India vs SL 3rd ODI: తిరువనంతపురంలో భారత్, శ్రీలంక మూడో వన్డే - రికార్డులు టీమిండియాకే అనుకూలం
India vs SL 3rd ODI: భారత్- శ్రీలంకల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా ఆఖరిదైన మూడో వన్డే జనవరి 15న తిరువనంతపురం వేదికగా జరగనుంది. మూడో వన్డేలోనూ గెలిచి శ్రీలంకను వైట్ వాష్ చేయాలని భావిస్తోంది.
India vs SL 3rd ODI: భారత్- శ్రీలంకల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా ఆఖరిదైన మూడో వన్డే జనవరి 15న తిరువనంతపురం వేదికగా జరగనుంది. మొదటి రెండు మ్యాచ్ లను గెలుచుకున్న టీమిండియా సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉంది. ఇప్పడు భారత్ ముందు ఒక మంచి అవకాశం ఉంది. మూడో వన్డేలోనూ గెలిచి శ్రీలంకను వైట్ వాష్ చేయాలని భావిస్తోంది. అలాగే ఈ మైదానంలో రికార్డు కూడా భారత్ కు అనుకూలంగానే ఉంది.
జరిగిన ఒక్క మ్యాచ్ లో భారత్ గెలుపు
తిరువనంతపురంలోని గ్రీన్ ఫీల్డ్ మైదానంలో ఇప్పటివరకు ఒకే ఒక్క వన్డే మ్యాచ్ జరిగింది. వెస్టిండీస్- టీమిండియా మధ్య జరిగిన ఆ మ్యాచ్ లో విండీస్ పై భారత్ విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 104 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత భారత్ ఒకే ఒక వికెట్ కోల్పోయి 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు టీమిండియాకు ఈ మైదానంలో తన రికార్డును మరింత మెరుగుపరచుకునే అవకాశం వచ్చింది. మూడో వన్డేలో శ్రీలంకపై గెలిచి క్లీన్ స్వీప్ చేసే ఛాన్స్ దక్కించుకుంది.
స్పిన్ కు అనుకూలం
గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం స్పిన్నర్లకు స్వర్గధామంలా ఉంటుంది. కాబట్టి ఇరుజట్ల స్పినర్లకు లాభం. మ్యాచ్ ప్రారంభంలో పేస్ బౌలర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ మైదానంలో మంచు ప్రభావం చూపే అవకాశం ఎక్కువ. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది.
భారత జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేెెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ షమీ.
శ్రీలంక జట్టు (అంచనా)
పాతుమ్ నిశ్సాంక, నువానిడు ఫెర్నాండో, చరిత్ అసలంక, దసున్ శనక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, చమిక కరుణరత్నే, వానిందు హసరంగా, కసున్ రజిత, లాహిరు కుమార, దునిత్ వెలాలెజ్.
Hello Trivandrum 👋🏻
— BCCI (@BCCI) January 13, 2023
We are here for the 3️⃣rd and final #INDvSL ODI ✅#TeamIndia pic.twitter.com/xzpr7UTCMT
FIFTY!
— BCCI (@BCCI) January 12, 2023
A gritty half-century by @klrahul as he brings up his 12th ODI half-century 👏
Live - https://t.co/jm3ulz5Yr1 #INDvSL @mastercardindia pic.twitter.com/ePUQABti4M
𝙆𝙪𝙡𝘾𝙝𝙖 𝙞𝙨 𝘽𝙖𝙘𝙠! 🤗
— BCCI (@BCCI) January 13, 2023
Presenting special edition of Chahal TV 📺 from Kolkata
𝗗𝗢 𝗡𝗢𝗧 𝗠𝗜𝗦𝗦: @yuzi_chahal interviews Milestone Man @imkuldeep18 post #TeamIndia’s victory in the 2⃣nd #INDvSL ODI 👌🏻👌🏻 - By @ameyatilak
Full interview 🔽https://t.co/K1dRVC6BCH pic.twitter.com/Ixk7rLCB1P