడతారమో. అయితే ఇది వేరే. దాయాది దేశమైన పాకిస్థాన్ పై టీమిండియా విజయం సాధిస్తే.. అదీ ఆసియా కప్ లాంటి ముఖ్యమైన టోర్నీలో.. అది కూడా చివరి వరకు ఉత్కంఠ ఊపేసిన గేమ్ లో గెలిస్తే.. ఇంక క్రికెట్ ప్రేమికులు ఊరుకుంటారా. తమ ఆనందాన్ని, సంతోషాన్ని సంబరంగా వెలిబుచ్చారు.
దేశ వ్యాప్తంగా సంబరాలు..
ఆసియా కప్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై టీమిండియా గెలవటంతో భారత క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఆదివారం జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో దాయాది పాక్ పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో జనం రోడ్లపైకి వచ్చి డాన్సులు చేశారు. జాతీయ జెండాలు చేత పట్టుకుని కేరింతలు కొట్టారు. జయహో భారత్ అంటూ నినాదాలు చేశారు. డ్రమ్ములు వాయిస్తూ, అరుస్తూ, మిఠాయిలు పంచుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
మహారాష్ట్రలోని నాగ్ పూర్, పశ్చిమ బెంగాల్ లోని సిలిగురి, మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లలో క్రికెట్ అభిమానులు ఎలా సంబరాలు చేసుకున్నారో మీరూ చూసేయండి.
#WATCH | People in Madhya Pradesh's Indore celebrate after India defeated Pakistan by 5 wickets in #AsiaCup2022 match. pic.twitter.com/yTeqG99fFM
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 28, 2022
చిరకాల ప్రత్యర్థిపై టీమిండియా పంజా విసిరింది. ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 147 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం టీమిండియా 19.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసియా కప్‌లో భారత్ తన తదుపరి మ్యాచ్‌లో హాంగ్ కాంగ్‌తో తలపడనుంది. ఆగస్టు 31వ తేదీన ఈ మ్యాచ్ జరగనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే సెప్టెంబర్ 4వ తేదీన జరిగే సూపర్-4 మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ మళ్లీ తలపడనున్నాయి.
#WATCH | People celebrate in West Bengal's Siliguri as India beat Pakistan by 5 wickets in #AsiaCup2022 pic.twitter.com/nnaOJVGpdK
— ANI (@ANI) August 28, 2022
#WATCH | Celebrations in Maharashtra's Nagpur after India's victory over Pakistan in #AsiaCup pic.twitter.com/9RjAou3QD3
— ANI (@ANI) August 28, 2022