అన్వేషించండి
IND vs SL: సమం చేస్తారా, సమర్పించేస్తారా ?, నేడే కీలకమైన మూడో వన్డే
Sri Lanka vs India: టీమ్‌ఇండియాకు వన్డేల్లో శ్రీలంక చుక్కలు చూపిస్తోంది. ఒక మ్యాచ్ టై చేసుకుని.. మరో పోరులో ఓడిన భారత్‌కు నేడు చివరి పరీక్ష ఎదురుకానుంది.

నేడే కీలకమైన మూడో వన్డే
Source : BCCI
Sri Lanka vs India 3rd ODI: శ్రీలంక(SL)తో జరుగుతున్న మూడో మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్(India) కీలకమైన మ్యాచ్‌కు సిద్ధమైంది. మూడు వన్టేల సిరీస్‌లో ఇప్పటికే రెండు వన్డేలు పూర్తవ్వగా.. లంక 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్‌లో లంక గెలిస్తే సిరీస్ ఆ జట్టు వశంకానుంది. భారత్ గెలిస్తే సిరీస్ సమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ టైగా ముగియగా, రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో మూడో వన్డేలో తలపడనున్న భారత్ సిరీస్ ఓటమిని తప్పించుకోవాలని చూస్తోంది. 1997 నుంచి శ్రీలంకతో భారత్ ఒక వన్డే సిరీస్‌ను కూడా కోల్పోలేదు. శ్రీలంక ప్రస్తుత ప్రధాన కోచ్ సనత్ జయసూర్య నేతృత్వంలో లంక జట్టు కొత్త రికార్డు నెలకొల్పాలని చూస్తుండగా... గౌతం గంభీర్ నేతృత్వంలోని భారత జట్టు రికార్డు కాపాడుకోవాలని పట్టుదలతో ఉంది.
It's Match Day in Colombo!
— BCCI (@BCCI) August 7, 2024
All in readiness for the 3rd and Final #SLvIND ODI 🙌#TeamIndia pic.twitter.com/dYlsS87BkZ
మార్పులతో బరిలోకి...
ఈ మ్యాచ్‌లో టీమిండియా కీలక మార్పులతో బరిలోకి దిగనుంది. శివమ్ దూబే.. బదులు ఆల్‌రౌండర్‌గా రియాన్ పరాగ్(Riyan Parag)ని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో పరాగ్ వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. భారత్ బ్యాటింగ్ ఆందోళనపరుస్తోంది. విరాట్ కోహ్లీ వరుసగా విఫలమవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కోహ్లీకి ఈ మైదానంలో మంచి వన్డే రికార్డు ఉంది. కోహ్లీ వరుసగా నాలుగు సెంచరీలు చేశాడు. ఇంకా ఆ ఆధిపత్యం మరోసారి చూపాలని విరాట్ చూస్తున్నాడు. కోహ్లీ గత రెండు మ్యాచ్‌ల్లో 38 పరుగులు చేశాడు, విరాట్ ఈసారి భారీ స్కోరుపై కన్నేశాడు. రోహిత్ శర్మ, కోహ్లి రాణిస్తే భారత్‌కు బ్యాటింగ్‌లో తిరుగుండదు. మొదటి మ్యాచ్‌లో వనిందు హసరంగా లెగ్-స్పిన్‌కు భారత టపార్డర్ కుప్పకూలింది. శ్రేయస్ అయ్యర్, KL రాహుల్ గతంలో స్పిన్నర్లపై ఆధిపత్యం చెలాయించారు, అయితే లంకలో రాణించలేకపోతున్నారు. 2023 ప్రపంచ కప్‌లో అద్భుతంగా రాణించిన భారత బ్యాటర్లు మరోసారి అదే ఫామ్‌ను కొనసాగిస్తే సిరీస్ సమం కావడం ఖాయం.
టీమిండియా 11
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రియాన్ పరాగ్, కేఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్
శ్రీలంక: చరిత్ అసలంక (కెప్టెన్), నిసాంక, ఆవిష్క ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, లియనాగె, వెల్లలాగె, కమిందు మెండిస్, అకిల దనంజయ, వాండర్సె, అసిత్ ఫెర్నాండో
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion