అన్వేషించండి
Advertisement
IND vs SA: సిరీస్‌పై భారత్ కన్ను , ప్రొటీస్‌తో రెండో వన్డే నేడే
India vs South Africa 2nd ODI : దక్షిణాఫ్రికాతో కీలకమైన రెండో వన్డేకి టీమిండియా సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
దక్షిణాఫ్రికాతో కీలకమైన రెండో వన్డేకి టీమిండియా సిద్ధమైంది. తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న టీమిండియాకు విజయం సాధించడం అంత కష్టమేమీ కాదు. రెండో వన్డేలోనూ విజయం సాధించి మూడో వన్డేల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే దక్కించుకోవాలని రాహుల్ సేన భావిస్తోంది. అయితే ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సమం చేయాలని సఫారీ జట్టు పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‌లో రజత్ పాటిదార్, రింకూ సింగ్‌లలో ఒకరు తుది జట్టులోకి రానున్నారు. యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్ అద్భుత బౌలింగ్‌తో తొలి వన్డేలో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా.... అదే ఊపు కొనసాగించాలని కసిగా ఉంది. వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని యువ భారత్ పట్టుదలగా ఉంది.
బాక్సింగ్ డే నుంచి ప్రారంభమయ్యే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం తొలి వన్డే అనంతరం శ్రేయస్ అయ్యర్ టెస్ట్ జట్టుతో కలిశాడు. ఈ మ్యాచ్‌కు, వచ్చే మ్యాచ్‌కు అయ్యర్ వన్డే జట్టులో ఉండడు. రింకూసింగ్‌ను ఈ మ్యాచ్‌లో బరిలోకి దింపే అవకాశం ఎక్కువగా ఉంది. ఉప ఖండంలోని పిచ్‌లతో పోలిస్తే ఎక్కువ బౌన్స్‌ను అందించే దక్షిణాఫ్రికా పిచ్‌లపై రింకూసింగ్ మెరుగ్గా రాణించే అవకాశం ఉందని మాజీలు అభిప్రాయపడుతున్నారు. రజిత్ పాటిదార్ కూడా తుది జట్టులో స్థానం ఆశిస్తున్నాడు. రింకూసింగ్ ఆరో స్థానంలో... రజత్ పాటిదార్ నాలుగో స్థానంలో బరిలో దిగే అవకాశం ఉంది. ఇప్పటికే అయ్యర్ స్థానం ఖాళీ కావడంతో అతని స్థానంలో రజత్ పాటిదార్‌ను తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. రింకు సింగ్, పాటిదార్ ఇద్దరినీ జట్టులోకి తీసుకుంటే తిలక్ వర్మపై వేటు వేయాల్సి ఉంటుంది.
తొలి వన్డేలో సాయి సుదర్శన్ అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌తోనే అర్ధ సెంచరీతో అదరగొట్టి భవిష్యత్తు స్టార్‌గా కనిపిస్తున్నాడు. క్వింటన్ డి కాక్ శకం తర్వాత దక్షిణాఫ్రికా బలహీనంగా మారింది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఘారంగా ఓడిపోయింది. రాస్సీ వాన్ డెర్ డస్సెన్స్, హెన్రిచ్ క్లాసెన్స్, డేవిడ్ మిల్లర్స్‌లు ఫామ్‌లోకి రావాలని ప్రొటీస్ కోరుకుంటోంది. టీమిండియా బౌలింగ్‌లో అర్ష్‌దీప్, అవేశ్ ఖాన్ మెరుగ్గా రాణిస్తున్నారు. కానీ ముఖేష్ కుమార్ బౌలింగే భారత్‌ను ఆందోళనపరుస్తోంది. తొలి వన్డేలో ముఖేష్ కుమార్, 7 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా తీయకుండా 46 పరుగులు ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లో మెరుగ్గా బౌలింగ్ చేయాలని ముఖేష్ భావిస్తున్నాడు. ఒకవేళ ముఖేష్‌పై వేటు పడితే ఆకాష్ దీప్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ అనుభవం జట్టుకి ఉపయోగపడనుంది. చాహల్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
భారత జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, రింకు సింగ్, ఆకాష్ దీప్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్.
దక్షిణాఫ్రికా: ఐడెన్ మాక్రమ్(కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, వియాన్ ముల్డర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, రాస్సీ వాన్ స్హమ్‌సి, టాబ్రా విల్సాద్‌స్హామ్స్ , కైల్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement