అన్వేషించండి
Advertisement
India vs Bangladesh 2024: బంగ్లాతో ఇక అంత ఈజీ కాదు, టీమిండియాకు నిజమైన "టెస్ట్"
India vs Bangladesh: చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య రేపటి నుంచి తొలి టెస్ట్ ఆరంభం కానుంది. భారత పర్యటనలో బంగ్లాదేశ్ రెండు టెస్టులు.. మూడు టీ 20 మ్యాచులు ఆడనుంది.
IND vs BAN 2024 schedule: బంగ్లాదేశ్(Bangladesh)తో టెస్ట్ సిరీస్‌కు భారత్ (India) సిద్ధమైంది. మాములుగా అయితే ఈ టెస్ట్ సిరీస్‌కు అంత ప్రాధాన్యం ఉండేది కాదు. ఎందుకంటే స్వదేశంలో భారత్‌ను ఎదుర్కొని.. పసికూన బంగ్లాదేశ్ గెలవడం అంత ఈజీ కాదు కాబట్టి. కానీ ఇప్పుడు ఈ కథంతా మారిపోయింది. ఎందుకంటే బంగ్లా పసికూన కాదు. పాక్ గడ్డపైనే పాక్‌నే చిత్తుచిత్తుగా ఓడించి.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించి.. భారత్‌లో అడుగుపెట్టింది. ఇప్పుడు మంచి టచ్‌లో ఉన్న ఆటగాళ్లు... ఆత్మ విశ్వాసంతో ఉన్న జట్టుతో బంగ్లా.. భారత్‌కు గట్టి పోటీ ఇస్తుందన్న అంచనాలు ఉన్నాయి. నాణ్యమైన స్పిన్నర్లు, మంచి బ్యాటర్లతో బంగ్లా పటిష్టంగానే కనిపిస్తోంది. కానీ స్వదేశంలో భారత్‌ను ఎదుర్కోవడం అంత తేలిక కాదు. ఎందుకంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్‌లో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్.. ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి ఆ పాయింట్లను మరింత పెంచుకోవాలని చూస్తోంది.
Intensity 🔛 point 😎🏃♂️
— BCCI (@BCCI) September 16, 2024
Fielding Coach T Dilip sums up #TeamIndia's competitive fielding drill 👌👌 - By @RajalArora #INDvBAN | @IDFCFIRSTBank pic.twitter.com/eKZEzDhj9A
రేపటి నుంచే పోరు ఆరంభం
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య రేపటి నుంచి తొలి టెస్ట్ ఆరంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు చెన్నై చేరుకున్నాయి. ఈ సిరీస్‌లో బంగ్లాదేశ్ కొత్త ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. భారత పర్యటనలో బంగ్లాదేశ్ రెండు టెస్టులు.. మూడు టీ 20 మ్యాచులు ఆడనుంది. శ్రీలంక పర్యటన తర్వాత దాదాపు 43 రోజుల విరామం తర్వాత, భారత క్రికెట్ స్టార్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా.. మళ్లీ బరిలోకి దిగుతున్నారు. శ్రీలంక పర్యటనలో టీ 20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 విజయం తర్వాత, శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని జట్టు జింబాబ్వేలో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించి, 5-మ్యాచ్‌ల T20I సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది. బంగ్లాదేశ్.. పాకిస్థాన్‌పై 2-0తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది.
హెడ్ టు హెడ్ రికార్డులు ఇలా
టీమిండియా- బంగ్లాదేశ్ ఇప్పటివరకు 13 టెస్ట్ మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ ఒక్క టెస్ట్ కూడా ఓడిపోలేదు. 13 మ్యాచుల్లో 11 భారత్ గెలవగా... రెండు టెస్టులు డ్రా అయ్యాయి.
వేదికలు ఇలా..
భారత్ vs బంగ్లాదేశ్, 1వ టెస్టు: రేపటి నుంచి
ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై
భారత్ vs బంగ్లాదేశ్, 2వ టెస్టు
సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు, కాన్పూర్
ఎక్కడ చూడాలి?
JioCinema యాప్, వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది.
స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారం ఉంది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement