అన్వేషించండి
Advertisement
India vs South Africa: మరో రోజులో సిరీస్ ఆరంభం, దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ
Lungi Ngidi : మూడు మ్యాచ్‌లో టీ 20 సిరీస్‌లో తొలి మ్యాచ్ రేపు ప్రారంభం కానున్న వేళ సౌతాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడి టీ20 సిరీస్ కు దూరమయ్యాడు.
సుదీర్ఘ పర్యటన కోసం దక్షిణాఫ్రికాలో టీమిండియా అడుగుపెట్టింది. దక్షిణాఫ్రికాతో రేపటి నుంచే టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. డిసెంబరు 17 నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. తర్వాత టెస్ట్ సిరీస్ కూడా ఉంది. ఇప్పటికే సౌతాఫ్రికా చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు విమనాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ముందుగా వైట్ బాల్ సిరీస్ జరగనుండంతో ప్రస్తుతానికి టీ20, వన్డే సిరీస్ ఆడే జట్లు మాత్రమే సౌతాఫ్రికాకు వెళ్లాయి. టెస్టు సిరీస్ ఆడే జట్టు తర్వాత వెళ్లనుంది.
మూడు మ్యాచ్‌లో టీ 20 సిరీస్‌లో తొలి మ్యాచ్ రేపు ప్రారంభం కానున్న వేళ సౌతాఫ్రికాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ లుంగీ ఎంగిడి టీ20 సిరీస్ కు దూరమయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోలేక పోవడంతో లుంగీ ఎంగిడిని సిరీస్ నుంచి దూరం పెట్టారు. అతని స్థానంలో బైరాన్ హెండ్రిక్స్ జట్టులోకి వచ్చాడు. ఎంగిడి టెస్టు సిరీస్ లో అతని తిరిగి జట్టులో చేరే అవకాశం ఉంది. ఫిట్ గా ఉంటేనే లుంగీ ఎన్‌గిడి జట్టులోకి తిరిగివచ్చే అవకాశం ఉందని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తెలిపింది. ఇప్పటికే కీలక బౌలర్ కగిసో రబడకు దక్షిణాఫ్రికా విశ్రాంతినిచ్చింది. ప్రస్తుం ఎంగిడి గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఇద్దరు కీలక పేసర్లు జట్టులో లేకపోవటంతో ఆ జట్టు బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోంది. ప్రపంచకప్‌లో తీవ్రంగా నిరాశపర్చిన కెప్టెన్ తెంబా బావుమాను కెప్టెన్ పదవి నుంచే కాక టీ20, వన్డే సిరీస్‌ల నుంచి తప్పించారు. అతడి స్థానంలో ఐడెన్ మార్‌క్రమ్‌కు కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. రబాడాకు కూడా జట్టులో స్థానం దక్కలేదు.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 10 నుంచి మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ రేపు ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ డర్బన్ లో 10న జరుగుతుంది. డిసెంబర్ 12న రెండో మ్యాచ్ గ్కెబెర్హాలో జరుగుతుంది. డిసెంబర్ 14న జోహన్నెస్ బర్గ్ లో మూడో టీ20 మ్యాచ్ జరుగుతుంది. టీ20 సిరీస్ తరువాత మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 17 నుంచి డిసెంబర్ 21 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. డిసెంబర్ 26 నుంచి రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ప్రారంభమవుతుంది.
దక్షిణాఫ్రికా టీ 20 జట్టు: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నాండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, డొనొవాన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, ట్రిస్టన్ స్టబ్స్, లిజాడ్ విలియమ్స్.
దక్షిణాఫ్రికా వన్డే జట్టు: ఐడెన్ మార్‌క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహారాజ్, మిహ్లాలీ మ్పోంగ్వానా, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, షంసి, వాండర్ డసెన్, కైల్ వెరిన్నే, లిజాడ్ విలియమ్స్.
టీమిండియా టీ20జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, దీపక్ చాహర్.
టీమిండియా వన్డే జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్)(వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆట
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion