India vs New Zealand Tour: రేపట్నుంచి భారత్- న్యూజిలాండ్ టీ20 సిరీస్... పూర్తి వివరాలివే
India vs New Zealand Tour: టీ20 ప్రపంచకప్ లో సెమీ ఫైనల్లోనే వెనుదిరిగిన టీమిండియా మరో పొట్టి సిరీస్ కు సిద్ధమైంది. రేపటి నుంచి న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడబోతోంది.
India vs New Zealand Tour: టీ20 ప్రపంచకప్ లో సెమీ ఫైనల్లోనే వెనుదిరిగిన టీమిండియా మరో పొట్టి సిరీస్ కు సిద్ధమైంది. రేపటి నుంచి న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ ఆడబోతోంది. దీని తర్వాత వన్డే సిరీస్ ఉంటుంది. ఇప్పటికే దీనికి సంబంధించి రెండు వేర్వేరు జట్లను బీసీసీఐ ప్రకటించింది.
కివీస్ తో సిరీస్ లకు సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇంకా కేఎల్ రాహుల్ లు విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే టీ20 లకు హార్దిక్ పాండ్య, వన్డే సిరీస్ కు శిఖర్ ధావన్ కెప్టెన్లుగా వ్యవహరించున్నారు. టీ20 ల్లో యువ ఆటగాళ్లు ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ సేన్ లకు అవకాశం దక్కింది.
టీ20 సిరీస్ షెడ్యూల్
తొలి టీ20: నవంబర్ 18, స్కై మైదానం, వెల్లింగ్టన్
రెండో టీ20: నవంబర్ 20, బే ఓవల్, మౌంట్ మాంగనుయ్
మూడో టీ20: నవంబర్ 22, మెక్‌లీన్ పార్క్, నేపియర్
భారత టీ20 జట్టు:
హార్దిక్ పాండ్య (కెప్టెన్), రిషభ్‌పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.
కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం
'ప్రధాన ఆటగాళ్లు ఈ సిరీస్ కు అందుబాటులో లేరు. అయితే ఇప్పుడున్న ప్లేయర్స్ కూడా గత ఒకటి, రెండేళ్లుగా మంచి క్రికెట్ ఆడుతున్నారు. ఇప్పుడు వారికి అవకాశం వచ్చింది. సీనియర్ల గైర్హాజరీలో తమని తాము నిరూపించుకోవడానికి వారికిది చక్కని అవకాశం. వారిలో ఉన్న సత్తాను బయటకు తీయడానికి ఈ వేదిక ఉపయోగపడుతుంది. కొత్త జట్టు కొత్త శక్తితో మేం ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నాం.' అని కెప్టెన్ హార్దిక్ అన్నాడు.
వన్డే సిరీస్ షెడ్యూల్
మొదటి వన్డే: నవంబర్ 25, ఈడెన్ పార్క్, ఆక్లాండ్
రెండో వన్డే: నవంబర్ 27, సెడాన్ పార్క్, హామిల్టన్
మూడో వన్డే: నవంబర్ 30, హాగ్లే ఓవల్, క్రైస్ట్ చర్చ్
భారత వన్డే జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాజ్ అహ్మద్, యుజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్, కుల్‌దీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్.
స్ట్రీమింగ్ వివరాలు:
మూడు టీ20లు మన కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతాయి.
మూడు వన్డేలు ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతాయి.
భారత్ - న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్‌లను టీవీల్లో డీడీ స్పోర్ట్స్‌లోను, ఓటీటీల్లో అమెజాన్ ప్రైమ్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
Regroup ✅
— BCCI (@BCCI) November 16, 2022
Restart ✅#TeamIndia | #INDvNZ pic.twitter.com/6QK7hLYxwd
Did anyone say Captains' photoshoot? 📸
— BCCI (@BCCI) November 16, 2022
That's Some Entry! 😎 #TeamIndia | #NZvIND pic.twitter.com/TL8KMq5aGs