IND vs ENG 5th Test Day1: తొలిరోజు ఆధిపత్యం మనదే - స్పిన్‌కు ఇంగ్లాండ్ దాసోహం
India vs England : ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో ఆరంభమైన ఐదో టెస్టు తొలిరోజు ఆటలో భారత స్పిన్నర్లు విజృంభించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 218 పరుగులకు ఆలౌటైంది.
![IND vs ENG 5th Test Day1: తొలిరోజు ఆధిపత్యం మనదే - స్పిన్‌కు ఇంగ్లాండ్ దాసోహం India vs England 5th Test Day 1 Rohit Sharma 50 Strengthens Indias Grip On Cusp Of Stumps IND vs ENG 5th Test Day1: తొలిరోజు ఆధిపత్యం మనదే - స్పిన్‌కు ఇంగ్లాండ్ దాసోహం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/07/8815879faa64a19e0a609b69a760c0231709812669573872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rohit scores fifty, Yashasvi Jaiswal falls for 57: ధర్మశాల(Dharmashala) వేదికగా ఇంగ్లాండ్(England)తో ఆరంభమైన ఐదో టెస్టు తొలిరోజు ఆటలో భారత స్పిన్నర్లు విజృంభించారు. కుల్దీప్ యాదవ్, అశ్విన్‌లు చెలరేగడంతో.. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టు 218 పరుగులకు ఆలౌటైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను...... ఆరంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి.... 135 పరుగులు చేసింది. యువ ఓపెనర్ జైస్వాల్ 57 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ 52, శుభమన్ గిల్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. స్పిన్నర్లు రాకతో పర్యాటక జట్టు బ్యాటింగ్ ఒక్కసారిగా కూప్పకూలింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఓపెనర్ జాక్ క్రాలే 79, జానీ బెయిర్‌స్టో 29, జో రూట్ 26, బెన్ డకెట్ 27 పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లతో చెలరేగగా, అశ్విన్ నాలుగు, జడేజాకు.. ఒక వికెట్ దక్కింది.
ఆరంభంలో బాగా ఆడినా
భారత్‌తో జరుగుతున్న అయిదో టెస్ట్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఆరంభంలో సాధికారికంగా బ్యాటింగ్ చేసింది. తొలి రోజు లంచ్ బ్రేక్ సమయానికి రెండు వికెట్ల నష్టానికి సరిగ్గా 100 పరుగులు చేసింది. ఆరంభంలో బజ్ బాల్‌ను పక్కన పెట్టిన ఇంగ్లాండ్.. ఆచితూచి బ్యాటింగ్ చేసింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూకుడు తగ్గించారు. సిరాజ్, బుమ్రా అద్భుతమైన బంతులతో పరుగులను కట్టడి చేస్తున్నారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు తొలి 5 ఓవర్లకు 23 పరుగులు చేశారు. పది ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 35 పరుగులు చేశారు. ఇంగ్లాండ్ ఓపెనర్లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేస్తున్నా ఆచితూచి పరుగులు రాబడుతున్నారు. 12వ ఓవర్లో సిరాజ్ వేసిన బంతి క్రాలే ప్యాడ్స్‌ను తాకగా అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. భారత్ రివ్యూ కోరినా అనుకూల ఫలితం రాలేదు. 15 ఓవర్లలో ఇంగ్లాండ్ వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న బెన్ డకెట్ 18వ ఓవర్లో కుల్‌దీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. గిల్ అద్భుతమైన క్యాచ్‌తో డకెట్ వెనుదిరిగాడు. 27 పరుగులు చేసిన డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను శుభ్‌మన్ గిల్ అద్భుతంగా ఒడిసిపట్టాడు. తొలి రోజు ఆటలో లంచ్ బ్రేక్ ముందు చివరి ఓవర్లో భారత్‌కు రెండో వికెట్ దక్కింది. 26వ ఓవర్లో ఒలీ పోప్ 11 పరుగులు చేసి కుల్‌దీప్ వేసిన బంతికి స్టంప్ ఔట్‌గా వెనుతిరిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా క్రాలే 61 పరుగులతో క్రీజులో ఉన్నాడు. భారత్ తీసిన రెండు వికెట్లు కుల్‌దీప్ యాదవ్‌కే దక్కాయి.
కుల్‌దీప్, అశ్విన్ ఉచ్చులో చిక్కి...
కుల్‌దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51) తమ స్పిన్ మాయజాలంతో పర్యటక జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వరుసగా వికెట్లు తీసి బ్రిటీష్ జట్టును కుప్పకూల్చారు.తొలి రోజు టీ బ్రేక్.. ఇంగ్లాండ్ 194/8స్థితిలో ఉన్నా ఇంగ్లాండ్ ఆ తర్వాత మిగిలిన రెండు వికెట్లు కోల్పోయింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)